
అక్కినేని అఖిల్ తన నిశ్చితార్థం చేసుకున్న జైనాబ్ రవడ్జీతో ఎయిర్ పోర్టులో కనిపించారు. ఈ జంటను చూసిన నెటిజన్లు వారిని ‘క్యూట్ పెయిర్’ అంటూ ప్రశంసిస్తున్నారు. ఈ జంటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Key Points
అఖిల్ మరియు జైనాబ్ జంట ఎయిర్ పోర్టులో కనిపించారు.
వారి చేతులు పట్టుకుని వెళ్తున్న వీడియో వైరల్ అయింది.
నెటిజన్లు వారి జంటను 'క్యూట్' అంటూ కామెంట్ చేస్తున్నారు.
అఖిల్ ప్రస్తుతం 'లెనిన్' సినిమాలో నటిస్తున్నాడు.
అఖిల్ మరియు జైనాబ్ ఎయిర్ పోర్టులో
అక్కినేని హీరో నాగార్జున(Nagarjuna) తనయుడు అఖిల్(Akhil) అందరికీ సుపరిచితమే. ప్రస్తుతం ‘లెనిన్’(Lenin) మూవీలో నటిస్తున్నాడు. శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు మురళీ కిశోర్ అబ్బూరు(Murali Kishore Abooru) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక అతని వ్యక్తిగత విషయానికి వస్తే.. బడా బిజినెస్ మ్యాన్ కూతురు అయినటువంటి జైనాబ్ రవడ్జీ(Zainab Ravadzee)తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇక ఈ విషయాన్ని నాగార్జున ఎక్స్(X) వేదికగా వెల్లడిస్తూ వీరి ఎంగేజ్‌మెంట ఫొటోస్ షేర్ చేశాడు. దీంతో ఆ విషయం కాస్తా నెట్టింట అందరికీ తెలిసింది.
ఇదిలా ఉంటే.. తాజాగా అఖిల్ తనకు కాబోయే భార్య జైనాబ్‌తో కలిసి ఎయిర్ పోర్టులో కనిపించారు. ఒకరి చేతులు మరొకరు పట్టుకుని వెళ్తూ ఈ జంట మీడియాకు చిక్కారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు పెళ్లికి ముందు భార్యతో బాగా ఎంజాయ్ చేస్తున్నాడుగా అని, క్యూట్ పెయిర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియో
నెటిజన్ల స్పందన
అఖిల్ మరియు జైనాబ్ జంట యొక్క ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వారి పెళ్లికి అభిమానులు ఆశిస్తున్నారు. అఖిల్ సినిమా కెరీర్ కూడా బాగుండాలని కోరుకుంటున్నారు.


