|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కళ్యాణ్ సంచలనం: టికెట్ రేట్లపై షాకింగ్ కామెంట్స్! ఫ్యాన్స్ కి పూనకాలే!!

Published: 15-03-2026, 3:05 PM
పవన్ కళ్యాణ్ సంచలనం: టికెట్ రేట్లపై షాకింగ్ కామెంట్స్! ఫ్యాన్స్ కి పూనకాలే!!
  • ఉగాది రోజున మార్చ్ 19న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదల!
  • టికెట్ రేట్లు పెంచితే వచ్చే 18% జీఎస్టీ గవర్నమెంట్ కి చేరుతుంది: పవన్ కళ్యాణ్
  • భీమ్లా నాయక్ సమయంలో టికెట్ రేట్ల కోసం నిలబడ్డ మీ అందరికీ థాంక్స్: పవన్
  • అందరి హీరోల అభిమానులను గౌరవిస్తాను, ఏ హీరోతో విభేదాలు లేవు: పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మార్చి 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా టికెట్ రేట్ల పెంపుపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

టికెట్ రేట్లపై పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..?

Pawan Kalyan : హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చ్ 19న ఉగాది రోజు రిలీజ్ కానుంది. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాతో పాటు, సినిమాకు పనిచేసిన వారి గురించి, పలు అంశాల గురించి మాట్లాడారు.

ఇటీవల పెద్ద సినిమాలు, స్టార్ హీరోల సినిమాలకు టికెట్ రేట్లు పెంచుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టికెట్ రేట్ల పెంపు గురించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు.

వేరే హీరోల సినిమాలకి ఎక్కువ రేట్లు ఇచ్చా: పవన్

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. అందరి హీరోల సినిమాలు బాగుండాలి. టికెట్ రేట్లు పెంచడంపై కొంతమంది మాట్లాడతారు. సినిమా కంపల్సరీ కాదు. గన్ పెట్టి చూడమని చెప్పం కదా. మొదటిరోజే చూడాలని ఏం లేడు కదా. ఇంక నేను నా సినిమాలకు తక్కువ రేట్లు ఇచ్చుకొని పుష్ప, కల్కి.. ఇలా వేరే హీరోలకు ఎక్కువ రేట్లు ఇచ్చాను. టికెట్ రేటు పెంచిన దానిపై 18 శాతం GST గవర్నమెంట్ కి వస్తుంది. వదిలేస్తే బ్లాక్ లో టికెట్ అమ్ముకుంటారు. ఆ డబ్బులు ఎటు పోతాయో తెలీదు. అందుకే అన్ని ఆలోచించి హీరో ఎవరు అనేది సంబంధం లేకుండా ఏ హీరో సినిమా వచ్చినా టికెట్ రేట్లు పెంచడానికి పర్మిషన్స్ ఇస్తున్నారు.

ఫ్యాన్ వార్స్ పై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

కర్ణాటకలో తెలుగు సినిమా పోస్టర్లు చింపినా సినిమా బాగుండాలని నేను కాంతార సినిమాకు పర్మిషన్ ఇచ్చాను. సినిమా బాగుండాలి. ఫ్యాన్ వార్స్ చూస్తూ ఉంటాను. ఆన్లైన్ లో అది కరెక్ట్ వాతావరణం కాదు. నేను ఒక హీరోగా చెప్తున్నా అందరి హీరోల అభిమానులను గౌరవిస్తాను. ఏ హీరోతో విబేధాలు లేవు నాకు. అందరు హీరోలు హిట్స్ కొట్టాలి. నేను చాలా సార్లు చెప్పాను ఇది. ఒక హీరోగా నిర్మాతలు బాగుండాలి. భీమ్లా నాయక్ సినిమా సమయంలో టికెట్ రేట్ల విషయంలో మీరంతా నా కోసం నిలబడ్డారు అని అన్నారు.

పవన్ కళ్యాణ్ టికెట్ రేట్ల గురించి మాట్లాడిన ఈ న్యూస్ టాలీవుడ్ లో ఒక సంచలనం సృష్టించింది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.