
90 ల బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ మరియు ఐశ్వర్య రాయ్ ప్రేమ జంటగా పేరుగాంచారు. ఈ జంట విడిపోవడానికి గల కారణాల గురించి సీనియర్ నటి హిమాని శివపురి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
Key Points
ఐశ్వర్య రాయ్ కోసం సల్మాన్ ప్రతి రాత్రి వచ్చి ఉదయం వెళ్లిపోయేవాడు.
అభిషేక్ బచ్చన్ తో షూటింగ్ లో సల్మాన్ ఐశ్వర్య గురించి అనవసర వ్యాఖ్యలు చేసాడు.
హిమాని శివపురి ఈ సంఘటనలను తన పాడ్ కాస్ట్ లో వెల్లడించింది.
సల్మాన్, ఐశ్వర్యల ప్రేమ సంబంధం ముగియడానికి గల కారణాన్ని హిమాని వెల్లడించలేదు.
సల్మాన్ ఐశ్వర్య ప్రేమ
90ల్లో బాలీవుడ్ లో లవ్ పెయిర్ అంటే ముందుగా సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ జోడీ పేరు వినిపించేది. వీళ్లు అప్పుడు గోల్డెన్ పెయిర్ గా నిలిచారు. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ జంట విడిపోయింది. వీళ్ల లవ్ కు ఎండ్ కార్డు పడింది. అయితే అప్పుడు ఐశ్వర్య రాయ్ పై సల్మాన్ ప్రేమ ఎలా ఉండేదో సీనియర్ నటి, హీరోయిన్ హిమాని శివపురి తాజాగా రివీల్ చేసింది.
అప్పటి నుంచి ఇప్పటివరకూ ఇండియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా సల్మాన్ ఖాన్ పేరు వినిపిస్తూనే ఉంది. అయితే ఐశ్వర్య రాయ్ తో రిలేషన్ షిప్ లో ఉన్న సమయంలో సల్మాన్ ఖాన్ ఎంతో ప్రేమ చూపించేవాడని తెలిసింది. ఐశ్వర్య సినిమా షూటింగ్ సెట్స్ లో సల్మాన్ రెగ్యులర్‌గా కనిపించేవావడని హిమాని శివపురి రెడ్ ఎఫ్ఎమ్ పాడ్ కాస్ట్ లో వెల్లడించింది. “ఐశ్వర్య, సల్మాన్ రిలేషన్ షిప్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్న టైమ్ అది. అప్పుడు ఐశ్వర్య కోసం సల్మాన్ ప్రతి రాత్రి వచ్చి ఉదయం వెళ్లిపోయేవాడు” అని హిమాని తెలిపింది.
ఐశ్వర్య రాయ్, సల్మాన్ ఖాన్ కలిసి చాలా సినిమాలు చేశారు. అయితే అభిషేక్ బచ్చన్ తో ఐశ్వర్య షూటింగ్ సమయంలో జరిగిన గొడవను హిమాని శివపురి గుర్తు చేసుకుంది. అప్పుడు రోహన్ సిప్పీ డైరెక్షన్ లో ఐశ్వర్య, అభిషేక్ నటిస్తున్నారు. అప్పుడు ఓ సంఘటన జరిగింది.
షూటింగ్ సెట్ లో సంఘటనలు
“సల్మాన్ వచ్చాడు. అతను నాకు, ‘క్యా హై? ఇస్కో సంజావీ. వహీదా రెహ్మాన్ కో దేఖే. అప్నే ఆప్ కో బోహ్త్ ఖుబ్సూరత్ సమజాతి హై (ఇది ఏమిటి? ఆమెకు కాస్త వివరించండి. వహీదా రెహ్మాన్‌ని చూడు ఎంత అందగా ఉందో. ఐశ్వర్య ఏమో చాలా అందంగా ఉందని అనుకుంటుందని కోపం చెప్పాడు. నేను అతన్ని ప్రశాంతంగా ఉండమని, నిశ్శబ్దంగా ఉండమని చెప్పా’’ అని హిమాని తెలిపింది.
అయితే ఆ టైమ్ లో సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ తో సన్నిహితంగా ఉన్నప్పటికీ ఈ జంట విడిపోవడానికి గల కారణాన్ని మాత్రం హిమాని శివపురి వెల్లడించలేదు. ” వాళ్ల మధ్య బంధం పని చేయలేదు. వారి మధ్య సమస్య ఏమిటో వారికి బాగా తెలుస్తుంది” అని చెప్పింది. 2002లో వచ్చిన ‘హమ్ తుమ్హారే హై సనమ్’ చిత్రం తర్వాత సల్మాన్, ఐశ్వర్య మళ్లీ కలిసి సినిమా చేయలేదు.
హిమాని శివపురి వెల్లడి
నటి హిమాని శివపురి ఐశ్వర్యతో తన బంధం గురించి మాట్లాడుతూ.. ‘ఆ అబ్ లౌత్ చలేన్’ సెట్ లో తమ స్నేహం ప్రారంభమైందని చెప్పింది. ఆ తర్వాత మరింత బలపడిందని తెలిపింది. ‘హమారా దిల్ ఆప్కే పాస్ హై’, ‘ఉమ్రావ్ జాన్’ వంటి ప్రాజెక్టులలో కలిసి నటించడంతో మంచి ఫ్రెండ్స్ గా మారామని వివరించింది.
అభిషేక్ బచ్చన్‌ను ఐశ్వర్య వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్లకు ఓ కుమార్తె. మరోవైపు సల్మాన్ ఏమో ఇలియా వంటూర్‌తో సంబంధంలో ఉన్నట్లు పుకారు ఉంది.
హిమాని శివపురి వెల్లడించిన విషయాలు సల్మాన్ మరియు ఐశ్వర్యల ప్రేమ సంబంధం గురించి కొత్త కోణాన్ని వెల్లడించాయి. వారి విడిపోవడానికి గల కారణాలను మాత్రం ఆమె వెల్లడించలేదు.


