|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వేల కోట్లకు అధిపతి అయ్యే అవకాశాన్ని చేజార్చుకున్న కృష్ణ, తండ్రి నిలదీసిన కూతురు..ఆయన సమాధానం విని..

Published: 18-05-2025, 1:19 AM
వేల కోట్లకు అధిపతి అయ్యే అవకాశాన్ని చేజార్చుకున్న కృష్ణ, తండ్రి నిలదీసిన కూతురు..ఆయన సమాధానం విని..

టాలీవుడ్ లెజెండ్ కృష్ణ గురించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. కోట్ల సంపాదనను వదులుకున్న ఆయన, తన కుటుంబం ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోలేదని చెప్పడం విశేషం.

Key Points

1

కృష్ణ నిర్మాతలకు ఆర్థిక సహాయం చేసేవారు.

2

సినిమా ఫెయిల్ అయితే తన రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేవారు.

4

కృష్ణ తన కుటుంబం ఎప్పుడూ డబ్బుల కోసం కష్టపడలేదని చెప్పారు.

కృష్ణ: నిర్మాతలకు అండగా

సూపర్ స్టార్ కృష్ణ ఎంతో గొప్ప మనసు ఉన్న వ్యక్తి  అని ఇండస్ట్రీలో అందరూ ప్రశంసిస్తుంటారు. కొంతమంది అయితే సూపర్ స్టార్ కృష్ణ దేవుడు, భోళా శంకరుడు అని ఆయన వ్యక్తిత్వం గురించి చెబుతుంటారు. చిత్ర పరిశ్రమలో లక్షలు, కోట్ల బడ్జెట్ లో అప్పట్లో సినిమాలు రూపొందించేవారు. కొంతమంది నిర్మాతలు సినిమాలపై ఆసక్తితో ఆస్తులు తాకట్టు పెట్టి మరీ చిత్రాలను నిర్మించేవారు.

అలాంటి నిర్మాతలు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకూడదు అనేది సూపర్ స్టార్ కృష్ణ తన కెరీర్ లో నమ్మిన సిద్ధాంతం. నిర్మాత కష్టాల్లో ఉంటే తన రెమ్యునరేషన్ వదులుకొని మరీ కృష్ణ ఆ చిత్రాలను పూర్తి చేసేవారు. సినిమా ఫెయిల్ అయితే తన రెమ్యునరేషన్ తిరిగి వెనక్కి ఇచ్చేసేవారు. ఇలా కృష్ణ ఎన్నో సందర్భాల్లో చేశారట.

మంజుల ప్రశ్న, కృష్ణ సమాధానం

సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్ లో లెజెండ్ హీరోల్లో ఒకరు. ఆయన నిర్మాతల గురించి పట్టించుకోకుండా తన రెమ్యునరేషన్ తాను తీసుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళితే వేల కోట్లు సంపాదించేవారు అని కొందరు చెబుతుంటారు. సూపర్ స్టార్ కృష్ణ కి రమేష్ బాబు, మహేష్ బాబు, ప్రియదర్శిని, పద్మావతి, ఘట్టమనేని మంజుల సంతానం. వీరు ఎప్పుడూ తండ్రి మాట జవదాటలేదు.

ఓ ఇంటర్వ్యూలో ఘట్టమనేని మంజుల తన తండ్రికి ఊహించని ప్రశ్న సంధించింది. డబ్బు, సంపాదన విషయంలో తండ్రిని ఎప్పుడూ ఏ మాట అడగని మంజుల ఆ ఇంటర్వ్యూలో మాత్రం నిలదీసినట్లుగా ప్రశ్నించింది. కృష్ణతో మంజుల మాట్లాడుతూ.. నిర్మాత కష్టాల్లో ఉంటే డబ్బులు ఇచ్చేశారు, సినిమా ఆడకపోతే రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేశారు, తెలిసిన వ్యక్తులైనా తెలియని వ్యక్తులైనా అడిగిన వాళ్లందరికీ ఆర్థిక సాయం చేశారు. మరి అంతలా మీ సంపాదనని ఎందుకు వదులుకున్నారు నాన్న అని మంజుల ప్రశ్నించింది.

కుటుంబ విలువల ప్రాముఖ్యత

మంజులకి కృష్ణ ఇచ్చిన సమాధానం హైలైట్. నేను అలా చేసినప్పటికీ మన ఫ్యామిలీ ఎప్పుడు డబ్బులు కోసం కష్టపడలేదు అని కృష్ణ అన్నారు. అవును నాన్న మీరు చేసిన మంచి పనులే మన ఫ్యామిలీని కాపాడాయి అని మంజుల తిరిగి సమాధానం ఇచ్చింది. తండ్రి కూతుళ్ళ మధ్య జరిగిన ఈ సంభాషణ వైరల్ గా మారింది.

చివరిగా, కృష్ణ తన నిర్ణయం వెనుక ఉన్న కుటుంబ విలువలు, మానవీయతను ఈ సంఘటన చాటుతుంది. ఆయన త్యాగాలే ఆయన కుటుంబాన్ని సంపన్నం చేశాయని మనం గుర్తించాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.