
టాలీవుడ్ హీరో అఖిల్ రాజ్, డెలివరీ బాయ్ వివాదంపై సంచలన వివరణ ఇచ్చారు. వైరల్ అయిన వీడియో వెనుక అసలు నిజాలు బయటపెడుతూ, తన తల్లిని అవమానించిన డెలివరీ బాయ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ షాకింగ్ ఇష్యూలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే…
Key Points
అఖిల్ రాజ్ తల్లిని డెలివరీ బాయ్ తిట్టాడని హీరో సంచలన ప్రకటన.
డెలివరీ బాయ్ తాగి వచ్చి దురుసుగా ప్రవర్తించాడని అఖిల్ ఆరోపణ.
తప్పుడు ఆర్డర్ ఇచ్చి, ఇంటి ముందు రచ్చ చేశాడని వీడియోలో వెల్లడి.
వైరల్ వీడియోపై అఖిల్ రాజ్ పోలీస్ కంప్లైంట్, సీసీటీవీ ఫుటేజ్ డిమాండ్.
డెలివరీ బాయ్ వర్సెస్ అఖిల్ రాజ్: అసలేం జరిగింది?
Akhil Raj : రాజు వెడ్స్ రాంబాయి, ఈషా సినిమాలతో హీరోగా ఫేమ్ తెచ్చుకున్న అఖిల్ రాజ్ ఓ డెలివరీ బాయ్ ని కొట్టాడని నిన్నటి నుంచి ఒక వీడియో వైరల్ అయింది. దీంతో పలువురు నిజానిజాలు తెలియకుండా అఖిల్ రాజ్ పై విమర్శలు చేయడం మొదలువులెట్టారు. దీంతో నేడు అఖిల్ రాజ్ దీనిపై వివరణ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేసాడు.
తల్లిని తిట్టాడని హీరో ఆగ్రహం: సంచలన నిజాలు!
ఈ వీడియోలో అఖిల్ రాజ్ మాట్లాడుతూ.. రమేష్ అనే డెలివరీ అబ్బాయి మా ఎదురు ఫ్లాట్ లో ఇవ్వాల్సిన ఆర్డర్ మాకు తీసుకొచ్చాడు. వాళ్ళు అడ్రెస్ అరుణ రెసిడెన్సీ ఎదురు ఫ్లాట్ అని రాసారు. ఆ డెలివరీ బాయ్ అరుణ రెసిడెన్సీలో ఉండే 201 మా ఇంటికి తీసుకొచ్చాడు. మేము ఎవరమో ఆర్డర్ పెట్టాము అనుకోని మా నాన్న తీసుకున్నాడు. మా నాన్న మమ్మల్ని ఎవరు ఆర్డర్ పెట్టారు అని అడిగే లోపే అతను వెళ్ళిపోయాడు. ఆర్డర్ ఇచ్చేటప్పుడు చెక్ చేసుకోవాలి కదా. డెలివరీ బాయ్ బాధ్యత కదా. మా అమ్మకు అది తెలియకుండా ఓపెన్ చేసింది. అప్పుడు 20 నిమిషాల తర్వాత ఆ అబ్బాయి వచ్చి ఆర్డర్ అడిగాడు. నేను చూసుకోవాలి కదా అని అడిగితే లేదు, చూసుకోలేదు, ఇలాగే ఇస్తా అని మాట్లాడాడు. అతను తాగి ఉన్నాడు. మా అమ్మ సరే అని తెలియకుండా ఓపెన్ చేసాము బాబు చూసుకో అని ఇచ్చేస్తుంటే మా అమ్మని తిట్టాడు. మా అమ్మ మీద మాటలు జారాడు. ఒక కొడుకుగా నాకు కోపం వచ్చింది.
వైరల్ వీడియో వెనుక అసలు కథ: పోలీసులకు ఫిర్యాదు!
నేను కూడా ఒకప్పుడు డెలివరీ బాయ్ గా పనిచేసినోడినే. ఆ డెలివరీ బాయ్ తప్పు చేసాడు. మా అమ్మను తిట్టాడు. నిజం తెలియకుండా నన్ను తిడుతున్నారు అందరూ. అతను వెళ్ళేటప్పుడు కూడా వీడియో తీసి నువ్వు హీరో కదా వైరల్ చేస్తాను అని అనుకుంటూ అన్నాడు. ఆ వీడియో మీరు చూసారు. మీ ఇంట్లో వాళ్ళకు జరిగితే ఎవరైనా రియాక్ట్ అవ్వకుండా ఉంటారా? నేను కొట్టలేదు కావాలంటే ఆ వీడియో చూడండి. అసలు మా ఆర్డర్ కానీ దానికి మా ఇంటికి వచ్చి ఇష్టమొచ్చినట్టు మాట్లాడతారా? నేను దీనిపై పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. నేను తప్పు అంటే సారీ చెప్తా. కానీ నిజం ఏంటో తెలుసుకోండి. అతని మీద ఊసారు అంటున్నారు. సీసీటీవీ ఫుటేజ్ కూడా తీసుకోండి అప్పుడు తెలుస్తుంది మీకు నిజాలు. ఏమి తెలియకుండా, నిజం అబద్దం తెలియకుండా ఎవరో పెట్టిన వీడియోతో నన్ను అనడం కరెక్ట్ కాదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.
అఖిల్ రాజ్ డెలివరీ బాయ్ వివాదంపై సంచలన నిజాలు బయటపడ్డాయి. ఈ కేసులో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఈ ఇష్యూపై మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


