|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

లెనిన్ సంచలనం: అఖిల్ ‘హే ఇన్నవా’ పాటతో రికార్డులు బ్రేక్! షాకింగ్ రిలీజ్ డేట్.

Published: 05-01-2026, 8:30 AM
లెనిన్ సంచలనం: అఖిల్ 'హే ఇన్నవా' పాటతో రికార్డులు బ్రేక్! షాకింగ్ రిలీజ్ డేట్.
  • అఖిల్ ‘లెనిన్’ చిత్రం నుంచి ‘హే ఇన్నవా’ ఫస్ట్ సింగిల్ తాజాగా విడుదలైంది.
  • అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, శ్వేతా మోహన్, జుబిన్ నౌటియాల్ ఆలపించారు.
  • ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, పల్లెటూరి జాతర నేపథ్యాన్ని ప్రతిబింబిస్తోంది.
  • సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

అక్కినేని అఖిల్ ‘లెనిన్’ సినిమా నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘హే ఇన్నవా’ ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ఈ పాట సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చిత్రబృందం సినిమా విడుదల తేదీపై కీలక ప్రకటన కూడా చేసింది.

‘హే ఇన్నవా’ పాటతో సోషల్ మీడియా షేక్!

Lenin First Single: అక్కినేని అఖిల్ హీరోగా,  మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లెనిన్. అఖిల్ భాగ్యశ్రీ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన  ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావలసి ఉండగా ఈ సినిమా నుంచి హీరోయిన్గా ఎంపికైన శ్రీ లీల తప్పుకోవడంతో అందుకు సంబంధించిన సన్నివేశాల రీషూట్ కారణంగా ఆలస్యం అయ్యింది. ఇక ఈ సినిమా ఇటీవల షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోని చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇటీవల ఈ సినిమా నుంచి అఖిల్, భాగ్యశ్రీ కి సంబంధించిన పోస్టర్లు విడుదల చేశారు. అలాగే ఫస్ట్ సింగిల్ కి సంబంధించిన ప్రోమో వీడియో కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా నుంచి ‘ హే ఇన్నవా.. ఇన్నావా కన్నెపిల్ల ఏమందో విన్నావా..’ అంటూ సాగిపోయే పాటను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా, సింగర్స్ శ్వేతా మోహన్, జుబిన్ ఈ పాటను ఆలపించారు.

ఇక ఈ పాట చూస్తుంటే మొత్తం పల్లెటూరు బ్యాక్ గ్రౌండ్ లో  జాతరను తలపిస్తూ ఈ పాట కొనసాగుతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అఖిల్ మాస్ లుక్ లో కనిపించగా, భాగ్యశ్రీ మాత్రం అచ్చ తెలుగు అమ్మాయిగా లంగా వోణీలో చాలా చూడముచ్చటగా కనిపించారు. ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన అప్డేట్ చిత్ర బృందం తెలియచేస్తూ మరొక గుడ్ న్యూస్ కూడా వెల్లడించారు. ఈ సినిమా 2026 మార్చిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోందంటూ వార్తలు వచ్చాయి కానీ అది నిజం కాదని తాజాగా చిత్రబంధం వెల్లడించారు ఈ సినిమాని మే 1 వ తేదీ వరల్డ్ వైడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలియజేశారు.

Hey innava innava kannepilla emando innava… Va vare vareva.. va vare vareva.. 😍🫶🏻

లెనిన్ సినిమా విడుదల తేదీ ప్రకటనలో ట్విస్ట్

Starting 2026 with a chartbuster melody #VaarevaaVaarevaa ready to go on loop ❤️‍🔥❤️‍🔥

▶️ https://t.co/D6x58lPx09

A @MusicThaman Musical 🎶 🎤 #ShwetaMohan @JubinNautiyal ✍️ @IananthaSriram … pic.twitter.com/vYxSvQJmm1

పాటలోని ముఖ్యాంశాలు: అఖిల్, భాగ్యశ్రీ

— Sithara Entertainments (@SitharaEnts) January 5, 2026

ఇలా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఈ సినిమా విడుదల తేదీ గురించి అప్డేట్ ఇవ్వడంతో అక్కినేని అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు ప్రస్తుతార ఎంటర్టైన్మెంట్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున, నాగ వంశీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తమన్ సంగీతం అందించబోతున్నారు. అఖిల్ చివరిగా ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఎన్నో అంచనాలు నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచింది. లెనిన్ తో హిట్ కొట్టాలన్న కసితో అఖిల్ ఈ సినిమా కోసం పని చేస్తున్నట్లు తెలుస్తోంది . ఇక ఈ సినిమా ద్వారా అఖిల్ కు మంచి హిట్ ఇవ్వాలని నాగార్జున కూడా ఎంతో తాపత్రయ పడుతున్నారు. మరి ఈ సినిమా ద్వారా అయిన అఖిల్, భాగ్యశ్రీ సక్సెస్ హిట్ కొట్టేరా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

‘హే ఇన్నవా’ పాటతో ‘లెనిన్’ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అఖిల్ మాస్ లుక్, భాగ్యశ్రీ అందం ఆకర్షణీయంగా నిలిచాయి. మే 1న విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.