|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అకిరా మాస్ ఎంట్రీ! చెల్లెళ్ళతో షాకింగ్ పిక్.. అసలు నిజం ఏంటంటే!

Published: 07-01-2026, 6:45 AM
అకిరా మాస్ ఎంట్రీ! చెల్లెళ్ళతో షాకింగ్ పిక్.. అసలు నిజం ఏంటంటే!
  • పవర్ స్టార్ తనయుడు అకిరా నందన్ కు ఊహించని ఫ్యాన్ ఫాలోయింగ్.
  • ఆద్య, పలీనా అంజనిలతో అకిరా దిగిన ఫోటో నెట్టింట్లో వైరల్.
  • వైరల్ అవుతున్న ఫోటో AI క్రియేషన్ అని తేల్చిన ఫ్యాన్స్.
  • అకిరా, చెల్లెళ్ళ ఫోటో ముచ్చటగా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాడు! తన చెల్లెళ్ళతో దిగిన ఒక ఫోటో నెట్టింట్లో క్షణాల్లో వైరల్ అయింది. ఇది నిజమైన ఫోటోనా లేదా AI సృష్టించిన అద్భుతమా అనే చర్చకు తెరలేపింది.

అకిరా ఎంట్రీ కోసం ఎదురుచూపులు!

Akira Nandan : పవన్ కళ్యాణ్ కి ఎంత ఫాలోయింగ్ ఉందో పవన్ తనయుడు అకిరాకు కూడా ఆల్మోస్ట్ అంతే ఫాలోయింగ్ ఉంది. అకిరా నందన్ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక పవన్ పెద్ద కూతురు ఆద్య అందరికి సుపరిచితమే. చిన్న కూతురు పలీనా అంజని మాత్రం ఇటీవలే సంవత్సరం క్రితం తిరుమలలో పవన్ తో కనిపించి వైరల్ అయింది.(Akira Nandan)

అయితే తాజాగా పవన్ తనయుడు అకిరా నందన్ తన ఇద్దరు చెల్లెల్లు ఆద్య, పలీనా అంజని లతో కలిసి దిగిన ఫొటో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో పవన్ కూతుళ్లు ఇద్దరూ ట్రెడిషినల్ గా రెడీ అయ్యారు. దీంతో వీళ్ళు ఎప్పుడు ఎక్కడ కలిశారు అని సందేహిస్తున్నారు. అయితే ఈ ఫొటో జాగ్రత్తగా చూస్తే ఇది AI ఫొటో అని తెలిసిపోతుంది. ఇది నిజమైన ఫోటోనా, AI ఫోటోనా అని వెతుకుతున్నారు నెటిజన్లు.

వైరల్ అవుతున్న అకిరా చెల్లెళ్ళ ఫోటో!

ఈ ఫొటో చూస్తే ఇది క్లియర్ గా AI ఫొటో అని తెలిసిపోతుంది. గతంలో పవన్ కళ్యాణ్ తిరుమలలో తన కూతుళ్లు ఇద్దరితో కలిసి దిగిన ఫోటోని రిఫరెన్స్ గా తీసుకొని ఇలా అకిరా నందన్ ఇద్దరు చెల్లెళ్ళతో దిగినట్టు AI లో మార్చేశారు.

AI మాయాజాలమా? అసలు నిజం ఇదే!

ఇక అకిరా ఫేస్ కట్ కూడా కూడా దగ్గర్నుంచి చూస్తే కాస్త తేడాగానే ఉంది. కొంతమంది అయితే అసలు ఇది అకిరానేనా అని కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఇది AI ఫోటోగా తేల్చేసారు ఫ్యాన్స్. చేస్తే చేసారు గాని అకిరా తన చెల్లెళ్ళతో కలిసి ఉండటం ముచ్చటగా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అకిరా నందన్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్, ఈ ఫోటోపై నెలకొన్న ఉత్సాహం చూస్తుంటే అతని సినీ ఎంట్రీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారని తెలుస్తుంది. అకిరా సినీ కెరీర్, తాజా అప్డేట్స్ కోసం వేచి చూడండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.