
📌 Key Points
- అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ కొత్త సినిమా ‘చీకటిలో’ ఓటీటీలో విడుదల కానుంది.
- ఈ థ్రిల్లర్ చిత్రం జనవరి 23 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
- శోభిత ఈ సినిమాలో రేడియో జాకీ పాత్రలో కనిపించనుంది, ఇది ఆమెకు మొదటి థ్రిల్లర్ జానర్ చిత్రం.
- సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు.
నటి శోభిత ధూళిపాళ, అక్కినేని ఇంటి కోడలుగా అడుగుపెట్టిన తర్వాత, తన కొత్త సినిమా గురించి అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు. ఆమె నటించిన ‘చీకటిలో’ చిత్రం జనవరి 23న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శోభిత ‘చీకటిలో’ ఓటీటీ విడుదల ఖరారు
Sobhita Dhulipala: టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు నటి శోభిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తెలుగు అమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్ సినిమాలు ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టారు. అనంతరం తెలుగులో కూడా గూడచారి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి హీరోయిన్ గా సక్సెస్ అందుకున్నారు. ఇక ఇటీవల శోభిత(Sobhita) అక్కినేని ఇంటి కోడలుగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈమె నటుడు నాగచైతన్యను(Naga Chaitanya) ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం జరుపుకున్నారు. గత ఏడాది డిసెంబర్ కు వీరి వివాహం జరిగి సరిగ్గా ఏడాది అవుతుంది.
ఇలా అక్కినేని ఇంటి కోడలుగా అడుగుపెట్టిన తర్వాత శోభిత సినిమాలకు దూరమవుతారు అంటూ వార్తలు వచ్చాయి కానీ ఆ వార్తలు నిజం కాదని తెలుస్తుంది ఈమె ప్రస్తుతం పలు ప్రాజెక్టులకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక త్వరలోనే శోభిత హీరోయిన్ గా నటించిన సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. శోభిత పెళ్లి తర్వాత ఓ సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాలను ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
సినిమా విశేషాలు, విడుదల తేదీ
తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించి చిత్ర బృందం బిగ్ అప్డేట్ వెల్లడించారు. శోభిత ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు చీకటిలో (Cheekatilo) అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా నేరుగా థియేటర్లలో కాకుండా ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో జనవరి 23వ తేదీ నుంచి అందుబాటులోకి రాబోతుందని తెలియజేశారు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ హిందీ భాషలలో కూడా ప్రసారం కానున్నట్టు అధికారక పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఇక శోభిత షేర్ చేసిన ఈ పోస్టర్ చూస్తుంటే ఈమె ఈ సినిమాలో రేడియో జాకీ పాత్రలో కనిపించబోతున్నారని, వెనక ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన సెటప్ మొత్తం ఉండడంతో చీకటిలో అనే సినిమా థ్రిల్లర్ జానెర్లో రాబోతోందని స్పష్టమవుతుంది.
వైరల్ అవుతున్న శోభిత పోస్ట్
ఇక ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో శోభిత సంధ్య అనే పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాల్లో శోభిత ప్రధాన పాత్రలో కనిపించగా, చైతన్య విశాలాక్షి, ఆమని, ఝాన్సీ వంటి తదితరులు ఈ సినిమాలో పలు పాత్రలలో నటించబోతున్న సంగతి తెలిసిందే.
శోభిత తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తూ, పెళ్లి తర్వాత కూడా నటిగా తన సత్తా చాటుతోంది. ‘చీకటిలో’ సినిమా ఓటీటీ విడుదల ఆమె అభిమానులకు ఆనందం కలిగించింది. ఈ థ్రిల్లర్ సినిమాతో శోభిత మరో విజయాన్ని అందుకుంటుందని ఆశిద్దాం.


