|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హైహీల్స్‌లో అక్షయ్ కుమార్ స్టెప్పులు: నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తున్న వీడియో!

Published: 30-04-2026, 9:00 PM
హైహీల్స్‌లో అక్షయ్ కుమార్ స్టెప్పులు: నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తున్న వీడియో!
  • అక్షయ్ కుమార్ ‘వీల్ ఆఫ్ ఫార్చ్యూన్’ షోను హోస్ట్ చేస్తున్నారు.
  • జాక్వెలిన్ ఫెర్నాండెజ్ విసిరిన హైహీల్స్ డ్యాన్స్ ఛాలెంజ్‌ను స్వీకరించారు.
  • ‘హౌస్‌ఫుల్ 5’ లోని ‘లాల్ పరి’ పాటకు హైహీల్స్‌లో డ్యాన్స్ చేసి ఆశ్చర్యపరిచారు.
  • మహిళలకు సెల్యూట్ చేసి, హైహీల్స్‌లో డ్యాన్స్ కష్టాన్ని వివరించి తన మంచి తనాన్ని చాటుకున్నారు.

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ హైహీల్స్‌లో డ్యాన్స్ చేసి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించి, తన అప్ కమింగ్ సినిమా పాటకి స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ వైరల్ వీడియో ఇప్పుడు నెట్టింట సంచలనం సృష్టిస్తోంది.

అక్షయ్ కుమార్‌కు జాక్వెలిన్ ఛాలెంజ్

Akshay Dance : అక్షయ్ కుమార్…బాలీవుడ్ ‘ఖిలాడీ’గా ముద్ర వేసుకున్న ఈ వెటరన్ స్టార్ కి పరిచయం అక్కర్లేదు. సీన్ కామెడీ అయినా యాక్షన్ అయినా పండించడంలో ఆయన తర్వాతే ఎవరైనా..అంతటి క్రేజ్ కొట్టేసిన అక్షయ్ వీడియో ఒకటి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.అవును.. అమ్మాయిలు వేసుకునే హై హీల్స్ వేసుకోవడమే కాకుండా డాన్స్ కూడా వేయడంతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడు.

ఏమిటా ఛాలెంజ్? అసలేం జరిగింది?

విషయంలోకి వెళ్తే అక్షయ్ కుమార్ లేటెస్ట్ గా ‘వీల్ ఆఫ్ ఫార్చ్యూన్’ అనే పాపులర్ షో ని హోస్ట్ చేస్తున్న సంగతి తెల్సిందే.ఇక తాజాగా ఈ షో గ్రాండ్ ఫినాలే చాలా గ్రాండ్ గా జరగగా దీనికి బాలీవుడ్ స్టార్స్ ఫరా ఖాన్, భూమి పెడ్నేకర్ అటెండ్ అయ్యారు కూడా.అయితే ఇదే స్టేజ్ పై ఉన్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అక్షయ్‌కు ఒక క్రేజీ ఛాలెంజ్ విసరడంతో అసలు సినిమా మొదలైంది.

మాములుగా లేడీస్ హై హీల్స్ వేసుకుని నడవడమే చాలా కష్టం. అలాంటిది అక్షయ్ తో ఏకంగా హై హీల్స్ వేసుకుని ఒక నిమిషం పాటు నాన్‌స్టాప్‌గా డ్యాన్స్ చేయాలని ఛాలెంజ్ విసిరింది జాక్వెలిన్,ఒకవేళ గనుక అక్షయ్ డ్యాన్స్ చేయకుండా మధ్యలో ఆగిపోతే తనకి లక్ష రూపాయలు చెల్లించాలని బెట్ కూడా వేసింది.

హైహీల్స్‌లో ఖిలాడీ స్టెప్పులు

వేదికపై అక్షయ్ ‘లాల్ పరి’ సందడి!

దీంతో ఆ మాత్రం చేయలేనా అంటూ ఏకంగా హై హీల్స్ వేసుకొని స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చాడు మన ఖిలాడీ. అంతే కాకుండా తన అప్ కమింగ్ మూవీ ‘హౌస్‌ఫుల్ 5’ లోని సూపర్ హిట్ సాంగ్ ‘లాల్ పరి’కి స్టెప్పులేయడం మొదలెట్టాడు కూడా.పైగా ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా ఎంతో ఈజ్ తో ఆ డాన్స్ చేయడం విశేషం.దీంతో  అక్షయ్ డాన్స్ చూసి సెట్ లో ఉన్నవాళ్ళంతా షాక్ అయిపోయారు.

ఇక మన ఖిలాడీతో పాటు ఫరా ఖాన్, భూమి పెడ్నేకర్ కూడా స్టెప్పులేయడం తో షో ఒక్కసారిగా కేకలతో మారుమోగిపోయింది.అలా ఒక నిమిషం పాటు సక్సెస్ ఫుల్ గా డాన్స్ కంప్లీట్ చేసి,జాక్వెలిన్ వేసిన బెట్ ని గెలిచాడు అక్షయ్.ఇక అక్షయ్ డ్యాన్స్ చూసి ఫిదా అయిన ఫరా ఖాన్, అక్షయ్ ని మెచ్చుకుంది కూడా. అయితే డాన్స్ కంప్లీట్ అయిన తర్వాత హై హీల్స్ వేసుకొని నడవడం, డాన్స్ చేయడం ఎంత కష్టమో ఇప్పుడు తెలిసి వచ్చింది అంటూ మహిళలకి  సెల్యూట్ చేసి తన మంచి తనాన్ని చాటుకున్నాడు అక్షయ్.

బాక్సాఫీస్ వద్ద ‘భూత్ బంగ్లా’ జోరు

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో

ఇక అక్షయ్ కుమార్ కెరీర్ కూడా ఇపుడు ఫుల్ జోష్ లో కనిపిస్తుంది. ఆయన నటించిన లేటెస్ట్ ఫిలిమ్ భూత్ బంగ్లా థియేటర్లలో 180 కోట్లకు పైగా కొల్లగొట్టి అక్షయ్ కి మరో హిట్ ని అందించింది.ఇక వచ్చే జూన్ 26న ‘వెల్కమ్ టు ది జంగిల్’ అనే మరో సినిమా రిలీజ్ అవడానికి సిద్దమవుతుంది. చూడాలి మరి సక్సెస్ స్ట్రీక్ ని ఈ సినిమా కంటిన్యూ చేస్తుందో లేదో !

Akshay dancing in heels wasn’t on my 2026 bingo card… probably not in Akshay Kumar’s plan either 😭 https://t.co/AL7S5ck2s9 pic.twitter.com/6rCnNQOVrm

— PintuX (@pintya_348) April 28, 2026

హైహీల్స్‌లో అక్షయ్ కుమార్ డ్యాన్స్ అతని స్ఫూర్తిని, మంచి తనాన్ని చాటింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అక్షయ్ కెరీర్ లో మరో గుర్తుండిపోయే సంఘటనగా ఇది నిలిచిపోతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.