
తాజాగా విడుదలైన ‘ఫూలే’ సినిమాపై తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. మహిళల విద్యకు పోరాడిన ఫూలే దంపతుల కథను సినిమా అద్భుతంగా చూపించిందని ఆయన అన్నారు.
Key Points
ఆకునూరి మురళి 'ఫూలే' సినిమాను ప్రశంసించారు.
మహిళల విద్యకు పోరాడిన ఫూలే దంపతుల కథను సినిమా చక్కగా చూపించిందని అన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఓసీ, అంబేడ్కరైట్లు, మహిళలు అందరూ చూడాల్సిన సినిమా అని అభిప్రాయపడ్డారు.
సినిమాపై వివాదాలు ఉన్నప్పటికీ, అందరూ చూసి తెలుసుకోవాలని సూచించారు.
ఆకునూరి మురళి ట్వీట్
దేశవ్యాప్తంగా ‘ఫూలే’ (Phule 2025)సినిమా ఎన్నో వివాదాల నడుమ తాజాగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ప్రముఖ సామాజిక తత్వవేత్త, మహిళల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి మహాత్మా జ్యోతి రావు ఫూలే అతని భార్య సావిత్రిబాయి ఫూలే జీవిత చరిత్రల ఆధారంగా ‘ఫూలే’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాపై తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి (Ex IAS Akunuri Murali) ఇవాళ (శుక్రవారం) ఆసక్తికర ట్వీట్ చేశారు.
‘ఫూలే’ సినిమాపై ప్రశంసలు
‘మా ఎస్‌డీఎఫ్ ప్రతినిధులతో నిన్న ఫూలే (Phule) సినిమా చూశాను. ఆడ పిల్లలకు విద్య ఇవ్వాలి అనే ఆశయం నెరవేర్చడానికి సనాతులతో (Mahatma Jyotirao Phule) మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే (Savitribai Phule) దంపతుల త్యాగ పూరిత పోరాటాన్ని డైరెక్టర్ అనంత్ మహదేవన్ గొప్పగా తెరకెక్కించారు. ఫూలే దంపతులతో పని చేసిన త్యాగమయి గొప్ప మహిళ టీచర్ ఫాతిమా షేక్. నిర్మాతలకు ధన్యవాదాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీలు, ఓసీ, అంబేడ్కరైట్లు, మహిళలు అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. సనాతన ధర్మం అంటే ఏంటో అర్థం కాకున్నా అంగీలు చించుకునే వాళ్ళు కూడా తప్పక చూడాల్సిన సినిమా’ అని పేర్కొన్నారు.
సినిమా వివాదం
కాగా, ‘ఫూలే’ సినిమా బ్రాహ్మణ సమాజంలోని కొందరు వ్యక్తులు ఈ సినిమాలో తమ సమాజాన్ని తప్పుగా చూపిస్తున్నారని ఆరోపించడంతో చిత్రం వివాదంగా మారింది. ఫూలే పాత్రలో గుజరాతీ నటుడు ప్రతీక్ గాంధీ, సావిత్రి బాయి ఫూలే పాత్రలో బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు భార్య పత్రలేఖ నటించి ప్రేక్షకులను అలరించారు.
ఫూలే సినిమాపై ఆకునూరి మురళి అభిప్రాయం సమాజానికి ఆలోచన కలిగించేది. సినిమా చూడటం ద్వారా మహిళల విద్య, సమాజంలో మహిళల పాత్ర గురించి అవగాహన పెరుగుతుంది.


