|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Ali : ఒక అమ్మాయి నో చెప్పిందని నా మేనల్లుడు చనిపోయాడు.. అలీ ఎమోషనల్ కామెంట్స్..

Published: 09-07-2025, 6:10 AM
Ali : ఒక అమ్మాయి నో చెప్పిందని నా మేనల్లుడు చనిపోయాడు.. అలీ ఎమోషనల్ కామెంట్స్..

కమెడియన్ అలీ ‘ఓ భామ అయ్యో రామ’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో తన మేనల్లుడి మరణం గురించి తన భావోద్వేగాలను పంచుకున్నారు. సినిమాలోని తన పాత్ర తన మేనల్లుడి జ్ఞాపకాలను గుర్తు చేసిందని ఆయన వెల్లడించారు.

Key Points

1

అలీ తన మేనల్లుడి మరణం గురించి తన భావోద్వేగాలను పంచుకున్నారు.

2

ఓ భామ అయ్యో రామ సినిమాలో అలీ కీలక పాత్ర పోషించారు.

4

సినిమా జులై 11న విడుదల కానుంది.

అలీ యొక్క ఎమోషనల్ కామెంట్స్

Ali : కమెడియన్ అలీ ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. సుహాస్ హీరోగా నటించిన ఓ భామ అయ్యో రామ సినిమాలో చాన్నాళ్ల తర్వాత ఓ ఫుల్ లెంగ్త్ మంచి క్యారెక్టర్ లో అలీ నటించాడు. ఈ సినిమా జులై 11 రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

‘ఓ భామ అయ్యో రామ’ సినిమా

ఈ ఈవెంట్లో అలీ మాట్లాడుతూ.. సుహాస్ కి మామయ్య క్యారెక్టర్ చేశాను ఈ సినిమాలో. ఈ క్యారెక్టర్ ఎందుకు చేశాను అంటే 15 ఏళ్ళ క్రితం నాకు ఒక మేనల్లుడు ఉండేవాడు. మా అక్క చనిపోతే వాడ్ని చిన్నప్పట్నుంచి మా అమ్మే పెంచింది. వాడు నా ముందే ఎదిగాడు. కానీ ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి నో చెప్తే తను చనిపోయాడు. అప్పట్నుంచి మా అమ్మ చాలా బాధపడి రోజూ ఏడ్చింది. ఈ సినిమాలో క్యారెక్టర్ చెప్పాక నేను దానికి కనెక్ట్ అయ్యాను. అందుకే ఈ క్యారెక్టర్ కి ఒప్పుకున్నాను. సినిమాలో సుహాస్ ని చూస్తుంటే నా మేనల్లుడు గుర్తొచ్చాడు అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసారు.

మేనల్లుడి మరణం గురించి అలీ

అలీ యొక్క ఈ ఎమోషనల్ కామెంట్స్ అందరినీ కదిలించాయి. ‘ఓ భామ అయ్యో రామ’ సినిమాలో ఆయన పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.