|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తల్లిగా మారిన తర్వాత నా కెరీర్‌పై అలియా షాకింగ్ నిర్ణయం! ఇకపై అవే చేయనని ఫిక్స్!

Published: 02-01-2026, 7:30 AM
తల్లిగా మారిన తర్వాత నా కెరీర్‌పై అలియా షాకింగ్ నిర్ణయం! ఇకపై అవే చేయనని ఫిక్స్!
  • తల్లి అయ్యాక వృత్తిపరంగా చాలా మార్పులు వచ్చాయని అలియా వెల్లడి.
  • బిడ్డ రాహా కారణంగా పనిలో వేగం తగ్గిందని అలియా వ్యాఖ్య.
  • ఇకపై ఒకేసారి ఒకటికంటే ఎక్కువ సినిమాలను చేయనని స్పష్టీకరణ.
  • బిడ్డ పుట్టిన తర్వాత యాక్షన్‌ సీన్స్ చేయడం కష్టంగా మారిందన్న అలియా.

అలియా భట్ తల్లిగా మారిన తర్వాత తన వృత్తిపరమైన జీవితంలో వచ్చిన మార్పులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బిడ్డ రాహా పుట్టాక కెరీర్‌పై దృష్టి సారించడం, యాక్షన్ సీన్స్ విషయంలో ఎదురైన సవాళ్లు, భవిష్యత్ సినిమాల గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అలియా భట్ కెరీర్‌పై తల్లిగా ప్రభావం

తల్లయ్యాక వృత్తి పరంగా ఏర్పడే సమస్యల గురించి అలియా భట్(Alia Bhatt) ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Alia Bhatt interesting comments about continuing films after becoming a mother

Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. తన నటనతో ఇప్పటికే లక్షల మంది ఫ్యాన్స్ ని సొంతం చేసుకుంది. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాతో తెలుగు ఆడియన్స్ ను సైతం మెప్పించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ అమ్మడు రెండు భారీ సినిమాలు చేస్తోంది. అందులో ఒకటి అల్ఫా కాగా రెండవది లవ్ అండ్ వార్.

యాక్షన్ సీన్స్‌పై అలియా అభిప్రాయం

ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే, అలియా భట్(Alia Bhatt) స్టార్ హీరో రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఒక పాప. అయితే, రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అలియా తాను తల్లి అయ్యాక వచ్చిన మార్పుల గురించి, తన తదుపరి సినిమాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Siri Hanumanth: పరువపు సిరులతో పిచ్చెక్కిస్తున్న సిరి హనుమంత్.. హాట్ ఫొటోస్

ఇకపై ఒకే సినిమాతో బిజీ

ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..’రాహా వచ్చాక వృత్తి విషయంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఎందుకంటే, నా బిడ్డ గురించి పట్టించుకోవాలి కదా. పనిలో వేగం కూడా తగ్గిపోయింది. అయినా కూడా సంతోషంగానే ఉన్నాను. ఒకప్పుడు ఒకేసారి రెండు మూడు సినిమాల షూటింగ్స్ లో పాల్గొనేదాన్ని. కానీ, ఇక నుంచి ఒకే సినిమా ఒకే చేసి ఆ పాత్రకు న్యాయం చేయాలని అనుకుంటున్నాను.

ఒక మహిళ తల్లయ్యాక యాక్షన్‌ సీన్స్ చేయడం కాస్త కష్టం. నేను చేస్తున్న ‘ఆల్ఫా’ సినిమాలో యాక్షన్‌ సీన్స్ చాలానే ఉన్నాయి. బిడ్డ పుట్టిన తర్వాత ఇలాంటి యాక్షన్ సీన్స్ చేయడం ఆందనంగా ఉంది. నా శరీరం సత్తా ఏంటో నాకు ఇప్పుడే తెలుస్తోంది” అంటూ చెప్పుకొచ్చింది అలియా. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అలియా భట్ తన కెరీర్ పట్ల తీసుకొంటున్న ఈ కొత్త నిర్ణయాలు అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే, వృత్తిని కొనసాగించాలనే ఆమె నిబద్ధత అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.