
📌 Key Points
- అఖండ 2 రూ. 100 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతోంది.
- ప్రధాని మోడీ అఖండ 2 సినిమా చూడనున్నారని బోయపాటి వెల్లడి.
- ఢిల్లీలో మోడీ, బీజేపీ నేతలకు ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు.
- సినిమాలోని హిందుత్వ అంశాలపై మోడీ ఆరా తీసినట్లు సమాచారం.
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా బ్లాక్‌బస్టర్‌గా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను కీలక ప్రకటన చేశారు. అతి త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీ ఈ సినిమాను వీక్షించనున్నారని ఆయన వెల్లడించారు. ఢిల్లీలో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.
అఖండ 2 భారీ వసూళ్లు
నందమూరి బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2 ప్రభంజనం సృష్టిస్తోంది. మొన్న డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ అయిన ఈ మూవీ రూ. 100 కోట్ల కలెక్షన్స్ వైపు దూసుకు వెళ్తోంది. బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో ఇప్పటికే అఖండ సినిమా చరిత్ర సృష్టించింది. ఇక ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 వచ్చింది. ఈ సినిమా కథ పూర్తిగా హిందుత్వం చుట్టే ఉన్న నేపథ్యంలో, ప్రేక్షకులు ఎగబడి చూస్తున్నారు.
దీంతో థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి. దానికి తోడు వీకెండ్స్ హాలిడేస్ రావడంతో కలెక్షన్స్ భారీగానే వస్తున్నాయి. అయితే అఖండ 2 సినిమా బంపర్ హిట్ టాక్ రావడంతో తాజాగా సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది చిత్ర బృందం. ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలోనే అఖండ 2 సినిమాను ప్రధాని నరేంద్ర మోడీ చూడబోతున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా గురించి ఇప్పటికే మోడీ ఆరా తీశారని తెలిపారు. ఢిల్లీలో స్పెషల్ షో త్వరలోనే వెయ్యబోతున్నట్లు వివరించారు. ఆ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కొంతమంది బీజేపీ నాయకులు ఈ అఖండ 2 సినిమాలు తిలకించబోతున్నట్లు బోయపాటి శ్రీను అధికారికంగా ప్రకటించారు.
బోయపాటి శ్రీను కీలక ప్రకటన
మోడీ కోసం అఖండ 2 ప్రత్యేక ప్రదర్శన
అఖండ 2 సినిమా విజయానికి ప్రధాని మోడీ వీక్షణ వార్త మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈ ప్రత్యేక ప్రదర్శన సినీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని రేపుతోంది. సినిమా విజయంపై చిత్రబృందం సంతోషం వ్యక్తం చేస్తోంది.


