|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆలియా భట్ విశ్వరూపం.. ‘ఆల్ఫా’ టీజర్‌తో భారీ హైప్ క్రియేట్!

Published: 10-06-2026, 4:45 AM
ఆలియా భట్ విశ్వరూపం.. ‘ఆల్ఫా’ టీజర్‌తో భారీ హైప్ క్రియేట్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, శార్వరి వాఘ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘ఆల్ఫా’. వీరితో పాటు బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ‘బాబా’ అనే కీలక పాత్రలో కనిపించబోతున్నారు. హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌‌ను శివ్ రావల్ తెరకెక్కిస్తున్నారు.‌ యష్‌రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న 7వ ప్రాజెక్ట్ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా పలు మార్లు వాయిదా పడి.. ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకుని జూలై 3న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడటంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌లో భాగంగా టీజర్‌ను విడుదల చేసి ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. విడుదలైన టీజర్‌లో.. అలియా భట్ (సీత) 18వ పుట్టినరోజు సందర్భంగా ఆమె మెంటర్ బాబీ డియోల్ (బాబా) ఒక చిన్న గిఫ్ట్ బాక్స్ ఇస్తాడు.

ఆమె మేజర్ కావడంతో, ఆ పుట్టినరోజు నాడే ఆమెకు మొదటి స్పై మిషన్‌ను అప్పగిస్తాడు. బాబా అరేంజ్ చేసిన గ్రాండ్ డిన్నర్ తన బర్త్‌డే సెలబ్రేషన్ కోసం కాదు, తనను ఒక గూఢచారిగా మార్చడానికి అని తెలిసి సీత మొదట్లో కాస్త నిరాశపడుతుంది. ఆ తర్వాత సీత ఒంటరిగా ఒక సైన్యాన్ని ఎదుర్కొని, వారిని ఒక్కొక్కరిగా మట్టుబెట్టే సీన్లు అద్భుతంగా ఉన్నాయి. కేవలం స్పై మాత్రమే కాకుండా, ఆమె ఒక కిల్లింగ్ మెషీన్‌లా మారి శత్రువులను అంతం చేయడాన్ని ఎంజాయ్ చేస్తుంది. సాధారణ అమ్మాయిలా కాకుండా చిన్నప్పటి నుంచే పోరాటాల మధ్య పెరిగిన ఒక ప్రమాదకరమైన హంతకురాలిగా కనిపించింది. భారీ యాక్షన్ సీన్లు, గన్‌ఫైట్లతో అదరగొట్టింది. ఇక టీజర్ చివర్లో ఒకరిని షూట్ చేసిన తర్వాత, బాబా నవ్వుతూ హ్యాపీ బర్త్‌డే చెప్పడం టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది. ‘ఆల్ఫా’ అప్డేట్‌తో ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ అయింది.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.