|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అల్లరి నరేష్ ఇంట తీరని విషాదం! తాత మరణంతో శోకసంద్రంలో నరేష్ కుటుంబం!

Published: 20-01-2026, 2:30 AM
అల్లరి నరేష్ ఇంట తీరని విషాదం! తాత మరణంతో శోకసంద్రంలో నరేష్ కుటుంబం!
  • ప్రముఖ నటుడు అల్లరి నరేష్ ఇంట విషాదం నెలకొంది.
  • అల్లరి నరేష్ తాతగారు ఈదర వెంకట్రావు గారు 90 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
  • గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు.
  • నిడదవోలులో సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి.

టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తాతగారు, ఈదర వెంకట్రావు గారు వృద్ధాప్యం కారణంగా కన్నుమూశారు. ఈ వార్తతో నరేష్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

అల్లరి నరేష్ తాతగారి మరణం

Allari Naresh : టాలీవుడ్ స్టార్ హీరో అల్లరి నరేష్ ఇంత తీవ్ర విషాదం నెలకొంది. నరేష్ వాళ్ళ తాతగారు మరణించారు. అల్లరి నరేష్ తండ్రి ఇవివి సత్యనారాయణ తండ్రి ఈదర వెంకట్రావు గారు కన్నుమూశారు. ఈరోజు తెల్లవారుజాము తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 90 సంవత్సరాలు. వృద్ధాప్యం కారణంగా గత కొన్నేళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.. ఆయన భార్య వెంకట రత్నం 2019 లో అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు. అల్లరి నరేష్ తండ్రి మరణించారు. ఇప్పుడు తాత కూడా మరణించడంతో ఎమోషనల్ అవుతున్నాడు. ఆయన మరణం కుటుంబంలో తీరని లోటుగా మిగిలింది. ఈ వార్త ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్త విన్న పలువురు సినీ ప్రముఖులు, ఇవివి సత్యనారాయణ సన్నిహితులు, కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు.. ఇక ఆయన స్వగ్రామం అయిన నిడదవోలు మండలం కోరుమామిడిలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు జరుగనున్నాయి… ఈ కార్యక్రమానికి అల్లరి నరేష్ తో పాటుగా ఆయన కుటుంబ సభ్యులు, సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు హాజరు కానున్నారని సమాచారం..

కుటుంబంలో తీవ్ర విషాదం

రేపు అంత్యక్రియలు

ఈ విషాద వార్త సినీ పరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.