|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గద్దర్ పేరు వెనుక అసలు రహస్యం చెప్పిన సీఎం రేవంత్! సంచలన ప్రకటన!

Published: 19-03-2026, 5:05 PM
గద్దర్ పేరు వెనుక అసలు రహస్యం చెప్పిన సీఎం రేవంత్! సంచలన ప్రకటన!
  • గద్దర్ ప్రజా యుద్ధ నౌక అని సీఎం రేవంత్ అన్నారు.
  • గద్దర్ గళం లక్షలాది మందిని ప్రభావితం చేసిందన్నారు.
  • సినిమా ఒక శక్తివంతమైన ఆయుధం అన్నారు.
  • సమాజ సమస్యలపై పోరాడటానికి సినిమా పరిశ్రమ ఉపయోగపడాలని కోరారు.

సీఎం రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డుల గురించి మాట్లాడుతూ, గద్దర్ పేరు పెట్టడానికి గల కారణాన్ని వివరించారు. గద్దర్ ఒక ప్రజా యుద్ధ నౌక అని, ఆయన గళం సమాజంలో చైతన్యాన్ని నింపిందని అన్నారు.

గద్దర్ గొప్పతనాన్ని కొనియాడిన సీఎం రేవంత్

CM Revanth Reddy: నంది అవార్డ్స్‌కు గద్దర్ అవార్డ్స్ అని పేరు పెట్టడానికి కారణం ఏంటో ఫస్ట్ టైమ్ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 కార్యక్రమంలో మాట్లాడిన సీఎం రేవంత్.. గద్దర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన గొప్పతనాన్ని చెబుతూ.. అందుకే ఈ అవార్డ్స్‌కు ఆయన పేరు పెట్టినట్లుగా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..

సినిమా పరిశ్రమకు సీఎం రేవంత్ విజ్ఞప్తి

‘‘ఈ అవార్డ్స్‌కు గద్దర్ పేరు పెట్టడానికి ఓ కారణం ఉంది. గద్దర్.. ప్రజా యుద్ధ నౌక. గద్దర్ అనే పదం కొన్ని లక్షల, కోట్ల మందిని ప్రభావితం చేసి, సామాజిక రుగ్మతల మీద యుద్ధం చేయడానికి ప్రోత్సహించిన గొప్ప గళం గద్దర్. ఆయన గళం గురించి తెలియని వారు ఈ దేశంలో లేరు. గద్దర్‌ని మొదటిసారి రంగుల తెరపై చూపించారు నర్సింగరావు. ఆయన కూడా ఇక్కడే ఉన్నారు. ‘బండెనక బండి కట్టి’ అనే పాటతోనే ఆయన తెరపై కనిపించారని నేను అనుకుంటున్నాను. కళాకారులకు ఒక చరిత్ర ఉంది. నిజాం సర్కార్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు బండి యాదిగిరి రాసిన ‘బండెనక బండి గట్టి’ అనే పాట, నిజాం ప్రభువుల నుంచి విముక్తి కలిగించిన సాయుధ రైతాంగ పోరాటానికి ఒక కళాకారుడు, ఒక కవి స్ఫూర్తినిస్తే.. ఒక సామ్రాజ్యాన్నే, ఒక చక్రవర్తిని ఓడించి పేదలు ప్రజాస్వామ్యాన్ని సాధించుకున్నారు.

గద్దర్ పేరు పెట్టడానికి గల కారణం ఇదే

అదే విధంగా గద్దర్ యొక్క ప్రభావితం మలి తెలంగాణ ఉద్యమంలో ఆయన గళంతోటి లక్షలాది మంది సమాజంలో ఉన్న సమస్యలను, సామాజిక రుగ్మతలను, సమాజంలో ఆదిపత్యం చెలాయిస్తున్న వారిని ఎదురించే గొంతుకగా నిలబడింది. అందుకే, గద్దర్ ఒక చైతన్యం, గద్దర్ ఒక స్ఫూర్తి. ఆ గద్దర్ స్ఫూర్తితోని సమాజంలో ఉన్న రుగ్మతలను, సామాజిక సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక ఆయుధమే సినిమా. ఇది అత్యంత ప్రభావితమైన ఒక శక్తి, ఒక వెపన్. దీనిని ఎలాంటి గోల్ రీచ్ అవడానికైనా వాడుకోవచ్చు. అందుకే ఈ ఫిల్మ్ అవార్డ్స్‌కు గద్దర్ పేరు పెట్టాం. ఇది డబుల్ ఎడ్జ్‌డ్ వెపన్. దీనిని మంచి, చెడు రెండింటికి వాడుకోవచ్చు. కానీ గద్దర్ స్ఫూర్తితోనే సినిమా పరిశ్రమ ఒక సామాజిక బాధ్యతను గుర్తెరిగి, సమాజంలోని సమస్యలపై పోరాటానికి ఫిల్మ్ ఇండస్ట్రీ‌ ఉపయోగపడాలని, వినియోగించుకోవాలని మా ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఇక్కడున్న సినీ ప్రముఖులందరికీ నా విజ్ఞప్తి ఏమిటంటే.. సమాజంలో ఉండే సమస్యలను, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి సినిమా పరిశ్రమను, సినిమాలను వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది..’’ అని తెలిపారు.

సినిమా పరిశ్రమ సమాజంలోని సమస్యలపై పోరాడటానికి ఉపయోగపడాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. గద్దర్ స్ఫూర్తితో సామాజిక బాధ్యతను గుర్తెరగాలని ఆయన పిలుపునిచ్చారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.