
📌 Key Points
- చిన్న సినిమాలు భారీ వసూళ్లు సాధిస్తూ టాలీవుడ్‌లో హవా కొనసాగిస్తున్నాయి.
- ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.
- అదే కాంబోలో మరో సినిమా వస్తుందనే వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది.
- దర్శకుడు సాయిలు, అఖిల్ రాజ్ కాంబినేషన్‌లో రూరల్ బ్యాక్ డ్రాప్‌తో సినిమా రానుందట.
టాలీవుడ్‌లో చిన్న సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో, అదే కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
చిన్న సినిమాల హవా
Raju weds Rambai : ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న సినిమాల హవా నడుస్తుంది.. ప్రతి మూవీ సూపర్ హిట్ టాక్ అని అందుకోవడంతో పాటుగా కలెక్షన్ లో వర్షం కూడా కురిపిస్తున్నాయి.. ఇక జనాలు కూడా స్టార్ హీరోల సినిమాలతో పోలిస్తే.. చిన్న సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉండగా రీసెంట్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన సినిమాల్లో ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీ ఒకటి. క్యూట్ లవ్ స్టోరీ తో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ ఫార్మేట్ లో మరో మూవీ రాబోతుందంటూ ఫిలింనగర్ ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. అదే కాంబో లో సినిమా వస్తుందని టాక్.. మరి ఈసారి ఎలాంటి స్టోరీని చూపిస్తున్నారో అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. దీని గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..
‘రాజు వెడ్స్ రాంబాయి’ సక్సెస్
గత ఏడాదిలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన చిన్న సినిమాలలో కొన్ని సినిమాలు సెన్సేషనల్ వసూళ్లను క్రియేట్ చేశాయి.. రియల్ లైఫ్ స్టోరీగా తెరకెక్కిన సినిమాలకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలుసు.. అలాంటి స్టోరీని రాజు వెడ్స్ రాంబాయి. క్యూట్ లవ్ స్టోరీ తో వచ్చిన ఈ చిత్రం యూత్ ని బాగా ఆకట్టుకుంది.. మూవీ హిట్ అవ్వడంతో పాటుగా కలెక్షన్లు కూడా భారీగానే వసూల్ అయ్యాయి.. సినిమా వచ్చి చాలా రోజులు అవుతున్న సరే ఇందులోని పాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి.. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను అలరించిందో.. అయితే ఈ కాంబో సూపర్ హిట్ అవడంతో.. మరోసారి ఈ కాంబోలో సినిమా రాబోతుంది అంటూ ఇండస్ట్రీలో ఓ న్యూస్ వినిపిస్తుంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఈ వార్త అయితే మాత్రం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.. అతి త్వరలోనే దీని గురించి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది..
మళ్ళీ రిపీట్ కానున్న కాంబో
తెలుగు చిత్ర పరిశ్రమలోని యువ దర్శకులు డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకుల ముందుకు వస్తు సత్తాను చాటుకుంటున్నారు.. దర్శకుడు సాయిలు మళ్ళీ యువ హీరో అఖిల్ రాజ్ తో కొత్త ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నాడట. ఈ మూవీ స్టోరీ కూడా రూరల్ బ్యాక్ డ్రాప్ లోనే సాగే కథతో రాబోతుందని టాక్.. ఇక ఈ కాంబోలో ఎలాంటి స్టోరీ రానుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యకతప్పదు. ఇక హీరోయిన్ కూడా రిపీట్ అవుతుందా లేదా అనేవి కాలమే నిర్ణయించాలి. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ డైరెక్టర్ ఇలాంటి స్టోరీలతోనే మూవీలను చేస్తానని అన్నాడు.. మరి ఈసారి ఎలాంటి లవ్ స్టోరీని పరిచయం చేయబోతున్నాడు చూడాలి..
మొత్తానికి ‘రాజు వెడ్స్ రాంబాయి’ కాంబో మళ్ళీ వస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందో లేదో చూడాలి.


