|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

క్యారవాన్‌ ఫేవర్‌ కోసం రూ.2 లక్షలు.. స్టార్‌ హీరో విజయ్ సేతుపతిపై యువతి సంచలన ఆరోపణలు

Published: 29-07-2025, 5:19 AM
క్యారవాన్‌ ఫేవర్‌ కోసం రూ.2 లక్షలు.. స్టార్‌ హీరో విజయ్ సేతుపతిపై యువతి సంచలన ఆరోపణలు

కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతిపై ఓ యువతి చేసిన సంచలన ఆరోపణలు తమిళనాడులో కలకలం రేపుతున్నాయి. క్యారవాన్ ఫేవర్ కోసం రూ.2 లక్షలు ఆఫర్ చేశాడని ఆమె ఆరోపించింది. ప్రస్తుతం ఆమె రిహబిలిటేషన్ సెంటర్లో చికిత్స పొందుతోంది.

Key Points

1

విజయ్ సేతుపతిపై క్యారవాన్ ఫేవర్ కోసం రూ.2 లక్షలు ఆఫర్ చేశారని ఆరోపణ.

2

యువతి రిహబిలిటేషన్ సెంటర్లో చికిత్స పొందుతోందని వెల్లడి.

4

కోలీవుడ్‌లో డ్రగ్స్‌, క్యాస్టింగ్‌ కౌచ్‌ సమస్యలపై చర్చ జరుగుతోంది.

యువతి చేసిన సంచలన ఆరోపణలు

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతిపై ఓ అమ్మాయి చేసిన ఆరోపణలు ఇప్పుడు తమిళనాడులో దుమారం రేపాయి. ఓ యువతిని విజయ్‌ చాలా ఏళ్లుగా ఇబ్బంది పెట్టాడని, క్యారవాన్‌ ఫేవర్‌ కోసం రూ. 2 లక్షలు, డ్రైవ్స్‌ కోసం రూ. 50 వేలు ఆఫర్‌ చేశాడని ఆరోపించింది. అంతేకాదు సదరు యువతి ప్రస్తుతం రిహబిలేషన్ సెంటర్‌ చికిత్స పొందుతోందని సోషల్‌ మీడియాలో ద్వారా వెల్లడించి.. కాసేపటికే ఆ పోస్ట్‌ని డిలీట్‌ చేసింది.

అసలేం జరిగింది? కోలీవుడ్‌లో డ్రగ్స్‌, క్యాస్టింగ్‌ కౌచ్‌ కొనసాగుతుందంటూ రమ్యా మోహన్‌ అనే యువతి నిన్న(జులై 28) మధ్యాహ్నం ఎక్స్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది .అందులో తనకు తెలిసిన ఓ యువతికి జరిగిన అన్యాయం గురించి వివరిస్తూ..దానికి కారణం విజయ్‌ సేతుపతే అని ఆరోపించింది.

రిహబిలిటేషన్ సెంటర్‌లో చికిత్స

‘ తమిళ ఇండస్ట్రీలో డ్రగ్స్‌, క్యాస్టింగ్‌ కౌచ్‌ కల్చర్‌ ఎక్కువైంది. ఇది జోక్‌ కాదు. నాకు తెలిసిన, మీడియాకు బాగా పరిచయం ఉన్న ఓ యువతి ఇప్పుడు ఊహించని ఒక ప్రపంచంలోకి లాగబడింది. ఆమె ఇప్పుడు రిహాబిలేషన్‌ సెంటర్‌లో ఉంది. క్యారవాన్ ‌ ఫేవర్ ‌ కోసం రూ . 2 లక్షలు , డ్రైవ్స్ ‌ కోసం రూ . 50 వేలను స్టార్ ‌ హీరో విజయ్ ‌ సేతుపతి ఆఫర్ ‌ చేశాడు. ఆమెను అతను చాలా ఏళ్లుగా వేధించాడు . ఇదొక్కటే కాదు .. ఇండస్ట్రీలో ఇలాంటి స్టోరీస్ ‌ చాలా ఉన్నాయి . బాధితులను విస్మరిస్తూ… ఇలాంటి వ్యక్తులను మీడియా దేవుడిగా చిత్రీకరిస్తుంది ’ అంటూ రమ్య విమర్శించింది .

సోషల్ మీడియాలో పోస్ట్ డిలీట్

అంతేకాదు నిజాన్ని గుర్తించకుండా .. బాధితురాలిపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది . డైరీ, ఫోన్ చాట్‌ల ద్వారా ఆ యువతి అనుభవించిన బాధ బయటకు వచ్చిందని , ఇది కట్టు కథకాదని , ఆమె జీవితం .. ఆమె బాధ .. అంటూ మరో ట్వీట్ ‌ చేసింది . అందుకే డిలీట్‌ చేశా విజయ్‌ని ఆరోపిస్తూ చేసిన ట్వీట్లను కాసేపటికే ఆమె డిలీట్ ‌ చేశారు . దీంతో పెద్ద ఎత్తున ఆమెపై విమర్శలు వచ్చాయి . నిజమే అయితే ఎందుకు డిలీట్ ‌ చేశావంటూ నెటిజన్స్ ‌ రమ్యపై మండిపడ్డారు . దీంతో దానికి వివరణ ఇస్తూ రమ్య మరో ట్వీట్ ‌ చేసింది . కోపంతో ఆ ట్వీట్ ‌ పెట్టానని , అది అంత వైరల్ ‌ అవుతుందని ఊహించలేదని , బాధితురాలి గోప్యత , శ్రేయస్సు కోసం తన పోస్ట్‌ను తొలగించినట్లు ఆ ట్వీట్ ‌ లో పేర్కొంది .

విజయ్ సేతుపతిపై చేసిన ఆరోపణలు తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర దుమారం రేపాయి. ఈ ఘటనతో కోలీవుడ్‌లోని డ్రగ్స్, క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు మళ్ళీ చర్చనీయాంశమయ్యాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.