
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కలిసి తెరకెక్కిస్తున్న `AA22` సినిమా గురించి షాకింగ్ వార్త బయటకు వచ్చింది. బన్నీ ఈ సినిమాలో త్రిబుల్ రోల్ లో నటించనున్నారట!
Key Points
అల్లు అర్జున్ త్రిబుల్ రోల్ లో నటించనున్నారు!
700 కోట్ల బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మాణం.
జాన్వీ కపూర్, అనన్య పాండే హీరోయిన్లు కావచ్చు.
త్రిబుల్ రోల్ లో బన్నీ
`పుష్ప 2` సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీ కుమార్ దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వర్కింగ్ టైటిల్ `AA22`. టైమ్ ట్రావెల్ కథతో సైన్స్ ఫిక్షన్‌గా దీన్ని తెరకెక్కించబోతున్నారు. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్స్ ఉంటాయట.
ఈ ప్రాజెక్ట్ నుంచి అదిరిపోయే వార్త వినిపిస్తుంది. ఇందులో బన్నీ త్రిబుల్ రోల్ చేస్తున్నారట. హీరోగా, విలన్ గా, అనిమేషన్ క్యారెక్టర్ – ఇలా మూడు రకాల పాత్రలు చేస్తున్నాడట. దీనికోసం అట్లీ ఇంటర్నేషనల్ VFX టీం తో వర్క్ చేస్తున్నాడు.
భారీ బడ్జెట్ సినిమా
700 కోట్ల బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. జాన్వీ కపూర్, అనన్య పాండే హీరోయిన్స్ గా నటించే ఛాన్స్ ఉందట. 2026లోగానీ, 2027 లోగానీ ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది.
అల్లు అర్జున్ ఈ సినిమాకి రూ.300 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడట. అట్లీ 100 కోట్లు తీసుకున్నాడట. ఇండియన్ సినిమాలో ఇంత రెమ్యునరేషన్ తీసుకున్న హీరో, దర్శకుడు ఎవరూ లేరు.
రిలీజ్ డేట్
`పుష్ప 2`తో ఇండియన్ సినిమా బాక్సాఫీసుని షేక్ చేసిన అల్లు అర్జున్.. ఇప్పుడు అట్లీ మూవీతో వరల్డ్ మార్కెట్‌ని టార్గెట్ చేస్తున్నారు. వేల కోట్ల కలెక్షన్ల టార్గెట్‌తో ఈ మూవీని చేయబోతున్నారని తెలుస్తుంది.
అల్లు అర్జున్ మరియు అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ అంచనాలను పెంచుతోంది. వేల కోట్ల కలెక్షన్లను టార్గెట్ చేస్తూ ఈ సినిమా సరికొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.


