|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అల్లు అర్జున్, అట్లీ మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌.. బన్నీ మూడు నెలలు అక్కడే

Published: 25-06-2025, 6:46 AM
అల్లు అర్జున్, అట్లీ మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌.. బన్నీ మూడు నెలలు అక్కడే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు దర్శకుడు అట్లీ కలిసి చేస్తున్న సినిమాకి సంబంధించి తాజా అప్డేట్ వచ్చింది. ముంబైలో భారీ ఎత్తున సినిమా చిత్రీకరణ జరుగనుంది. ఈ చిత్రం పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల కానుంది.

Key Points

1

అల్లు అర్జున్, అట్లీ చిత్రం ముంబైలో షూటింగ్ ప్రారంభం.

2

బ్లూ మ్యాట్ సెట్ లో షూటింగ్ జరుగుతుంది.

4

ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో షూటింగ్ జరుగుతుంది.

ముంబైలో షూటింగ్ ప్రారంభం

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ రేంజ్‌ మారిపోయింది. `పుష్ప 2`తో ఆయన పాన్‌ ఇండియా దాటి పాన్‌ వరల్డ్ లోకి ఎదిగిపోయారు. ఈ మూవీ బన్నీ ఇమేజ్‌ని, రేంజ్‌ని మార్చేసిందని చెప్పొచ్చు. ఇప్పుడు చేయబోయే మూవీతో అంతర్జాతీయ మార్కెట్‌ ని టార్గెట్‌ చేశారు బన్నీ.

ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. `ఏఏ22ఏ6`(వర్కింగ్‌ టైటిల్‌) పేరుతో ఈ చిత్రం రూపొందుతుంది. సైన్స్ ఫిక్షన్‌ ఫాంటసీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అట్లీ.

ఇండియాలోనే ఇప్పటి వరకు రాని కాన్సెప్ట్ తో ఈ మూవీని రూపొందించే పనిలో ఉన్నారు. హాలీవుడ్‌ రేంజ్‌లో సినిమాని ప్లాన్‌ చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన లీక్‌లు ఇచ్చేశారు. సినిమాని ప్రకటిస్తూనే ఓ వీడియోని విడుదల చేశారు.

సూపర్‌ హీరో కాన్సెప్ట్ తో సినిమా ఉండబోతుందని రివీల్‌ చేశారు. ఆ మధ్య దీపికా పదుకొనె సినిమాలోకి ఆహ్వానిస్తూ కూడా వీడియోని విడుదల చేశారు. ఇందులోనూ ఇదే విషయాన్ని చెప్పకనే చెప్పారు.

అల్లు అర్జున్‌, అట్లీ చిత్రం సూపర్‌ హీరోని, అలాగే మైథాలజీ, ఫాంటసీ అంశాల మేళవింపుగా ఉంటుందని, దీనికోసం ఓ ప్రత్యేకమైన ప్రపంచాన్నే సృష్టించబోతున్నారని తెలుస్తోంది. ఇవన్నీ ఇప్పుడు సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి.

ఇంకా సినిమా షూటింగే ప్రారంభం కాలేదు. అప్పుడే ఈ స్థాయిలో అంచనాలు నెలకొనడం విశేషం. సుమారు ఆరువందల కోట్ల బడ్జెట్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.

బ్లూ మ్యాట్ సెట్ మరియు టెక్నీషియన్లు

అదే సమయంలో బడ్జెట్‌కి పరిమితులు లేవని ఇటీవలే దర్శకుడు అట్లీ చెప్పారు. హాలీవుడ్‌కి చెందిన వీఎఫ్‌ఎక్స్ కంపెనీలు, పలు స్టూడియోలు ఈ మూవీ కోసం పనిచేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించిన అప్‌ డేట్‌ వచ్చింది. ముంబయిలో చిత్రీకరణ జరపబోతున్నారట. ముంబయిలో మొదటి షెడ్యూల్‌ షూట్‌ చేయనున్నారు.

అయితే బ్లూ మ్యాట్‌ సెట్‌లో ఈ షూటింగ్‌ ఉంటుందని తెలుస్తోంది. దీని కోసం అమెరికా నుంచి ప్రత్యేకమైన టెక్నీషియన్ల టీమ్‌ రాబోతున్నారట. ట్రయిర్‌ అండ్‌ ఎర్రర్‌ మెథడ్‌లో ఈ షెడ్యూల్‌ని షూటింగ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు.

దీని ప్రకారం కొంత షూటింగ్‌ జరిపి, దాన్ని వీఎఫ్‌ఎక్స్ లోకి కన్వర్ట్ చేసి ఎలా వస్తుందో చూసి, ఏదైనా ఎర్రర్స్ ఉంటే కరెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఆ క్లారిటీ కోసం ఈ మెథడ్‌ని ఫాలో అవుతున్నారట. ఒక్కసారి టెక్నికల్‌గా సమస్యలు లేవని తేలిన తర్వాత కంటిన్యూగా షూటింగ్‌ని చేయబోతున్నారట.

ఓ రకంగా ముంబాయి షెడ్యూల్‌ అనేది సినిమాకి టెస్ట్ షూట్‌ లాంటిదని చెప్పొచ్చు. ఇందులోనే సమస్యలన్నింటిని పరిష్కరించుకుని ముందుకెళ్లాలని టీమ్‌ భావిస్తుంది. అందుకోసమే ఈ షెడ్యూల్‌ని మూడునెలలు ప్లాన్‌ చేశారని సమాచారం.

ఇది సినిమాకే లాంగ్‌ షెడ్యూల్‌. అయితే ఈ మూవీ చిత్రీకరణ కోసం ఇప్పుడు బన్నీ ఏకంగా ముంబాయికే షిఫ్ట్ కాబోతున్నారు. త్రీ మంత్స్ అక్కడే ఉండబోతున్నారు. అందుకోసం అక్కడే ఓ ఫ్లాట్‌ రెంట్‌కి తీసుకుంటున్నారట బన్నీ.

ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతి

ఇప్పుడీ వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అదే సమయంలో సినిమాపై హైప్‌ని, ఇంట్రెస్ట్ ని పెంచుతున్నాయి. సన్‌ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది ఆడియెన్స్ ముందుకు తీసుకురావాలని ప్లాన్‌ చేస్తున్నారు.

ఇందులో హీరోయిన్లుగా దీపికా పదుకొనెతోపాటు మరో నలుగురు ఉంటారని సమాచారం. స్టార్‌ హీరోయిన్లని తీసుకోబోతున్నారట. దీనికి సంబంధించిన వార్త క్రేజీగా మారింది.

ఇక బన్నీ చివరగా `పుష్ప 2` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఇది గతేడాది డిసెంబర్‌లో విడుదలైంది. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది.

శ్రీలీల స్పెషల్‌ సాంగ్‌ చేసింది. ఫహద్‌ ఫాజిల్‌, రావు రమేష్, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. `పుష్ప 2` సుమారు రూ.1800కోట్ల వసూళ్లని రాబట్టిన విషయం తెలిసిందే.

ఇక దీనికి మూడో పార్ట్ కూడా ఉంది. కాకపోతే దీనికి చాలా టైమ్‌ పడుతుంది. దర్శకుడు అట్లీ చివరగా `జవాన్‌` చిత్రాన్ని రూపొందించారు. ఇది వెయ్యి కోట్లు వసూలు చేసింది.

చిత్ర యూనిట్ ముంబైలోని బ్లూ మ్యాట్ సెట్‌లో షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకమైన టెక్నాలజీతో ఈ సినిమా అత్యధిక అంచనాలను నింపుతుందని భావిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.