
📌 Key Points
- అల్లు అర్జున్, బాసిల్ జోసెఫ్ కాంబోలో పాన్ ఇండియా చిత్రం రాబోతోంది.
- 2027లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
- గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
- అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో బాసిల్ జోసెఫ్‌తో బన్నీ కనిపించడం ప్రాజెక్టుపై అంచనాలు పెంచేసింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్‌తో కలిసి ఒక పాన్ ఇండియా సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించనున్నారు. 2027లో షూటింగ్ ప్రారంభం కానుంది.
బన్నీ, బాసిల్ జోసెఫ్ కలయికలో పాన్ ఇండియా చిత్రం
Bunny Basil: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మలయాళంలో ‘మిన్నల్ మురళి’ వంటి వినూత్నమైన సూపర్ హీరో చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకుడు బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో బన్నీ ఒక భారీ పాన్ ఇండియా చిత్రాన్ని చేయబోతున్నారు. ఇటీవల అల్లు శిరీష్ ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో బాసిల్ జోసెఫ్ మెరవడంతో ఈ వార్త మరింత వైరల్ అయ్యింది. అందులోనూ అల్లు అర్జున్ కు మళయాళంలో మంచి క్రేజ్ ఉండటంతో బాసిల్ కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
Read also- ఓటీటీలోకి శివాజీ – లయ సాంప్రదాయని సుప్పిని సుద్ధపూసని!
2027లో షూటింగ్ ప్రారంభం
అల్లు అర్జున్‌కు కేరళలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. అక్కడ ఆయనను అభిమానులు ముద్దుగా ‘మల్లు అర్జున్’ అని పిలుచుకుంటారు. ఇప్పుడు నేరుగా ఒక మలయాళ స్టార్ డైరెక్టర్‌తో బన్నీ సినిమా చేస్తుండటం విశేషం. బాసిల్ జోసెఫ్ తన కథల్లో హ్యూమర్, ఎమోషన్ గ్రాండియర్‌ను అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తారు. ఈ నేపథ్యంలో, అల్లు అర్జున్ ఇమేజ్‌కు తగ్గట్టుగా బాసిల్ ఒక యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ లేదా సూపర్ హీరో బ్యాక్‌డ్రాప్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం అల్లు అర్జున్ వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు. అట్లీ (Atlee), లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) వంటి స్టార్ డైరెక్టర్లతో సినిమాలు లైన్ లో ఉన్నాయి. బన్నీ ప్రస్తుత కమిట్‌మెంట్స్ అన్నీ పూర్తయిన తర్వాత, బాసిల్ జోసెఫ్ సినిమా షూటింగ్ 2027లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ గ్యాప్‌లో బాసిల్ జోసెఫ్ స్క్రిప్ట్‌ను పూర్తిస్థాయిలో మెరుగుపరిచి, ప్రీ-ప్రొడక్షన్ పనులను పూర్తి చేయనున్నారు.
గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాణం
Read also- రంగస్థలం @8ఏళ్లు.. ఎవరికి తెలియని తెరవెనుక విషయాలు?
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించబోతున్నట్లు టాక్. బాసిల్ జోసెఫ్ గతంలో హిందీలో ‘శక్తిమాన్’ ప్రాజెక్ట్ చేయాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. ఇప్పుడు అదే తరహా భారీ కాన్సెప్ట్‌ను అల్లు అర్జున్ కోసం బాసిల్ రీ-వర్క్ చేస్తున్నారా? అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. మార్చి 2026లో జరిగిన అల్లు శిరీష్ వేడుకల్లో అల్లు అర్జున్ తన భవిష్యత్ చిత్రాల దర్శకులైన అట్లీ, సుకుమార్ బాసిల్ జోసెఫ్లను ఒకే వేదికపై పరిచయం చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కన్ఫామ్ అవ్వడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
మొత్తానికి అల్లు అర్జున్, బాసిల్ జోసెఫ్ కలయికలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


