|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బన్నీ ఖాతాలో మరో సంచలనం! ఏ హీరోకూ సాధ్యం కాని రికార్డు.. ఐకాన్ స్టార్ విధ్వంసం!

Published: 15-04-2026, 1:05 AM
బన్నీ ఖాతాలో మరో సంచలనం! ఏ హీరోకూ సాధ్యం కాని రికార్డు.. ఐకాన్ స్టార్ విధ్వంసం!
  • అల్లు అర్జున్ ‘బుట్ట బొమ్మ’ పాట 93 కోట్ల వ్యూస్‌తో సరికొత్త రికార్డు!
  • తమన్ సంగీతం, అర్మాన్ మాలిక్ గాత్రం, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం – పాట బ్లాక్ బస్టర్!
  • పూజా హెగ్డే అందం, బన్నీ స్టెప్పులు – యూట్యూబ్‌లో ట్రెండింగ్
  • పాన్ ఇండియా స్థాయిలో బన్నీకి తిరుగులేని ఇమేజ్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన సత్తా చాటాడు. ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘బుట్ట బొమ్మ’ పాట యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ పాట 100 కోట్ల వ్యూస్‌కు చేరువలో ఉంది.

బుట్ట బొమ్మ పాటతో బన్నీ సంచలనం

ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నాడు అల్లు అర్జున్.. పుష్ప రెండు సినిమాలతో జాతీయ స్థాయిలో తానేంటో నిరూపించుకున్న ఈ హీరో.. నార్త్ లో కూడా తిరుగులేని ఇమేజ్ ను సాధించాడు. ప్రస్తుతం బన్నీ రేంజ్ వేరు.. భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల లైన్ అప్ తో.. ఐకాన్ స్టార్ డేట్స్ ఫుల్ అయిపోయాయి.

వరుసగా 1000 కోట్ల సినిమాలతో బన్నీ బిజీ బిజీగా ఉన్నాడు. ఈక్రమంలో ఆరేళ్ల క్రితం రిలీజ్ అయిన అల్లు అర్జున్ తెలుగు సాంగ్ ఒకటి.. అరుదైన రికార్డును బ్రేక్ చేసింది. కలెక్షన్స్ విషయంలో ఇప్పటికే ఏ తెలుగు హీరో సాధించలేని ఘనత సాధించిన అల్లు హీరో.. ఈ సాంగ్ విషయంలో కూడా అదే మ్యాజిక్ ను రిపిట్ చేశాడు.

ఈమధ్య యూట్యూబ్ లో పాటల హవా పెరిగిపోయింది. పోటా పోటీగా తెలుగు పాటలు సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాయి. కోట్లలో వ్యూస్, లక్షల్లో లైక్స్ తో.. యూట్యబ్ ను షేక్ చేస్తున్న పాటలు చాలా ఉన్నాయి. అందులో 100 కోట్ల వ్యూస్ కు అతి దగ్గరలో అల వైకుంఠపురములో మూవీలోని బుట్టబొమ్మ సాంగ్.

100 కోట్ల వ్యూస్ దిశగా ఐకాన్ స్టార్

అల్లు అర్జున్ స్టైలీష్ లుక్స్, డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్… బన్నీ మార్క్ హుక్ స్టెప్స్ మెలోడీ ట్యూన్ తో మెస్మరైజ్ చేసిన బుట్ట బొమ్మ పాట తెలుగులో రికార్డులను బ్రేక్ చేసి దూసుకుపోతోంది. ఈ సాంగ్ 93 (938 మిలియన్‌ వ్యూస్‌) కోట్లకు పైగా వ్యూస్‌ని సాధించి సరికొత్త రికార్డు ను క్రియేట్ చేసింది. యూట్యూబ్‌లో ఇంత వరకూ ఏ తెలుగు సినిమా పాట సాధించలేని అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

తమన్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేసిన ఈ పాటకు ఆర్మాన్ మాలిక్ అద్భుతమైన గాత్రంతో ప్రాణం పోశాడు. యూత్ కు బాగా కనెక్ట్ అయ్యేలా రామజోగయ్య శాస్త్రీ రాసిన లిరిక్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకూ.. అందరు హమ్ చేసుకునేంత సులువగా ఉండటంతో.. అప్పట్లో ప్రతీ ఒక్కరి నోటా ఈ పాటే వినిపించింది. ఇక అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా జానీ మాస్టర్ అందించిన కొరియోగ్రాఫీ పాటకే హైలెట్ అయ్యింది.

ఇక ఈ పాటలో అల్లు అర్జున్ హుక్ స్టెప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాటలో నిజంగా బుట్ట బొమ్మలా కనిపించింది పూజా హెగ్డే. ఈ సినిమా నుంచి ఆమె పేరు పక్కన్న బుట్ట బొమ్మ ట్యాక్ కూడా పెట్టడం స్టార్ట్ చేశారు. ఇక బ్యాక్ గ్రౌండ్ సెట్ తో పాటు.. కాస్ట్య్యూమ్స్, మేకప్, ఇలా చిన్నా పెద్ద విషయాలన్నీ ఈ పాట సక్సెస్ లో భాగం అయ్యాయి.

తెలుగు పాటల్లో సరికొత్త రికార్డు

అల వైకుంఠపురములో సినిమాలో ఉన్న పాటలన్ని అద్భుతంగా ఉంటాయి.. కానీ ఈ పాట మాత్రం చాలా స్పెషల్ గా నిలిచింది. రిలీజ్ అయిన వెంటనే ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందనను అందుకుంది. సోషల్ మీడియాలో ఈ పాట ఎంత వైరల్ అయ్యిందంటే.. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో లక్షలాది మంది ఈ స్టెప్స్‌ను రీక్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతో బుట్టబొమ్మ పాట ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అన్ని దేశాల్లో తెలుగువారు, ఫారెనర్స్ కూడా ఈ పాటకు రీల్స్ చేశారు. హుక్ స్టెప్ తో స్పెషల్ వీడియోలు కూడా చేశారు. దాంతో ఈ పాటకు అంతకంతకు వ్యూస్ పెరుగుతూ వచ్చాయి.

ఈ పాట విజయం వెనుక అందరి కృషి ఉంది. అద్భుతమైన సంగీతం, ఆకట్టుకునే లిరిక్స్, స్టైలిష్ డ్యాన్స్, విజువల్ గ్రాండియర్ ఇలా అన్నీ కలిసి బుట్టబొమ్మ పాటని ఒక క్లాసిక్ హిట్‌గా నిలబెట్టాయి. ప్రస్తుతం 93 కోట్ల ( 938 మిలియన్‌ వ్యూస్‌) వ్యూస్ తో ఉన్న ఈ పాట త్వరలోనే 100 కోట్ల వ్యూస్ మార్క్ ను దాటుతుందని అభిమానులు కోరుకుంటున్నారు. తెలుగు సినీ సంగీత చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే సాంగ్ అవుతుందని ఐకాన్ స్టార్ అభిమానులు ఆశిస్తున్నారు.

‘బుట్ట బొమ్మ’ పాట అల్లు అర్జున్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి. ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కు ఇది నిజంగా పండగే!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.