|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అట్లీ సంచలనం: దీపికానే నా లక్కీ ఛార్మ్! అసలు నిజం చెప్పేసిన డైరెక్టర్!!

Published: 27-01-2026, 11:05 AM
అట్లీ సంచలనం: దీపికానే నా లక్కీ ఛార్మ్! అసలు నిజం చెప్పేసిన డైరెక్టర్!!
  • దర్శకుడు అట్లీ, షారుఖ్ ఖాన్‌తో ‘జవాన్’ విజయం తర్వాత అల్లు అర్జున్‌తో AA 22 చిత్రం చేస్తున్నారు.
  • దీపికా పదుకొనేను తన లక్కీ చార్మ్ అని అట్లీ పేర్కొనడం హాట్ టాపిక్‌గా మారింది.
  • దీపికా గతంలో పని గంటల వివాదంలో చిక్కుకోవడం జరిగింది.
  • సందీప్ రెడ్డి సినిమా నుండి దీపిక తప్పుకోవడం, కల్కి 2 ఆఫర్ కోల్పోవడం చర్చనీయాంశంగా మారింది.

తమిళ దర్శకుడు అట్లీ, షారుఖ్ ఖాన్‌తో ‘జవాన్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో AA 22 అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకొనే నటిస్తుండగా, ఆమెను అట్లీ లక్కీ చార్మ్ అని పేర్కొనడం హాట్ టాపిక్‌గా మారింది.

అల్లు అర్జున్‌తో అట్లీ AA 22 చిత్రం

Atlee: తమిళ చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో డైరెక్టర్ అట్లీ(Atlee) ఒకరు. రాజా రాణి సినిమా ద్వారా దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన అట్లీ ఇప్పటివరకు ఐదు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ ఐదు సినిమాలు కూడా ఎంతో అద్భుతమైన విజయాలను అందుకోవడంతో అట్లీ క్రెజ్ భారీగా పెరిగిపోయింది. ఈయన కేవలం తమిళ సినిమాలు మాత్రమే కాకుండా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమా చేసి సూపర్ సక్సెస్ అందుకున్న అట్లీ తదుపరి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేసే ఛాన్స్ అందుకున్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమా పనులలో అట్లీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా AA 22 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. దాదాపు 50% షూటింగ్ పనులు కూడా పూర్తి అయ్యాయని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలోనే డైరెక్టర్ అట్లీ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అట్లీ తన సినిమాలకు సంబంధించి పలు విషయాలను తెలియజేశారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనే నటించబోతున్న సంగతి తెలిసిందే. దీపిక హీరోయిన్ కావడంతో ఆమె గురించి అట్లీ మాట్లాడుతూ.. దీపికా పదుకొనే తన లక్కీ చార్మ్ అంటూ తెలియజేశారు.

దీపికా పదుకొనే లక్కీ చార్మ్ అంటున్న అట్లీ

అల్లు అర్జున్ సినిమాలో దీపికా పదుకొనే చాలా కొత్తగా కనిపించబోతున్నారని, ఆమె తన నటనతో అందరిని కట్టిపడేస్తారని తెలిపారు. ఇదివరకు దీపికా పదుకొనే షారుఖ్ ఖాన్ తో కలిసి జవాన్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు అట్లీ డైరెక్టర్ కావడం విశేషం. ఇలా తన సినిమాలో దీపిక నటించి మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో తనని లక్కీ చార్మ్ అంటూ మాట్లాడారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కాంట్రవర్సి బ్యూటీ మీ లక్కీ చార్మ్ కావడం ఏంటి అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల ఈమె సందీప్ రెడ్డి సినిమాలో పని గంటలు విషయంలో పెద్ద ఎత్తున వివాదంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇలా సెలబ్రిటీలకు ఇంతే సమయం ఉండాలంటూ ఈమె మాట్లాడిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి .ఈ వివాదం కారణంగానే సందీప్ రెడ్డి స్పిరిట్ సినిమా నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కారణంతో కల్కి 2 అవకాశాన్ని కూడా కోల్పోయారు.

ఇక అల్లు అర్జున్ సినిమా అప్డేట్ గురించి అట్లీ మాట్లాడుతూ ఈ సినిమా నుంచి అద్భుతమైన ఔట్ ఫుట్ ఇవ్వడం కోసం తన టీం మొత్తం నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని తెలియజేశారు. ఈ సినిమా నుంచి త్వరలోనే ఒక బిగ్ సర్ప్రైజ్ రాబోతుందంటూ ఈయన చేసిన కామెంట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో దీపికాతో పాటు మృణాళ్ ఠాకూర్, జాన్వీ కపూర్,రష్మిక వాటి తదితరులు కూడా నటించబోతున్న సంగతి తెలిసిందే.

వివాదాల్లో దీపికా పదుకొనే

మొత్తానికి దీపికా పదుకొనే గురించి అట్లీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీరిద్దరి కాంబినేషన్ అల్లు అర్జున్ సినిమాకు ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.