|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అల్లు అర్జున్ కి షాక్: సినిమాస్ లో శంకర్ ఫోటో మిస్సింగ్! రచ్చ రేపుతున్న ఫ్యాన్స్!!

Published: 13-03-2026, 9:35 PM
అల్లు అర్జున్ కి షాక్: సినిమాస్ లో శంకర్ ఫోటో మిస్సింగ్! రచ్చ రేపుతున్న ఫ్యాన్స్!!
  • అల్లు అర్జున్ కొత్త మల్టీప్లెక్స్ ‘అల్లు సినిమాస్’ గ్రాండ్ ఓపెనింగ్
  • ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద డాల్బీ స్క్రీన్ ఇక్కడ ఉండటం విశేషం
  • దర్శకుల ఫోటోలలో శంకర్ ఫోటో లేకపోవడంతో వివాదం
  • అట్లీ ఫోటో ఉండటం, శంకర్ ఫోటో లేకపోవడంపై ఫాన్స్ ఆగ్రహం

అల్లు అర్జున్ కొత్తగా నిర్మించిన అల్లు సినిమాస్ ప్రారంభోత్సవం ఒక వివాదానికి దారితీసింది. థియేటర్ లో ప్రముఖ దర్శకుల ఫోటోలు ఉండగా, శంకర్ గారి ఫోటో లేకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగిందో చూద్దాం!

అల్లు సినిమాస్ గ్రాండ్ ఓపెనింగ్.. వివాదం

Allu Cinemas: అల్లు అర్జున్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా ఆయన అల్లు సినిమా గ్రాండ్ ఓపెనింగ్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. దాదాపు 7 ఎకరాల్లో అల్లు సినిమాస్ పేరుతో ఒక భారీ మల్టీ ప్లెక్స్ ను నిర్మించారు అల్లు ఫ్యామిలీ. అయితే, ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద డాల్బీ స్క్రీన్ అవడం విశేషం. దీంతో, అల్లు అర్జున్ నిర్మించిన ఈ మల్టీ ప్లెక్స్ కి ఎక్కడలేని ప్రత్యేకత సంతరించుకుంది.

ఇక, ఈ మల్టీ ప్లెక్స్ ఓపెనింగ్ కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరైన విషయం తెలిసిందే. ఆయన చేతుల మీదుగానే ఈ మల్టీ ప్లెక్స్(Allu Cinemas) ఓపెనింగ్ కూడా జరిగింది. ఇదిలా ఉంటే, అల్లు సినిమాస్ గ్రాండ్ ఓపెనింగ్ వేల అల్లు అర్జున్ మరో వివాదంలో చిక్కున్నారు. ఈ థియేటర్ లో ఇండియా వైడ్ గా చాలా మంది గొప్ప గొప్ప దర్శకుల ఫోటోలను అక్కడ ఏర్పాటు చేశారు.

దర్శకుల ఫోటోలు.. శంకర్ మిస్సింగ్

వారిలో.. రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్, మనిరత్నం, వెట్రి మారన్, రిషబ్ శెట్టి, అట్లీ ఇంకా చాలా ఫోటోలు అక్కడ ఏర్పాటు చేశారు. అయితే, వారిలో స్టార్ డైరెక్టర్ శంకర్ ఫోటో లేకపోవడం ఇప్పుడు వివాదానికి దారి తీసింది. శంకర్ ఫ్యాన్స్ చాలా మంది, శంకర్ ఫోటో లేకుండా అట్లీ ఫోటో పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో శంకర్ ఒక గొప్ప దర్శకుడు. ఆయన సినిమాల గురించి, ఆయన సాధించిన విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

సోషల్ మీడియాలో ఫాన్స్ రచ్చ

ఏ మధ్య కాలంలో కొన్ని ప్లాప్స్ ఇచ్చినంత మాత్రాన ఆయన స్థాయి ఎప్పటికీ తగ్గదు. అలాంటి దర్శకుడి ఫోటో లేకపోవడం బాధాకరం. అట్లీ నిన్నకాక మొన్న వచ్చిన దర్శకుడు ఆయన ఫోటో పెట్టి శంకర్ ఫోటో పెట్టకపోవడం ఏంటో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం, ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంతమంది, అది వాళ్ళ థియేటర్ వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెట్టుకుంటారు మనకేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు అల్లు అర్జున్.

అల్లు అర్జున్ సినిమాస్ లో జరిగిన ఈ వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే అన్ని వివరాలు అందిస్తాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.