
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఓ వీడియోలో, అల్లు అర్జున్ కూతురు అర్హ, మంచు లక్ష్మిని ‘నువ్వు అసలు తెలుగునేనా?’ అని అడిగింది. లక్ష్మి యాక్సెంట్ నుండి పుట్టిన ఈ ప్రశ్న, చాలా మందిని నవ్విస్తుంది.
Key Points
అల్లు అర్జున్ కూతురు అర్హ, మంచు లక్ష్మిని 'నువ్వు అసలు తెలుగునేనా?' అని అడిగింది.
లక్ష్మి యాక్సెంట్ గురించి అర్హ చేసిన ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ వీడియోలో అల్లు అర్జున్ వాయిస్ కూడా వినిపించింది.
లక్ష్మి మంచు తన తెలుగు నైపుణ్యాల గురించి వచ్చే విమర్శలను ఈ వీడియో హాస్యంగా చూపుతుంది.
అర్హ ప్రశ్నతో నవ్వులు పూయించిన లక్ష్మి
మంచు వారమ్మాయి లక్ష్మి మంచు, అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హలకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ తెగ నవ్వుకుంటున్నారు. నువ్వు అసలు తెలుగునేనా అంటూ అర్హ అడగడం, దానికి లక్ష్మి పడీపడీ నవ్వడం ఈ వీడియోలో చూడొచ్చు.
లక్ష్మి మంచు ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో నుంచి తెలుగు ప్రేక్షకులకు ఓ డౌట్ ఉండేది. ఆమె ఇంటర్వ్యూలో పూర్తిగా అమెరికన్ యాక్సెంట్ లో తెలుగు కూడా మాట్లాడటంతో ఆశ్చర్యపోయేవారు. తాజాగా అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా తన ఇంటికి వచ్చిన లక్ష్మిని ఇదే ప్రశ్న అడిగింది. ఈ మధ్యే బన్నీ ఇంటికి మంచు లక్ష్మి వెళ్లింది. అప్పుడు అర్హతో ఆమె సరదాగా ఆడుకుంది. నువ్వు నన్ను ఏదో అడగాలని అనుకున్నావట కదా.. అదేంటి అని అర్హను లక్ష్మి అడుగుతుంది. లక్ష్మితో అర్హ మాట్లాడుతూ నువ్వు అసలు తెలుగునేనా అని అడిగింది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
ఆ ప్రశ్న అర్థం కానట్లుగా ఏంటి తెలుగేనా.. నీతో తెలుగులోనే మాట్లాడుతున్నాను కదా.. అలా అంటావేంటి అంటూ లక్ష్మి తెగ నవ్వేస్తుంది. నీ యాక్సెంట్ వేరుగా ఉంది కదా అని అర్హ అంటే.. నీది కూడా అలాగే ఉంది కదా అని లక్ష్మి అంటుంది. ఈ వీడియోలో బ్యాక్‌గ్రౌండ్ లో అల్లు అర్జున్ వాయిస్ కూడా వినిపిస్తుంది. ఎందుకలా అడిగావ్ అంటూ బన్నీ తన కూతురిని ప్రశ్నించడం అందులో వినొచ్చు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత మరో సినిమా చేయలేదు. ప్రస్తుతం అట్లీతో ఓ భారీ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడు. తన కెరీర్లో ఇది 22వ మూవీ. పుష్ప 2తో బన్నీ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయిన విషయం తెలిసిందే. దీంతో అతని తర్వాతి మూవీపై సహజంగానే భారీ అంచనాలు ఉన్నాయి.
లక్ష్మి మంచు తెలుగు ప్రయాణం
అందుకే బన్నీ ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఇక లక్ష్మి మంచు విషయానికి వస్తే మొదట్లో టాలీవుడ్ లో పలు పాత్రలు పోషించిన ఆమె.. అవకాశాలు వెతుక్కుంటే ముంబై వెళ్లింది. ఈ మధ్యే ది ట్రైటర్స్ ఆఫ్ ఇండియా రియాలిటీ షోలో కనిపించింది. గతేడాది ఆదిపర్వం మూవీలో నటించిన ఆమె చేతుల్లో ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్టులు లేవు.
అల్లు అర్హ ప్రశ్నకు లక్ష్మి ఇచ్చిన సమాధానం, వారిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని చూపిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, ఇద్దరికీ మంచి పేరు వచ్చింది.


