|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అల్లు అర్జున్ కోసం లోకేష్ మాస్టర్ ప్లాన్! భారీ ప్రాజెక్ట్‌పై హైదరాబాద్‌లో కీలక చర్చలు!

Published: 24-12-2025, 6:15 AM
అల్లు అర్జున్ కోసం లోకేష్ మాస్టర్ ప్లాన్! భారీ ప్రాజెక్ట్‌పై హైదరాబాద్‌లో కీలక చర్చలు!
  • పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో మరో భారీ సినిమా చేస్తున్నాడు.
  • తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ కొత్త సినిమాకు ఓకే చెప్పినట్లు వార్తలు.
  • లోకేష్ కనగరాజ్ ఈ కథను మొదట పవన్ కళ్యాణ్ కోసం రాసినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది.
  • తాజాగా హైదరాబాద్ కు లోకేష్, అతని మేనేజర్ వచ్చి అల్లు అర్జున్ తో కీలక భేటీ నిర్వహించారు.

అగ్ర హీరో అల్లు అర్జున్ కొత్త సినిమాపై టాలీవుడ్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పుష్ప 2 తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో బన్నీ ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడట. దీనిపై లోకేష్ హైదరాబాద్ లో అల్లు అర్జున్ తో కీలక చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్ – లోకేష్ కనగరాజ్ కాంబో ఖాయమా?

టాలీవుడ్ అగ్ర హీరో అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన అల్లు అర్జున్, ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందట. అయితే ఈ మూవీ ఇంకా ఫినిష్ కాకముందే మరో కొత్త సినిమాకు అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. అది తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ కొత్త సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. మొదట పవన్ కళ్యాణ్ కోసం ఈ కథను లోకేష్ రాసుకున్నట్లు ప్రచారం జోరుగా సాగింది.

అయితే చివరి క్షణంలో పవన్ కళ్యాణ్ డేట్స్ కుదుర‌క‌పోవ‌డంతో లోకేష్ మూవీ రద్దయినట్లు టాక్. దీంతో వెంటనే అల్లు అర్జున్ డేట్స్ కోసం లోకేష్ ప్రయత్నాలు చేశారట. దీనిపై వెంటనే స్పందించిన అల్లు అర్జున్, సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా హైదరాబాద్ కు లోకేష్, అతని మేనేజర్ వచ్చినట్లు టాక్ నడుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. నిన్న రాత్రి అల్లు అర్జున్ తో లోకేష్ భేటీ కూడా జరిగిందట. ఇక ఈ సినిమాపై అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

హైదరాబాద్‌లో లోకేష్.. అల్లు అర్జున్‌తో భేటీ!

పవన్ కోసం రాసిన కథ బన్నీకి సరిపోయిందా?

పవన్ కళ్యాణ్ కోసం రాసిన కథ బన్నీ చేతికి చేరడంతో ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.