
📌 Key Points
- అల్లు అర్జున్ బాలీవుడ్ మూవీ ‘దురంధర్ 2’ చూసి రణ్‌వీర్ సింగ్ నటనను ప్రశంసించారు.
- దర్శకుడు ఆదిత్య ధర్ ప్రతిభను బన్నీ కొనియాడారు.
- బన్నీ ట్వీట్‌పై పవన్ కళ్యాణ్ అభిమానులు స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
- పవన్ కళ్యాణ్, హరి శంకర్ కాంబోలో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీకి మిశ్రమ స్పందన లభిస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘దురంధర్ 2’ సినిమాపై తన అభిప్రాయం వ్యక్తం చేయగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. రణ్‌వీర్ సింగ్ నటనను మెచ్చుకుంటూ చేసిన ట్వీట్‌పై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటో చూద్దాం.
బాలీవుడ్ మూవీపై అల్లు అర్జున్ రివ్యూ
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏ సినిమా రిలీజ్ అయిన చూసి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారన్న విషయం తెలిసిందే.. హీరోల ఫ్యాన్స్ లాగే అల్లు అర్జున్ కూడా మొదటి రోజే సినిమాలను చూసి ఆ సినిమాకు రివ్యూ ఇస్తాడు. గతంలో చాలా సినిమాలకే బన్నీ రివ్యూ ఇచ్చాడు. ఆయన పాజిటివ్ వేలో ఇచ్చిన సరే కొన్నిసార్లు అవి సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురవుతూ ఉంటాయి. తాజాగా ఆయన ఓ స్టార్ హీరో మూవీకి రివ్యూ ఇచ్చాడు.. దాని కారణంగా బన్నీ పై ట్రోల్స్ వినిపిస్తున్నాయని తెలిసిందే.. అసలు అల్లు అర్జున్ రివ్యూ ఇచ్చిన మూవీ ఏంటి? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఎందుకు కోపం వచ్చిందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
ఉగాది కానుకగా రిలీజ్ అయిన బాలీవుడ్ హీరో నటించిన దురంధర్ 2 మూవీని హీరో అర్జున్ చూశారు. ఆ మూవీ ఎలా ఉంది అనే దానిపై తన అభిప్రాయాన్ని తన ‘X’ వేదికగా పంచుకున్నారు. అందులో ఏముందంటే.. మన దేశంలో రణ్‌వీర్ సింగ్ వంటి వెర్సటైల్ నటుడు ఉన్నందుకు గర్వంగా ఉందని ఆయన అన్నారు. ఈ సినిమాలో రణ్‌వీర్ నటన నిప్పు కణికలా ఉందని.. తన నటనతో సినిమాను ఎక్కడికో తీసుకొని వెళ్లారని బన్నీ ప్రశంసలు కురిపించాడు.. దర్శకుడు ఆదిత్య ధర్ ప్రతిభను కూడా అల్లు అర్జున్ ఆకాశానికెత్తారు. ఆదిత్య ధర్ ఈ సినిమాతో బంతిని స్టేడియం దాటించేశారని .. మనదేశంలో ఇలాంటి ప్రతిభావంతులు ఉండడం వల్లే సినిమా యొక్క ఖ్యాతి పెరుగుతుంది అని బన్నీ రాశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. దీనిపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నట్లు తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహం
Just Watched #Dhurandhar2 ⁰Patriotism with swag 🇮🇳 A film that will make every patriot proud 🇮🇳⁰Many clap-trapping moments 👏🏽 BLAST! 💥 Congratulations to the entire team.⁰Fine performances by @ActorMadhavan garu & all actors . Technical brilliance .
‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ రివ్యూ
— Allu Arjun (@alluarjun) March 18, 2026
ఇవాళ ఉగాది పండుగ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి శంకర్ కాంబోలో తెరకెక్కిన భారీ బడ్జెట్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గ్రాండ్ గా థియేటర్లలోకి వచ్చేసింది.. ఈ సినిమా పై ఇప్పటికే రివ్యూలు పడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాకు పాజిటివ్ టాక్ తో పాటుగా మిక్స్డ్ టాక్ కూడా ఒకవైపు వినిపిస్తుంది. ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.. అయితే బన్నీ ఈ సినిమాని చూడకుండా బాలీవుడ్ హీరో సినిమా ని చూడడం ఏంటి? అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నట్లు తెలుస్తుంది.. సొంతం మామ సినిమాపై ఎటువంటి రివ్యూ కూడా ఇవ్వకుండా బాలీవుడ్ సినిమా పై రివ్యూ ఇవ్వడం ఎందుకు అని పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో వీళ్లిద్దరి మధ్య గొడవలు ఉన్నాయని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. మళ్లీ ఆ గొడవలు ఇప్పుడు స్టార్ట్ అయ్యాయా? లేదా? ఇంకా ఏదైనా ఉద్దేశం ఉందా? అన్నది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.. ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తన 22వ సినిమా తమిళ డైరెక్టర్ అయిన అట్లీతో చేస్తున్నాడు.. ఈ మూవీ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది..
మొత్తానికి అల్లు అర్జున్ చేసిన ట్వీట్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా భవిష్యత్తు కూడా వేచి చూడాల్సిందే.


