|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రేకింగ్: ‘రాకా’ స్టోరీ లీక్! పగలు హీరో, రాత్రికి విలన్.. బన్నీ మాస్ విశ్వరూపం!!

Published: 15-04-2026, 11:35 AM
బ్రేకింగ్: 'రాకా' స్టోరీ లీక్! పగలు హీరో, రాత్రికి విలన్.. బన్నీ మాస్ విశ్వరూపం!!
  • అల్లు అర్జున్ ‘రాకా’లో డ్యూయల్ రోల్! పగలు మనిషిగా, రాత్రికి భయంకరమైన మృగంగా బన్నీ విశ్వరూపం!
  • అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ భారీ నిర్మాణంలో ‘రాకా’ చిత్రం.. భారీ అంచనాలు!
  • దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్, రష్మిక, జాన్వీ కపూర్.. ‘రాకా’లో తారాగణం ఫిక్స్?
  • ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల.. రికార్డులు షేక్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో వస్తున్న రాకా సినిమా గురించి ఒక సంచలన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లీక్ కావడంతో అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

రాకాలో బన్నీ డ్యూయల్ రోల్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప సినిమాతో ప్రపంచ స్థాయి హీరోగా మారిన అల్లు అర్జున్, ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమానే రాకా. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను ఇటీవల అనౌన్స్ చేశారు. దీంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఈ రాకా సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది.

ఈ సినిమాలో బన్నీ రెండు పాత్రల్లో కనిపిస్తాడని టాక్ నడుస్తోంది. పగలు మనిషిలా, రాత్రి మృగంలా అల్లు అర్జున్ మారిపోతాడని తెలుస్తోంది. దీంతో ఇప్పటికే ఇలాంటి కాన్సెప్ట్ తో బేడియా వచ్చింది. ఈ సినిమా లాగానే రాకా ఉంటుందా? లేక కథలో ఏమైనా మార్పులు చేస్తారా ? అనే చర్చ జరుగుతోంది. కాగా ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ లో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమాలో దీపికా పదుకొనె, మృణాల్ ఠాకూర్, రష్మిక, జాన్వీ క‌పూర్‌ నటిస్తారని టాక్‌ నడుస్తోంది.

అట్లీ మ్యాజిక్.. సన్ పిక్చర్స్ గ్రాండియర్

తారాగణం అదిరింది.. అంచనాలు పెరిగాయి!

రాకా సినిమా గురించి వస్తున్న ఈ వార్తలు టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.