
అక్కినేని నాగార్జున నటించిన కల్ట్ క్లాసిక్ ‘శివ’ రీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. నవంబర్ 14న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా గురించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ శుక్రవారం ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. బన్నీ స్పీచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Key Points
నాగార్జున 'శివ' కల్ట్ బ్లాక్‌బస్టర్ నవంబర్ 14న 4K వర్షన్, డాల్బీ అట్మాస్‌లో రీ రిలీజ్ అవుతోంది.
రామ్‌గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రం 1989 అక్టోబర్ 5న విడుదలై మ్యూజికల్ హిట్‌గా నిలిచింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'శివ' మూవీ తెచ్చిన మార్పు గురించి ఈ శుక్రవారం 11:07 AMకి మాట్లాడనున్నారు.
కాలేజీ గొడవలు, గ్యాంగ్‌లు, రాజకీయ నాయకుల ప్రభావం వంటి సామాజిక అంశాలతో వర్మ కొత్త ట్రెండ్‌ను సృష్టించారు.
నాగార్జున ‘శివ’ రీ రిలీజ్ ప్రత్యేకతలు
అక్కినేని నాగార్జున నటించిన కల్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘శివ’. ఈ మూవీ నాగ్ కెరీర్‌లోనే చాలా ప్రత్యేకం. ఈ సినిమా రీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో రామ్‌గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయమయ్యారు. అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ఈ సినిమా 1989 అక్టోబర్ 5న రిలీజైంది. ఇళయరాజా సంగీతంలో ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గానూ నిలిచింది. ఈ సినిమాని శివ(1990) పేరుతోనే హిందీలో రీమేక్ చేసిన రామ్‌గోపాల్ వర్మ అక్కడ కూడా హిట్ అందుకున్నారు.
అల్లు అర్జున్ స్పీచ్‌పై భారీ అంచనాలు
ఈ సినిమా 4కె వర్షన్, డాల్బీ అట్మాస్‌లో ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుంది. తెలుగులో మరోసారి వెండితెరపై సందడి చేయనుంది. ఈ మూవీ గురించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. టాలీవుడ్ సినిమా శివ మూవీ తెచ్చిన మార్పు గురించి ప్రస్తావించనున్నారు. ఈ శుక్రవారం ఉదయం 11 గంటల 7 నిమిషాలకు మాట్లాడనున్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ ట్వీట్ చేసింది. దీంతో బన్నీ స్పీచ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శివ మూవీ గురించి ఏం మాట్లాతారనే విషయంపై అభిమానులతో పాటు అందరిలోనూ ఆతృత నెలకొంది. కాగా.. ఈ సినిమాను నవంబర్ 14న థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు.
రామ్‌గోపాల్ వర్మ సృష్టించిన ట్రెండ్
కాగా.. నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రంలో అమల హీరోయిన్‌గా నటించారు. కాలేజీలో విద్యార్థుల మధ్య గొడవలు, గ్యాంగ్‌లు, రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం స్టూడెంట్స్‌ని ఎలా ఉపయోగించుకుంటారు? విద్యార్థుల మధ్య ఎలాంటి గొడవలు సృష్టిస్తారు? ఇలాంటి సామాజిక అంశాల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించి సరికొత్త ట్రెండ్‌ని సృష్టించారు వర్మ.
శివ రీ రిలీజ్, అల్లు అర్జున్ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వర్మ సృష్టించిన ట్రెండ్, నాగార్జున కెరీర్‌లో శివ ప్రాముఖ్యతపై బన్నీ ఏం మాట్లాడతారో చూడాలి.


