
📌 Key Points
- అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా టైటిల్ ‘గాడ్ ఆఫ్ వార్’ గా ఖరారు.
- కుమారస్వామి ఆయుధం, నెమలి, విభూదితో అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల.
- చిత్రం పౌరాణిక నేపథ్యంతో, హాలీవుడ్ స్థాయి VFX తో రాబోతోంది.
- ఇది దేశవ్యాప్తంగా బహుళ భాషలలో విడుదలయ్యే పాన్ ఇండియా సినిమాటిక్ ఈవెంట్.
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రానికి ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్ ను మేకర్స్ తాజాగా రివీల్ చేశారు. కుమారస్వామి ఆయుధంతో అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. పౌరాణిక నేపథ్యంతో, పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న ఈ సినిమా వివరాలు ఆసక్తి రేపుతున్నాయి.
అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కొత్త చిత్రం టైటిల్ రివీల్
AA23:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar ) దర్శకత్వంలో వచ్చిన పుష్ప, పుష్ప 2 చిత్రాలతో పాన్ ఇండియా స్థాయి గుర్తింపును సొంతం చేసుకున్నారు. అలాంటి ఈయన ఏకంగా గ్లోబల్ మార్కెట్ టార్గెట్ గా ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో AA 22 x A6 అని వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, ప్రముఖ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న లాంటి హీరోయిన్స్ కూడా భాగమవుతున్నట్లు సమాచారం.. మరోవైపు హాలీవుడ్ స్థాయి వీఎఫ్ఎక్స్ తో తెరకెక్కబోతోంది ఈ సినిమా.
ఇకపోతే ఈ భారీ బడ్జెట్ చిత్రం తర్వాత అల్లు అర్జున్ తదుపరి ఏ డైరెక్టర్ కి అవకాశం ఇవ్వనున్నారు అనే వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక త్రివిక్రమ్ (Trivikram ) తో ఆయన జతకట్టనున్నారు అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు రాగా.. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న చిత్రానికి సంబంధించిన టైటిల్ ని మేకర్స్ రివీల్ చేయడమే కాకుండా ఈ సినిమా నుండి అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా పంచుకున్నారు. తాజాగా అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూవీకి ‘గాడ్ ఆఫ్ వార్’ అని టైటిల్ ని ఫిక్స్ చేస్తూ రివీల్ చేశారు. అలాగే ఇందులో కుమారస్వామి ఆయుధంతో పాటు నెమలిని, అలాగే నుదుటిన విభూదితో అల్లు అర్జున్ లుక్ ను రివీల్ చేశారు. ఆధ్యాత్మిక నేపథ్యంలో ఈ సినిమా రాబోతున్నట్లు స్పష్టం చేశారు.
‘గాడ్ ఆఫ్ వార్’ లో అల్లు అర్జున్ ఫస్ట్ లుక్
ఈ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. భారతీయ పురాణాలలో పాతుకుపోయిన ఒక శక్తివంతమైన కథను.. ఊహించలేని స్థాయిలో తీర్చిదిద్దబోతున్నారు. ఇది కేవలం సినిమా కాదు.. దేశవ్యాప్తంగా బహుళ భాషలలో విడుదలై ఒక పాన్ ఇండియా సినిమాటిక్ ఈవెంట్. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడనుంది..ఇది చరిత్రను తిరగరాయనుంది అంటూ తెలిపారు. ఇక ప్రస్తుతం ఈ విషయం అంచనాలను భారీగా పెంచేస్తోంది.
పౌరాణిక కథాంశంతో పాన్ ఇండియా మూవీ
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బోయపాటి శ్రీను, గాడ్ ఆఫ్ మార్సిస్ బాలకృష్ణ కాంబినేషన్ ఏవిధంగా సక్సెస్ కాంబో గా నిలిచిందో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబో కూడా అదే విధంగా పేరు దక్కించుకుంది. తొలిసారి 2012లో వీరిద్దరి కాంబినేషన్లో జులాయి సినిమా వచ్చి మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత 2015లో సన్నాఫ్ సత్యమూర్తి సినిమా వచ్చి మరో విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత 2020లో అల వైకుంటపురంలో అనే సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అలా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ మూడు సినిమాలు ఏకంగా హ్యాట్రిక్ అందుకున్నాయి. మరి ఈ కాంబోలో రాబోతున్న నాలుగవ చిత్రం గాడ్ ఆఫ్ వార్. మరి ఈ సినిమా ఇంకెలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కలయికలో ‘గాడ్ ఆఫ్ వార్’ పౌరాణిక నేపథ్యం, పాన్ ఇండియా రిలీజ్ తో చరిత్ర తిరగరాయనుంది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌తో అంచనాలు తారాస్థాయికి చేరాయి. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.


