|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: అల్లు అర్జున్ గురించి ఈ 5 నిజాలు ఎవ్వరికీ తెలీదు! సీక్రెట్స్ లీక్!

Published: 08-04-2026, 2:35 AM
షాకింగ్: అల్లు అర్జున్ గురించి ఈ 5 నిజాలు ఎవ్వరికీ తెలీదు! సీక్రెట్స్ లీక్!
  • చిన్నపుడు చదువులో వెనుకబడితే.. తల్లి నిర్మల ప్రత్యేక శ్రద్ధతో బన్నీని తీర్చిదిద్దారు!
  • హీరో అవ్వాలని లేదు! మల్టీమీడియా కంపెనీ పెట్టాలనుకున్న అల్లు అర్జున్!
  • అల్లు అరవింద్ కి ముగ్గురు కాదు.. నలుగురు కొడుకులు! పెద్ద కొడుకు పేరు రాజేష్!
  • బన్నీ కెరీర్ ఆరంభంలో ఆడిషన్స్‌లో రిజెక్ట్ అయ్యాడు.. ఇది నిజంగా షాకింగ్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి కొన్ని సంచలన విషయాలు మీకోసం! బన్నీ గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలు ఇప్పుడు బయటపడ్డాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఇది ఒక పండగలాంటి వార్త!

చదువుల్లో బన్నీ వీక్.. తల్లి పోరాటం!

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ జర్నీని చాలా మంది చూసే ఉంటారు. చాలా మందికి తెలుసు. బాలనటుడిగా ప్రారంభమై, `గంగోత్రి` చిత్రంతో హీరోగా పరిచయమై, `ఆర్య`తో బ్రేక్‌ అందుకొని దూసుకుపోతున్నాడు. `దేశముదురు`, `వేదం`, `బన్నీ`, `రేసుగుర్రం`, `జులాయి`, `సన్నాఫ్‌ సత్యమూర్తి`, `అల వైకుంఠపురములో`, `పుష్ప`, `పుష్ప 2` చిత్రాలతో స్టార్‌గా, సూపర్‌ స్టార్‌గా, ఐకాన్ స్టార్‌గా ఎదిగారు. అయితే బన్నీకి సంబంధించిన మనకు తెలియని చాలా విషయాలున్నాయి. చాలా రహస్యాలున్నాయి. ఆయనకు సంబంధించి ఐదు ఎవరికీ తెలియని సీక్రెట్స్ చూద్దాం.

ఐకాన్‌ స్టార్‌గా, ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ గా రాణిస్తున్న అల్లు అర్జున్‌ ఒకప్పుడు చదువుల్లో మొద్దు.  చాలా వీక్‌గా ఉండేవాడట. అటు అన్నయ్య అల్లు బాబీ, తమ్ముడు శిరీష్‌ చదువుల్లో ఫాస్ట్. కానీ అల్లు అర్జున్‌కి చదువు పెద్దగా వచ్చేది కాదట. అంతేకాదు ఆయన సైలెంట్‌గా ఉండేవారట. యాక్టివ్‌గా ఉండేవారు కాదట. దీంతో వాళ్ల అమ్మ నిర్మల స్వయంగా కేర్‌ తీసుకుని ఆయన్ని ట్రైన్‌ చేసింది. తనే టీచర్‌గా మారి చదివించిందట. ట్యూషన్‌ చెప్పిందట. అలాగే యాక్టివ్‌గా ఉండేలా మోటివేట్‌ చేసిందట. ఆయన పరీక్షల్లో పాస్‌ కావడం కోసం తను చాలా విషయాలను త్యాగం చేసిందట. అలా చేయడం వల్లే బన్నీ ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉన్నాడని చెప్పొచ్చు. ఈ విషయాలను బన్నీనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

సినిమాల్లోకి రావడం ఇష్టం లేదా?

బన్నీకి సంబంధించిన మరో ఆసక్తికర విషయం. ముందుగా ఆయన సినిమాల్లోకి రావాలనుకోలేదు. వాళ్లమ్మకి అల్లు అర్జున్‌ని సినిమాల్లోకి తీసుకురావాలని అనుకోలేదట. మల్టీమీడియా నేర్పించి, యానిమేషన్‌ వంటి కోర్స్ లు నేర్పించి ఆ దిశగా పంపించాలనుకున్నారట. మల్టీమీడియా వంటి కంపెనీ పెట్టించాలనుకున్నారట. కానీ బన్నీకి లోపల ఎక్కడో యాక్టివ్‌ సైడ్‌ కొడుతుంది. కొన్ని ఆడిషన్స్ కి వెళ్లాడట. రిజెక్ట్ అయ్యాడట. దీంతో పూర్తిస్థాయిలో ఆ దిశగా ఫోకస్‌ చేశాడట. ఈ విషయాన్ని అమ్మకి చెబితే, ఆమె ఓకే చెప్పింది. అలా సడెన్‌గా సినిమాల్లోకి వచ్చాడు. `గంగోత్రి` చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు అల్లు అర్జున్‌. ఆ తర్వాత ఆయన జర్నీ గురించి మనకు తెలిసిందే.

అల్లు అర్జున్‌కి సంబంధించి మరో షాకింగ్‌ విషయం ఏంటంటే.. అల్లు అరవింద్‌కి ముగ్గురు కొడుకులు అని తెలిసిందే. అల్లు బాబీ, అల్లు అర్జున్‌, అల్లు శిరీష్‌. కానీ మరో కొడుకు ఉన్నాడు. అల్లు అర్జున్‌ కి ముందు మరో అబ్బాయి జన్మించాడు. పేరు అల్లు రాజేష్‌. బాబీ తర్వాత రాజేష్‌ జన్మించాడు. అయితే చిన్నప్పుడే రాజేష్‌ ప్రమాదంలో మరణించాడట. ఈ విషయాన్ని అల్లు శిరీష్‌ బయటపెట్టాడు. ఆయన ఆ మధ్య `ఊర్వశివో రాక్షసివో` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పాడు. `మా నాన్నకు మేం నలుగురం. పెద్దన్నయ్య అల్లు వెంకటేష్‌ తర్వాత రాజేష్‌ జన్మించాడు. వీళ్లిద్దరి తర్వాత అర్జున్‌ పుట్టాడు. ఐదారేళ్ల వయసులోనే రాజేష్‌ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. నేను పుట్టడానికంటే ముందే ఇది జరిగింది` అని తెలిపి షాకిచ్చాడు శిరీష్‌.

అల్లు అర్జున్‌కి ఇంకో సోదరుడు ఉన్నారా?

అల్లు అర్జున్‌ 2011 మార్చి 6న స్నేహారెడ్డిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అల్లు అయాన్‌, అల్లు అర్హా. అయితే బన్నీది లవ్‌ మ్యారేజ్‌ అని అంతా అనుకుంటారు. వీరిద్దరు పెళ్లికి ముందు ప్రేమించుకున్నారనే ప్రచారం ఉంది. కానీ ప్రేమ పెళ్లి కాదు. చాలా రోజులుగా స్నేహారెడ్డి తెలుసు. కలిసి మాట్లాడుకున్నారు, ఫ్రెండ్స్ ద్వారా రెగ్యూలర్‌గా కలుస్తున్నారు. ఈ విషయం తెలిసి ఇంట్లో పెద్ద వాళ్లు పెళ్లి సెట్‌ చేశారట. అంతేకాదు అది ప్రేమ వరకు వెళ్లలేదని, ప్రేమ అనే ఆలోచన కూడా లేదని,  తమది ప్రేమ పెళ్లి కాదని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

స్టార్‌ హీరోగా రాణిస్తున్న అల్లు అర్జున్‌.. సినిమాల్లోకి రాకముందు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడట. `పెళ్లాం ఊరెళితే` చిత్రానికి ఆయన అసిస్టెంట్‌ డైరెక్టర్‌గానూ పనిచేశారట. దీనికి ఎస్వీకృష్ణారెడ్డి దర్శకుడు. ఈ మూవీకి అల్లు అరవింద్‌ నిర్మాత కావడం విశేషం. ఆ సమయంలో అల్లు అర్జున్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. దీంతో సినిమా షూటింగ్‌ లపై అవగాహన కోసం తండ్రి నిర్మించిన `పెళ్లాం ఊరెళితే` చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడట బన్నీ. ఈ విషయాన్ని దర్శకుడు ఎస్వీకృష్ణా రెడ్డి వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీలో తనకు ఎవరు అన్నా భయం లేదు అని, కానీ మీరంటే భయమని అల్లు అర్జున్‌ తనతో చెబుతుంటాడని తెలిపారు దర్శకుడు.

అల్లు అర్జున్ గురించిన ఈ షాకింగ్ విషయాలు వింటే ఆశ్చర్యపోతారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. ఐకాన్ స్టార్ ఫ్యూచర్ అప్డేట్స్ కోసం వేచి చూడండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.