|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Allu Arjun: మలయాళ ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్‌ విషెస్.. ట్వీట్ వైరల్!

Published: 05-09-2025, 10:01 AM
Allu Arjun: మలయాళ ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్‌ విషెస్.. ట్వీట్ వైరల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేరళలోని ఓనం పండుగ సందర్భంగా మలయాళీలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన హృదయపూర్వక శుభాకాంక్షల ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Key Points

1

అల్లు అర్జున్ మలయాళ ఫ్యాన్స్‌కు ఓనం శుభాకాంక్షలు తెలిపారు.

2

ఆయన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

4

అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.

అల్లు అర్జున్‌ ఓనం శుభాకాంక్షలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‌ కు క్రేజ్ ‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు . పుష్ప తర్వాత పాన్ ఇండియా నుంతి పాన్ వరల్డ్ ‌ రేంజ్ ‌ కు ఎదిగిపోయారు . పుష్ప -2 మూవీతో బాక్సాఫీస్ రికార్డ్స్ ‌ ను షేక్ చేశారు . దేశంలోని అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది . అల్లు ‍ అర్జున్ ‌ కు తెలుగులో మాత్రమే కాదు .. కేరళలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది . ఐకాన్ స్టార్ సినిమా వచ్చిందంటే చాలు మలయాళీలు థియేటర్లకు క్యూ కడతారు . అంతలా మాలీవుడ్ ‌ లోనూ క్రేజ్ ఉన్న టాలీవుడ్ ‌ హీరో మన ఐకాన్ స్టారే .

మలయాళంలో అల్లు అర్జున్ క్రేజ్

ఇవాళ కేరళలో ప్రతిష్టాత్మక ఓనం పండుగ కావడంతో అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు . మలయాళీలందరికీ హృదయపూర్వక ఓనం పండుగ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు . ఈ పండుగ మీ శ్రేయస్సు , శాంతితో కొత్త ప్రారంభానికి నాంది పలకాలని ఆకాంక్షించారు . ఇట్లు మీ దత్తపుత్రుడు అంటూ అల్లు అర్జున్ పోస్ట్ చేశారు . ఇది చూసిన మలయాళ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు .

వైరల్ అవుతున్న ట్వీట్

ఇక సినిమాల విషయానికొస్తే అల్లు అర్జున్ ‌ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ ‌ అట్లీతో జతకట్టారు . వీరిద్దరి కాంబోలో వస్తోన్న మొదటి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి .

అల్లు అర్జున్ ట్వీట్ మలయాళ ఫ్యాన్స్‌ను ఆనందపరిచింది. పుష్ప సినిమా తర్వాత ఆయనకు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ను ఇది మరోసారి నిరూపిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.