
📌 Key Points
- అల్లు అర్జున్ నెక్స్ట్ నాలుగు ప్రాజెక్ట్స్ ఫిక్స్ అయ్యాయి.
- నిర్మాత, బన్నీ స్నేహితుడు బన్నీ వాసు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
- అట్లీ, సందీప్ రెడ్డి వంగా సినిమాలతో పాటు త్రివిక్రమ్, లోకేష్ కనగరాజ్ పేర్లు వినిపిస్తున్నాయి.
- ఈ సినిమాల గురించి అధికారిక ప్రకటనలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.
పుష్ప 2 బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల నిర్మాత, బన్నీ సన్నిహితుడు బన్నీ వాసు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అల్లు అర్జున్ తర్వాతి నాలుగు సినిమాలు ఖరారయ్యాయని, దీనిపై పూర్తి క్లారిటీ ఉందని ఆయన స్పష్టం చేశారు.
బన్నీ వాసు వెల్లడించిన షాకింగ్ వివరాలు
అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలపై కూడా అంచనాలు నెలకొన్నాయి. (Allu Arjun)
Allu Arjun : పుష్ప సినిమాలతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. ఇప్పుడు ఇండియా అంతా బన్నీ కి మంచి ఫేమ్ ఉంది. పుష్ప 2 కూడా భారీ హిట్ అవ్వడంతో నెక్స్ట్ సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బన్నితో సినిమాలు తీయడానికి పాన్ ఇండియా డైరెక్టర్స్ ఆసక్తి చూపిస్తున్నారు.(Allu Arjun)
ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీతో సినిమా చేస్తున్నాడు. 800 కోట్లతో భారీగా సైఫై కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. అలాగే అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలపై కూడా అంచనాలు నెలకొన్నాయి.
అల్లు అర్జున్ నెక్స్ట్ డైరెక్టర్స్ జాబితా ఇదే
తాజాగా నిర్మాత, అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్ బన్నీ వాసు అల్లు అర్జున్ సినిమాల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. అల్లు అర్జున్ వి నాలుగు ప్రాజెక్ట్స్ ఫిక్స్ అయ్యాయి. నెక్స్ట్ నాలుగు సినిమాలు ఏంటి అనేది ఆయనకు క్లారిటీ ఉంది. త్రివిక్రమ్ – బన్నీ సినిమా చాలా అంశాల మీద ఆధారపడి ఉంది. దానిపై త్వరలో క్లారిటీ వస్తుంది. లోకేష్ కనగరాజ్ సినిమా గురించి నిర్మాతలే చెప్తారు అని తెలిపారు.
త్రివిక్రమ్, లోకేష్ సినిమాలపై ఆసక్తికర చర్చ
అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ సినిమా చేస్తుండగా, సందీప్ రెడ్డి వంగ సినిమా అధికారికంగానే ప్రకటించారు. ఈ రెండు సినిమాలు కాకుండా త్రివిక్రమ్ తో సినిమా కూడా అనౌన్స్ చేసారు కానీ ఎప్పుడు ఉంటుందో క్లారిటీ లేదు. ఇక లోకేష్ కనగరాజ్ పేరు మాత్రం కొత్తగా వినిపిస్తుంది. దీంతో అల్లు అర్జున్ నెక్స్ట్ నాలుగు సినిమాలు అట్లీ, త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ, లోకేష్ కనగరాజ్ లతో ఉంటుందని టాక్ నడుస్తుంది.
మొత్తంగా, అల్లు అర్జున్ తదుపరి ప్రాజెక్టులపై నెలకొన్న ఉత్కంఠకు బన్నీ వాసు ప్రకటనతో కొంత స్పష్టత వచ్చింది. అభిమానులు ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రాల సమాచారం త్వరలో మరింత అధికారికంగా వెల్లడికానుంది.


