
📌 Key Points
- రాజు వెడ్స్ రాంబాయి డైరెక్టర్ సాయిలు కంపాటి మరో సంచలనానికి సిద్ధం!
- ఆసియన్ మూవీస్ నిర్మాణంలో సాయిలు దర్శకత్వంలో భారీ చిత్రం!
- యంగ్ హీరోతో సాయిలు కంపాటి రా అండ్ రస్టిక్ ఎమోషనల్ మూవీ!
- 2026 ఎండింగ్ లో విడుదల కానున్న సాయిలు కంపాటి చిత్రం!
టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ డైరెక్టర్ సాయిలు కంపాటి మరో బ్లాక్ బస్టర్ హిట్ కోసం సిద్ధమవుతున్నారు. ఈసారి స్టార్ ప్రొడక్షన్ హౌస్ ఆసియన్ మూవీస్ తో కలిసి భారీ ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
సాయిలు కంపాటి నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసింది!
Saailu Kampati: రాజు వెడ్స్ రాంబాయి.. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. లవ్ అండ్ ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. ఇక సినిమాలో క్లైమాక్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే, ఈ సినిమా విషయంలో క్రెడిట్ అంతా దర్శకుడు సాయిలు కంపాటికె వెళుతుంది. వస్తావ సంఘటనల ఆధారంగా రాసుకున్న ఆ కథను అంతే వాస్తవికంగా తెరకెక్కించి శెభాష్ అనిపించుకున్నాడు ఈ దర్శకుడు.
ఇక అప్పటినుంచి సాయిలు (Saailu Kampati)తన రెండో సినిమా ఎప్పుడు చేస్తాడు? ఎలాంటి సినిమా చేస్తాడు అంటూ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. కానీ, రాజు వెడ్స్ రాంబాయి సినిమా విడుదలై మూడు నెలలు గడుస్తున్నా సాయిలు నెక్స్ట్ సినిమాపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపధ్యంలోనే దర్శకుడు సాయిలు నెక్స్ట్ సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆసియన్ మూవీస్ తో సాయిలు భారీ ప్రాజెక్ట్!
అదేంటంటే, టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఆసియన్ మూవీస్ దర్శకుడు సాయిలు కోసం ఒక బంపర్ ఆఫర్ ఇచ్చిందట. యంగ్ హీరోతో ఓ మంచి ఫీల్ గుడ్ సినిమా చేయాలనీ ప్రపోజల్ పెట్టిందట. అందుకోసం అడ్వాన్స్ కూడా గట్టిగానే ముట్టజెప్పారట. ఇంతకాలం ఆ కథను సిద్ధం చేయడానికి టైం తీసుకున్నాడట సాయిలు. ఇటీవలే ఫైనల్ న్యారేషన్ కూడా కంప్లీట్ అవడంతో మేకర్స్ ఆనందం వ్యక్తం చేశారట.
యంగ్ హీరోతో సాయిలు కంపాటి సెన్సేషనల్ మూవీ!
రాజు వెడ్స్ రాంబాయి లాగానే ఈ సినిమా కూడా రా అండ్ రస్టిక్ గా ఎమోషనల్ కంటెంట్ తో రానుందట. ప్రస్తుతం ఆ కథకు సరిపడే యంగ్ హీరో కోసం వేట మొదలుపెట్టాడట సాయిలు. హీరో ఫైనల్ అవగానే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన చేయాలనీ చూస్తున్నారట. అయితే, ఈసారి లిమిటెడ్ బడ్జెట్ లో కాకుండా భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా చేయనున్నాడట దర్శకుడు సాయిలు. 2026 ఎండింగ్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరి తన రెండో సినిమాతో దర్శకుడు సాయిలు ఆడియన్స్ ను ఏమేరకు మెప్పిస్తాడు అనేది చూడాలి.
సాయిలు కంపాటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తాం.


