
📌 Key Points
- శివకుమార్, ప్రియాంక జైన్ డెస్టినీ వెడ్డింగ్ ప్లాన్ సంచలనం.
- ఉత్తరాఖండ్‌లోని యోగి నారాయణ్ టెంపుల్‌లో పెళ్లి ఆలోచన.
- శివపార్వతులు పెళ్లి చేసుకున్న చోటే తామూ అని శివకుమార్.
- కుటుంబ బాధ్యతలు పూర్తయ్యాకే పెళ్లి, భారీ ఇంటి నిర్మాణం.
టాలీవుడ్ టీవీ నటులు శివకుమార్, ప్రియాంక జైన్ పెళ్లిపై సంచలన వార్త బయటపడింది! ఎవరూ ఊహించని డెస్టినీ వెడ్డింగ్ ప్లాన్‌ను శివకుమార్ రివీల్ చేశారు. వారి ప్రేమ, బంధం ఎంత బలమైనదో ఈ నిర్ణయం చాటి చెబుతోంది. ఈ ప్రత్యేకమైన పెళ్లి ప్రణాళిక వివరాలు మీకోసం!
శివకుమార్-ప్రియాంక: అరుదైన డెస్టినీ వెడ్డింగ్ ప్లాన్!
టీవీ సీరియల్ నటులు శివకుమార్, ప్రియాంక జైన్ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రస్తుతం వీరిద్దరు కలిసే ఉంటున్నారు. ఇటీవల వీరు స్టార్ మా నిర్వహించిన `మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్` షోలోనూ పాల్గొన్నారు. పది జంటల్లో ఒకరిగా పాల్గొని సందడి చేశారు. తమ ప్రేమ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో చాటి చెప్పారు. ఈ షో తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ మరింత బలపడిందని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా శివకుమార్.. తన మ్యారేజ్ గురించి వెల్లడించారు. త్వరలోనే మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు తెలిపారు. అయితే పెళ్లికి సంబంధించిన ఆసక్తకిర విషయాన్ని వెల్లడించారు. ప్రియాంక అంటే ఎందుకు అంత ఇష్టమో తెలిపారు. ఆమెని అమ్మతో పోల్చుకోవడం విశేషం. తమ డెస్టినేషన్ మ్యారేజ్ గురించి ఓపెన్ అయ్యాడు శివ కుమార్. పెళ్లికి అందరు చాలా ఖర్చు చేస్తుంటారు. ఆడంబరాలకుపోయి డబ్బులు వృధా చేస్తుంటారు, కానీ తాము అలా చేయడం లేదని, ఎలా చేసుకోవాలనుకునే విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు శివకుమార్.
ఉత్తరాఖండ్‌లో శివ-పార్వతుల అగ్ని సాక్షిగా పెళ్లి!
ఉత్తరాఖండ్‌లో యోగి నారాయణ్ అనే ఒక టెంపుల్ ఉంది. అందులోనే శివపార్వతీలు పెళ్లి చేసుకున్నారని అంటుంటారు. ఆ అగ్ని అప్పట్నుంచి ఇప్పటి వరకు అలానే వెలుగుతుంది. నేను శివ్, ఆమె నా పార్వతి కాబట్టి మేము కూడా అక్కడే పెళ్లి చేసుకుందాం అనుకున్నామని తెలిపారు శివకుమార్. ఫ్యామిలీతో వెళ్లి అక్కడ మ్యారేజ్ చేసుకొని, ఆ తర్వాత ఇక్కడ గ్రాండ్‌గా రిసెప్షన్ చేసుకోవాలనుకున్నామని చెప్పారు. అయితే ప్రియాంక ఇంట్లో తనకు బాధ్యతలు ఉన్నాయి, మా ఇంట్లో నాకు బాధ్యతలు ఉన్నాయి. ప్రియాంకకి తమ్ముడు ఉన్నాడు, అతనికి పెళ్లి చేయాలి, నాకూ చెల్లి ఉంది. ఆమెకి మ్యారేజ్ చేయాలి. ఇవన్నీ పూర్తయిన తర్వాత తాము పెళ్లి చేసుకుంటామని చెప్పారు.
అయితే పెళ్లి తర్వాత ఇద్దరి సంపాదన గురించి చెబుతూ, ప్రియాంక, తాను కలిసి ఒక పెద్ద ఇంటిని నిర్మిస్తున్నామని, అందులోనే ప్రియాంక పేరెంట్స్ కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నామన్నాడు. తన అమ్మ టీచర్ అని, ఆమెకి ఇంకా సర్వీస్ ఉందని, ఆ తర్వాత తను కూడా మా ఇంట్లోనే ఉండేలా ప్లాన్ చేశామని వెల్లడించారు. అది ఎంత వరకు సాధ్యమవుతుందో చూడాలన్నారు. ఫ్యామిలీ అన్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి, వాటిని తట్టుకొని, అర్థం చేసుకొని ముందుకు వెళ్లాలి అని తెలిపారు.
బాధ్యతలు తీరాకే పెళ్లి.. భారీ ఇంటి ప్రణాళికలు!
ప్రియాంకలో తనకు నచ్చిన క్వాలిటీ గురించి చెబుతూ, నేను ఎలా ఉంటే అలా ఇష్టపడుతుంది. చిన్నపిల్లాడిలా చూసుకుంటుంది. ఆమె తనకు చాలా స్పెషల్ అని, అదే సమయంలో ఆమెనే సర్వస్వం అని చెప్పాడు శివ కుమార్. తను అమ్మలా చూసుకుంటుంది. మా అమ్మ తర్వాత నా జీవితంలో ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది ప్రియాంకనే, ఆమె డిట్టో మా అమ్మనే అని తెలిపారు శివకుమార్.
శివకుమార్, ప్రియాంకల ఈ అద్భుతమైన డెస్టినీ వెడ్డింగ్ ప్రణాళిక టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది. వారి ప్రేమ ప్రయాణం, పెళ్లి వేడుక కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని సంచలన అప్‌డేట్‌ల కోసం చూస్తూనే ఉండండి!

