
‘మిత్ర మండలి’ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పాల్గొని చిత్ర బృందాన్ని అభినందించారు. ఆయన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దర్శకుడి అనుభవం, సినిమాలోని నటీనటుల గురించి ఆయన మాట్లాడారు.
Key Points
నిర్మాత అల్లు అరవింద్ 'మిత్ర మండలి' టీజర్ లాంచ్ లో ఆసక్తికర విషయాలు చెప్పారు.
దర్శకుడు కథ చెప్పకుండా వెళ్ళిపోయాడని అల్లు అరవింద్ వెల్లడించారు.
అల్లు అరవింద్ నిహారిక కు ఇన్స్టాగ్రామ్ లో ఫేక్ ఐడీతో ఫాలో అవుతున్నట్లు తెలిపారు.
ప్రియదర్శి నటనను అల్లు అరవింద్ ప్రశంసించారు.
‘మిత్ర మండలి’ టీజర్ లాంచ్ వేడుక
టాలీవుడ్ నిర్మాత బన్నీ వాస్ నూతన నిర్మాణ సంస్థ బి.వి. వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మిత్ర మండలి’. అభిరుచి గల నిర్మాతలు కల్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మిత్ర మండలి సినిమాలో ప్రియదర్శి , రాగ్ మయూర్ , విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషించారు. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహించారు. తాజాగా ‘మిత్ర మండలి’ టీజర్‌ను నిర్మాతలు విడుదల చేశారు.
మిత్ర మండలి టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం నిన్న గురువారం (జూన్ 12) ఉదయం హైదరాబాద్‌లోని ఏఏఏ సినిమాస్‌లో జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మిత్ర మండలి టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.
అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు
మిత్ర మండలి టీజర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “బన్నీ వాసు సమర్పిస్తున్న మొదటి సినిమాగా, నా మిత్రులందరూ కలిసి తీసిన ఈ ‘మిత్ర మండలి’ టీజర్‌ను లాంచ్ చేయడం నా బాధ్యతగా భావిస్తున్నాను” అని అన్నారు.
“నేను యంగ్ స్టర్స్‌తో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తుంటాడు. దాని వల్ల స్క్రిప్ట్ ఎంపిక వంటి విషయాల్లో ఎంతో హెల్ప్ జరుగుతుంటుంది. ఒకసారి వాసు ఈ కథ వినమని దర్శకుడిని నా దగ్గరకు పంపించాడు. కానీ, మీ ముందు కథ చెప్పలేకపోతున్నాను అని దర్శకుడు వెళ్లిపోయాడు” అని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు.
సినిమా విశేషాలు
“నేను కథ వినకుండానే, నేరుగా ఈ సినిమా చూడబోతున్నాం. వీరందరి మాటలు వింటుంటే.. దర్శకుడిలో ఎంతో ప్రతిభ ఉందని అర్థమవుతోంది. ప్రియదర్శి మాకు ఒక వెబ్ సిరీస్ చేశాడు. అప్పుడే అనిపించింది.. ఇతను మంచి స్థాయికి వెళ్తాడని. యాక్టర్‌గా ఎంత చేయాలో, ఎంత చేయకూడదో తెలిసిన మనిషి. కోర్ట్ సినిమాలో అద్భుతంగా నటించాడు” అని నిర్మాత అల్లు అరవింద్ పేర్కొన్నారు.
“సోషల్ మీడియాలో నిహారిక కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మాయిని ఇన్‌స్టాలో ఫాలో అవుతున్నా. ఫేక్ ఐడెంటిటీతో. నువ్ చాలా స్పీడ్ ఇన్‌స్టాలో. ఒరిజినల్ ఐడీతో ఫాలో అవుతో పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడుతారు. అదంతా ఎందుకనీ. తనకి ఆల్ ది బెస్ట్. నిర్మాతలతో నాకు మంచి అనుబంధం ఉంది. మిత్ర మండలి టీజర్ చాలా బాగుంది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటూ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్” అని ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.
మొత్తంగా, ‘మిత్ర మండలి’ టీజర్ లాంచ్ అల్లు అరవింద్ వ్యాఖ్యలతో ఆసక్తికరంగా సాగింది. సినిమా విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.


