
నాగ చైతన్య తదుపరి సినిమా విషయంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బోయపాటి శ్రీను, శివ నిర్వాణలు ఆయనకు కథలు వినిపించగా, బోయపాటి కథకు ప్రాథమిక అంగీకారం తెలిపారని సమాచారం.
Key Points
నాగ చైతన్య – బోయపాటి శ్రీను కాంబినేషన్ సినిమాకు అవకాశం.
శివ నిర్వాణ కథ కూడా విన్న నాగ చైతన్య.
‘వృషకర్మ’ తర్వాత 25వ సినిమాకు దర్శకుడి ఎంపిక ఆసక్తికరంగా ఉంది.
బోయపాటి కథా విషయంలో నాగచైతన్య ప్రాథమిక అంగీకారం.
నాగ చైతన్యకు రెండు కథలు?
హీరో నాగచైతన్య, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ సినిమా రానుందా? అంటే ప్రస్తుతానికి అవుననే సమాధానమే ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇటీవల దర్శకుడు బోయపాటి శ్రీను ఓ మాస్ కథను నాగచైతన్యకు వినిపించగా, ఈ హీరో ప్రాథమికంగా అంగీకారం తెలిపారని, అన్నీ కుదిరితే ఈ ఏడాదే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందనే ప్రచారం జరుగుతోంది.
బోయపాటి శ్రీను – నాగ చైతన్య సినిమా?
అలాగే తనకు ‘మజిలీ’ వంటి సూపర్‌హిట్ ఫిల్మ్ ఇచ్చిన శివ నిర్వాణ చెప్పిన కథ కూడా విన్నారు నాగచైతన్య. మరి… ఈ ఇద్దరి దర్శకుల్లో ఎవరితో నాగచైతన్య సినిమా ముందుగా సెట్స్‌కు వెళ్తుంది? లేకపోతే ఈ ఇద్దరు దర్శకులతో నాగచైతన్య సమాంతరంగా రెండు సినిమాలూ చేస్తారా? అనే అంశాలపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
నాగ చైతన్య 25వ సినిమా ఎవరితో?
ఇదిలా ఉంటే… ప్రస్తుతం ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండుతో ‘వృషకర్మ’ (వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్నారు నాగచైతన్య. ఇది నాగచైతన్య కెరీర్‌లోని 24వ చిత్రం. దీంతో నాగచైతన్య కెరీర్‌లోని 25వ సినిమాకు ఏ దర్శకుడు ఖరారు అవుతారో అనే ఆసక్తి అక్కినేని ఫ్యాన్స్‌లో నెలకొంది.
నాగ చైతన్య తదుపరి చిత్రం ఎవరి దర్శకత్వంలో వస్తుందనేది ఇంకా తెలియాల్సి ఉంది. బోయపాటి శ్రీను, శివ నిర్వాణలలో ఎవరితో సినిమా చేస్తారో, లేదా ఇద్దరితోనూ సమాంతరంగా చేస్తారో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాలి.


