|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అల్లు అరవింద్‌ కుటుంబంలో విషాదం

Published: 29-08-2025, 11:15 PM
అల్లు అరవింద్‌ కుటుంబంలో విషాదం

ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌ గారి తల్లి, దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి భార్య అల్లు కనకరత్నమ్మ గారు (94) వృద్ధాప్యం కారణంగా కన్నుమూశారు. ఈ విషాద వార్తతో అల్లు కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

Key Points

1

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ అమ్మగారు అల్లు కనకరత్నమ్మ కన్నుమూశారు.

2

వృద్ధాప్యం కారణంగా ఆమె అర్ధరాత్రి కన్నుమూశారు.

4

కోకాపేటలో మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన అమ్మగారు, దివంగత హాస్యనటులు అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ (94) కన్నుమూశారు. వృధాప్యకారణంగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆమె కన్నుమూశారు. మధ్యాహ్నం తర్వాత కోకాపేటలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. విషయం తెలుసుకున్న అల్లు అర్జున్‌ ముంబై నుంచి హైదరాబాద్‌ ప్రయాణం అయ్యారు. రామ్‌ చరణ్‌ పెద్ది సినిమా షూటింగ్‌ పనుల్లో మైసూర్‌లో ఉన్నారు.  వారిద్దరూ మధ్యాహ్నంలోపు హైదరాబాద్‌ చేరుకుంటారు. ఇప్పటికే  చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ మాత్రం అల్లు అరవింద్‌ ఇంటికి చేరుకున్నారు. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా అరవింద్‌ ఇంటికి వెళ్తున్నారు.

కుటుంబ సభ్యుల విషాదం

అంత్యక్రియల వివరాలు

అల్లు కనకరత్నమ్మ మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.