|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: బన్నీ కోసం అల్లు నిర్మల త్యాగం! ఆ ఒక్క కోరిక చంపుకున్నారుగా!!

Published: 27-03-2026, 11:05 PM
షాకింగ్: బన్నీ కోసం అల్లు నిర్మల త్యాగం! ఆ ఒక్క కోరిక చంపుకున్నారుగా!!
  • చిన్నప్పుడు చదువులో వీక్ గా ఉండటంతో అల్లు అర్జున్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న అల్లు నిర్మల.
  • స్విట్జర్లాండ్ వెళ్లాలనే కోరిక ఉన్నా, బన్నీ పరీక్షల కోసం ఆ అవకాశాన్ని త్యాగం చేసిన తల్లి.
  • యానిమేషన్ కోర్సు కోసం కెనడా వెళ్లాలనుకున్న బన్నీ, ఆ తరువాత సినిమాలపై ఆసక్తి పెంచుకున్నాడు.
  • సినిమాల్లోకి రావాలనే బన్నీ నిర్ణయాన్ని మొదట వ్యతిరేకించినా, తరువాత మద్దతు ఇచ్చిన అల్లు నిర్మల.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెనుక ఆయన తల్లి అల్లు నిర్మల చేసిన త్యాగం గురించి తెలుసా? ఆమె తన కొడుకు కోసం ఏం చేసిందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

అల్లు అర్జున్ ఎదుగుదలలో అమ్మ పాత్ర!

అల్లు అర్జున్‌ జీవితాన్ని మార్చడంలో వాళ్ల అమ్మ అల్లు నిర్మల పాత్ర ఎంతో ఉంది. ఇంకా చెప్పాలంటే వాళ్ల అమ్మ కేర్‌ తీసుకోకపోతే అల్లు అర్జున్‌ ఇంత యాక్టివ్‌గా ఉండేవాడు కాదేమో. ఇప్పుడు ఐకాన్‌ స్టార్‌గా, పాన్‌ ఇండియా హీరోగా రాణిస్తోన్న అల్లు అర్జున్‌ చిన్నప్పుడు చదువుల్లో చాలా వీక్‌ అట. అంతేకాదు చాలా నెమ్మదిగా ఉండేవాడట. ఇంత యాక్టివ్‌గా ఉండేవాడు కాదట. మిగిలిన ఇద్దరు కొడుకులు చదువుల్లో బాగున్నారు, యాక్టివ్‌గా ఉంటున్నారు, కానీ రెండో కొడుకు అల్లు అర్జున్‌ మాత్రం వీక్‌గా ఉన్నాడట.

ఇది అల్లు అర్జున్‌ అమ్మని బాధించేదట. దీంతో తనే స్వయంగా కేర్‌ తీసుకుందట. స్కూల్‌ అయిపోయాక ఆయన చదువుకు సంబంధించి తనే ప్రత్యేక శ్రద్ధ తీసుకుందట. ట్యూషన్‌ లాగా ప్రతిది నేర్పించిందట. ముందు తాను పాఠాలు చదివి, ఆ తర్వాత అల్లు అర్జున్‌ని చదివించేదట. అల్లు అర్జున్‌ ఫిజికల్‌గా కూడా చిన్నప్పుడు వీక్‌గా ఉండేవాడట. దీంతో ఎవరూ తనని కొట్టేవాళ్లు కాదట. కానీ అమ్మ మాత్రం చెప్పింది వినకపోతే, చదవకపోతే మాత్రం మొహమాటం లేకుండా కొట్టేదట. అలా ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాడు బన్నీ.

స్విట్జర్లాండ్ కలని త్యాగం చేసిన నిర్మల!

అల్లు అర్జున్‌ మదర్‌కి స్విట్జర్లాండ్‌ అంటే ఇష్టమట. ఎప్పుడైనా అక్కడికి వెళ్లాలని ఉండేదట. అయితే ఓ సారి నిర్మాత అల్లు అరవింద్‌ ఓ సినిమా కోసం స్విట్జర్లాండ్‌లో షూటింగ్‌ ప్లాన్‌ చేశారట. ఆ సమయంలో నిర్మలని తీసుకెళ్లాలని అనుకున్నారు. వెళ్తే అప్పుడే, వెళ్లాలి, లేదంటే కష్టం. కానీ అంత మంచి అవకాశాన్ని, తన ఇష్టాన్ని బన్నీ కోసం త్యాగం చేసింది. ఆమె స్విట్జర్లాండ్‌ని వెళ్లేందుకు నో చెప్పింది. కారణం అల్లు అర్జున్‌కి ఆ సమయంలో ఎగ్జామ్స్ ఉన్నాయి. తనని వదిలేసి వెళ్లలేకపోయిందట. అలా తన కోసం అమ్మ చాలా త్యాగాలు చేసిందని చెప్పారు అల్లు అర్జున్‌.

అయితే అల్లు అర్జున్‌ సినిమాల్లోకి రావడం వాళ్ల అమ్మకి ఇష్టం లేదట. అల్లు అర్జున్‌ యానిమేషన్‌ కోర్పులు చేశాడు. వాటిలో పూర్తి శిక్షణ కోసం కెనడాకి వెళ్లాలనుకున్నారు. అక్కడ కోర్స్ కోసం డబ్బు కూడా కట్టారు. కానీ అదే సమయంలో ఓ సినిమా కోసం ఆడిషన్‌ జరుగుతుందంటే, బన్నీ ట్రై చేశాడు. కానీ ఎంపిక కాలేదు. ఆ తర్వాత సినిమాలపై ఇంట్రెస్ట్ కలిగిందట. సినిమాల్లోకి వెళ్లాలని ఫిక్స్ అయ్యాడట. ఆ విషయాన్ని అమ్మతో చెప్పడంతో ఆమె నో చెప్పలేదట. కెనడాలో కోర్స్ కోసం డబ్బు కట్టినప్పటికీ తనకు ఇష్టంలేకపోయినా సినిమాల్లోకి వెళ్తానంటే ఎంకరేజ్‌ చేసిందట. అలా తాను మూవీస్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్టు తెలిపారు బన్నీ. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను పంచుకున్నారు.

సినిమాల్లోకి బన్నీ ఎంట్రీ వెనుక అసలు కథ!

ఇక `గంగోత్రి` సినిమాతో హీరోగా పరిచయం అయిన అల్లు అర్జున్‌, `ఆర్య`తో హిట్‌ అందుకున్నాడు. ఆ తర్వాత `బన్నీ`, `దేశముదురు`, `జులాయి`, `బద్రీనాథ్‌`, `సన్నాఫ్‌ సత్యమూర్తి`, `సరైనోడు`, `రేసుగుర్రం`, `అల వైకుంఠపురములో`, `పుష్ప, `పుష్ప 2` చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇప్పుడు ఐకాన్‌ స్టార్‌గా, పాన్‌ ఇండియా హీరోగా రాణిస్తున్నారు. ప్రస్తుతం అట్లీతో `ఏఏ22` చిత్రంలో నటిస్తున్నారు. ఇది సైన్స్ ఫిక్షన్‌ కథతో రూపొందుతుంది. అయితే బన్నీ నటించిన చిత్రాల్లో వాళ్ల అమ్మకి నచ్చిన మూవీ ఏంటంటే `పరుగు`. బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్‌ చేసిన ఈ చిత్రం ఆమెకి బాగా ఇష్టమట. చాలా సార్లు ఈ మూవీని చూసిందట. ఇందులో బన్నీ నటన, యాటిట్యూడ్‌, సెటిల్డ్ గా నటించే తీరు బాగా నచ్చిందట. అంతేకాదు చిన్నప్పుడు డల్‌గా ఉన్న బన్నీ పెద్దయ్యాక అల్లరోడుగా మారిపోయాడట. ఈ సినిమాలో అలాంటి సీన్లే ఉంటాయి. సినిమాలో వాళ్ల అమ్మ ఇతనికి కాళ్లు నిలవవు, ఒక్కచోట ఉండడని చెప్పి గొలుసుతోనూ కట్టేస్తుంది. బహుశా అవి బన్నీ అమ్మకి బాగా నచ్చి ఉంటాయేమో.

అల్లు అర్జున్ జీవితంలో ఆయన తల్లి పాత్ర ఎంతో గొప్పది. ఆమె చేసిన త్యాగాల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.