|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అవి నా చేతుల్లో ఉండవు: హృతిక్‌ రోషన్‌

Published: 04-10-2025, 9:29 PM
అవి నా చేతుల్లో ఉండవు: హృతిక్‌ రోషన్‌

వార్ 2 చిత్రం ఫలితంపై నటుడు హృతిక్ రోషన్ స్పందించారు. హిట్లు, ఫ్లాపులు తన చేతుల్లో ఉండవని, వాటిని ప్రేక్షకులే నిర్ణయిస్తారని ఆయన అన్నారు. తన వంతుగా 100 శాతం కృషి చేయడమే ముఖ్యమని, ఫలితాలను సానుకూలంగా స్వీకరించాలని హృతిక్ అభిప్రాయపడ్డారు.

Key Points

1

సినిమా హిట్లు, ఫ్లాపులు ప్రేక్షకుల నిర్ణయం: హృతిక్ రోషన్.

2

తన కృషి 100 శాతం ఇవ్వడమే తన చేతుల్లో ఉంటుందని స్పష్టం చేశారు.

4

‘వార్ 2’ కోసం అయన్ ముఖర్జీతో కలిసి ఉత్సాహంగా పనిచేశానని తెలిపారు.

ఫలితాలు నా చేతుల్లో లేవు: హృతిక్

‘‘హీరో.. డైరెక్టర్‌.. నిర్మాత.. ఇలా ఓ సినిమాకి పనిచేసే నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ సినిమా విజయం సాధించాలనే కోరుకుంటారు. అయితే అన్ని సినిమాలూ విజయం సాధిస్తాయని చెప్పలేం. వందశాతం ఎఫర్ట్‌ పెట్టి పనిచేయడమే నా చేతుల్లో ఉంటుంది. హిట్లు, ఫ్లాపులు అనేవి నా చేతుల్లో ఉండవు.. వాటిని నిర్ణయించేది ప్రేక్షకులే. ఓ సినిమా ఫలితం ఎలా ఉన్నా పాజిటివ్‌గానే తీసుకోవాలి’’ అని హీరో హృతిక్‌ రోషన్‌ తెలిపారు. ఎన్టీఆర్, హృతిక్‌ రోషన్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వార్‌ 2’.

వార్ 2 సినిమా ఫలితంపై స్పందన

అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌పై ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల అయింది. భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ విషయంపై హృతిక్‌ రోషన్‌ తాజాగా స్పందించారు.

నటుడిగా నా బాధ్యత: హృతిక్ రోషన్

‘‘వార్‌ 2’ కోసం అయాన్‌ ముఖర్జీ చాలా కష్టపడ్డారు. తన ఎనర్జీ చూసి నాకు కూడా ఎంతో ఉత్సాహంగా పని చేయాలనిపించేది. ఈప్రాజెక్ట్‌ గురించి  నాకు పూర్తిగా తెలుసు కాబట్టి కబీర్‌ పాత్రను చాలా సరదాగా పూర్తి చేశాను. ఒక నటుడిగా మన బాధ్యతను 100 శాతం పూర్తి చే యాలి. ఫలితం ఎలా ఉన్నా ప్రతి దాన్ని సీరియస్‌గా కాకుండా ఈజీగానే తీసుకోవాలి. అన్ని సినిమాలూ హిట్‌ అవుతాయనే నమ్మకంతోనే చేస్తాం. కానీ, ఫలితం మాత్రం ప్రేక్షకులే ఇస్తారు. వీటన్నిటినీ మనం పాజిటివ్‌గానే తీసుకోవాలి’’ అంటూ హృతిక్‌ రోషన్‌పోస్ట్‌ చేశారు.

మొత్తం మీద, ‘వార్ 2’ ఫలితం ఎలా ఉన్నా హృతిక్ రోషన్ సానుకూలంగా స్పందించారు. నటుడిగా తన బాధ్యత శ్రద్ధగా పని చేయడమేనని, సినిమా విజయానికి ప్రేక్షకుల ఆదరణే కీలకమని ఆయన పునరుద్ఘాటించారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.