
📌 Key Points
- అల్లు శిరీష్ పెళ్లి వార్త వైరల్: నయనకతో మార్చి 6న గ్రాండ్ వెడ్డింగ్!
- వరుణ్ తేజ్ పెళ్లిలో చిగురించిన ప్రేమ: లావణ్య స్నేహితురాలితో శిరీష్ లవ్ స్టోరీ!
- గతంలో బ్రేకప్స్: పెద్దింటి అమ్మాయితో ప్రేమ, ఆర్థిక ఇబ్బందులు!
- ముంబైలో మోడల్‌తో ఎఫైర్: పార్టీల కోసం బస్సులో వెళ్లి డబ్బులు ఆదా చేసేవాడినని శిరీష్!
టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే గతంలో ఆయన ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్స్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆ వివరాలు చూద్దాం!
శిరీష్ పెళ్లి: నయనకతో మూడు ముళ్ల బంధం!
టాలీవుడ్ యంగ్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. గత మూడేళ్లుగా తాను ప్రేమించిన నయనికతో శిరీష్ నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. మార్చ్ 6న వీరి పెళ్లి గ్రాండ్ గా చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే వీరి పెళ్లి పనులు మొదలయ్యాయి. రీసెంట్ గా పసుపు దంపుడు కార్యక్రమంతో పనులు మొదలు పెట్టి.. మొదటి పత్రికను మెగాస్టార్ చిరంజీవికి అందించారు. మిగిలిని కార్యక్రమాలు చకచకా జరిగిపోతున్నాయి.
వరుణ్ తేజ్ పెళ్లితో మొదలయ్యింది అల్లు శిరీష్ లవ్ స్టోరీ. వరుణ్ తేజ్ భార్య.. హీరోయిన్ లావణ్య త్రిపాటి స్నేహితురాలు కావడం.. పెళ్లిలో మొదలైన పరిచయం.. ప్రేమగా మారి.. పెళ్లి వరకూ వచ్చింది. దాదాపు మూడేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇప్పుడు పెళ్లితో ఒక్కటవబోతున్నారు.
ఈ నేపథ్యంలో అల్లు శిరీష్ గతంలో వెల్లడించిన ఒక ప్రేమకథ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. గతంలో ఆయన ప్రేమలో పడటం బ్రేకప్ చెప్పండ గురించి పలు ఇంటర్వ్యూలలో ప్రస్తావించారు.
గతంలో బ్రేకప్స్: శిరీష్ లవ్ లైఫ్ సీక్రెట్స్!
అల్లు శిరీష్ పలు ఇంటర్వ్యూలలో తన లవ్ బ్రేకప్ గురించి ప్రస్తావించారు. గతంలో ఆయన ఓ పెద్దింటి అమ్మాయితో ప్రేమలో పడ్డినట్టు ఒప్పుకున్నారు. అప్పుడు కొన్ని పరిణామాల వల్ల బ్రేకప్ జరిగి చాలా బాధపడ్డానన్నారు. అందులోంచి బయటపడటానికి చాలా రోజులు టైమ్ పట్టిందన్నారు శిరీష్. అయితే అంతకు ముందు కూడా శిరీష్ ప్రేమలో పడ్డారు. కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమించాడట. కానీ అప్పుడు బ్రేకప్ చెప్పడం పెద్ద ఇబ్బందిగా అనిపంచలేదని ఆయన అన్నారు.
గతంలో అల్లు శిరీష్ ప్రముఖ యాంకర్ ప్రదీప్ నిర్వహించిన కొంచెం టచ్ లో ఉంటే చెపుతా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా తన చదువుకునే రోజులలో జరిగిన ప్రేమకథ గురించి వివరించారు. శిరీష్ మాట్లాడుతూ, తాను ముంబైలో చదువుకుంటున్న సమయంలో ఒక మోడల్‌ను ప్రేమించానని తెలిపారు.
ముంబై మోడల్: అల్లు వారి అబ్బాయి లవ్ కహానీ!
ఆమె వీకెండ్‌లలో తరచూ పబ్‌లు, పార్టీలకు తీసుకెళ్లేదని చెప్పారు. అటువంటి అవుటింగ్స్‌కి వెళ్లినప్పుడు నాలుగు నుండి ఐదు వేల రూపాయలు ఖర్చవుతాయని పేర్కొన్నారు. ఆమె ముందు తన స్థాయిని తగ్గించుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో డబ్బు అవసరమయ్యేదని వెల్లడించారు.
డబ్బుల కోసం ఇంటికి ఫ్లైట్‌లో వస్తానని చెప్పి 8,000 రూపాయలు తీసుకుని, వాస్తవానికి బస్సులో వెళ్లి రావడం ద్వారా కేవలం 1,500 రూపాయలతో ప్రయాణం పూర్తి చేసేవాడినని చెప్పారు. మిగిలిన డబ్బును గర్ల్‌ఫ్రెండ్‌ను మెయింటైన్ చేయడానికి ఖర్చు చేసేవాడినని తెలిపారు. అయితే ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు భరించలేక ఆరు నెలలకే ఆ సంబంధం ముగిసిందని వెల్లడించారు.
అల్లు శిరీష్ పెళ్లి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. ఆయన జీవితంలో జరిగిన ఈ కీలక పరిణామాల గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


