|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పిల్లల విషయంలో అల్లు శిరీష్ సంచలన నిర్ణయం! తెలుగులోనే మాట్లాడాలట!

Published: 13-03-2026, 6:05 AM
పిల్లల విషయంలో అల్లు శిరీష్ సంచలన నిర్ణయం! తెలుగులోనే మాట్లాడాలట!
  • అల్లు శిరీష్, నైనికల వివాహం మార్చి 6న కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది.
  • వివాహం తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
  • పిల్లలు పుట్టిన తర్వాత ఇంట్లో తెలుగులోనే మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
  • నైనిక మనస్తత్వం, సెన్సాఫ్ హ్యూమర్ శిరీష్‌కు చాలా ఇష్టమని చెప్పారు.

అల్లు శిరీష్, నైనిక దంపతులు పిల్లల విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ పిల్లలు పుట్టిన తర్వాత ఇంట్లో తెలుగులోనే మాట్లాడాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

అల్లు శిరీష్, నైనికల వివాహ వేడుక

Allu Sirish Nainika: అల్లు శిరీష్ నయనిక ఇటీవల పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అల్లు శిరీష్ పెళ్లి చేసుకున్న నైనిక రెడ్డి సినిమా ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధం లేని కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. పారిశ్రామికవేత్త కుటుంబానికి చెందిన నైనిక అల్లు శిరీష్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉంటూ వీరిద్దరూ మార్చి ఆరవ తేదీ కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇక పెళ్లి తర్వాత ఈ జంట ఎంతో బిజీ బిజీగా గడుపుతున్నారు.

ఇలా పెళ్లయిన వెంటనే కొత్తజంట ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అల్లు శిరీష్ నైనికతో తన ప్రేమ పెళ్లి గురించి అలాగే పిల్లల గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను తెలియ చేశారు. నైనిక తనకు నితిన్ షాలిని ఏర్పాటు చేసిన ఒక పార్టీలో పరిచయమైందని తెలిపారు. వీరిద్దరూ లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ పెళ్లి సమయంలో ఒక పార్టీ ఏర్పాటు చేశారని నైనిక శాలిని ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కావడంతో నైనిక అక్కడికి వచ్చిందని అక్కడే తనని మొదటిసారి చూసానని తెలిపారు. అప్పటి నుంచి నయనిక తనకు మంచి స్నేహితురాలు మాత్రమే కాకుండా ఇద్దరి మధ్య ప్రేమ కూడా చిగురించిందని తెలిపారు.

ప్రేమ, పెళ్లి గురించి శిరీష్ దంపతుల ఆసక్తికర విషయాలు

ఇలా మా ప్రేమ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాము అయితే ఒకసారి నైనికతో కలిసి తాను కేఫ్ కు వెళ్లానని అక్కడ తెలిసిన వాళ్ళు మా ఇద్దరిని చూసి ఈ విషయం మా ఇంట్లో వారికి చెప్పారని శిరీష్ తన ప్రేమ వ్యవహారం గురించి బయటపెట్టారు. ఇక నైనిక సోదరి నిహారిక ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కావడంతో మా లవ్ స్టోరీ తెలిసిపోయిందని తెలిపారు. ఇక నైనిక గురించి మాట్లాడుతూ తను చాలా మంచి అమ్మాయి తనలో నాకు నచ్చే అంశం ఏ విషయం గురించైనా ముక్కుసూటిగా మాట్లాడుతుంది. ఏదైనా తనకు నచ్చకపోతే నచ్చలేదని నిర్మొహమాటంగా చెబుతుందని శిరీష్ తెలిపారు.

తన సెన్సాఫ్ హ్యూమర్ అంటే నాకు చాలా ఇష్టమని భార్య గురించి శిరీష్ తెలిపారు. తనతో డేటింగ్ లో ఉన్న సమయంలోనే ఇద్దరం ఫ్యామిలీ గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకునేవారిమని అలాగే పిల్లల విషయంలో నేను నైనిక కీలక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మాకు పుట్టబోయే పిల్లలు ఇంట్లో ఖచ్చితంగా తెలుగు మాట్లాడాలని ఇద్దరం నిర్ణయం తీసుకున్నాము అంటూ శిరీష్ తెలిపారు. ఇటీవల కాలంలో తెలుగులో మాట్లాడితే హేళనగా చూస్తున్నారు అలాంటిది వీరిద్దరూ తమ పిల్లలకు తెలుగులోనే మాట్లాడాలని నియమం పెడతామని చెప్పడంతో ఈ జంటపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్హ ఎంతో స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక వీరి హనీమూన్ గురించి కూడా ప్రశ్నలు ఎదురవడంతో ప్రస్తుతం ఇద్దరం బిజీగా ఉన్నామని ఒక అపార్ట్మెంట్ ను రెడీ చేసుకునే పనులలో బిజీగా ఉన్నట్లు శిరీష్ తెలిపారు.

పిల్లల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న జంట

అల్లు శిరీష్, నైనిక తమ పిల్లలకు తెలుగు నేర్పించాలనే నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. మాతృభాషను కాపాడుకోవాలనే వారి తపనకు అందరూ జేజేలు పలుకుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.