|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సందీప్ కిషన్ సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా! ‘సూపర్ సుబ్బు’ ట్రైలర్ సృష్టించిన సంచలనం!

Published: 24-06-2026, 12:12 PM
సందీప్ కిషన్ సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా! ‘సూపర్ సుబ్బు’ ట్రైలర్ సృష్టించిన సంచలనం!
  • సందీప్ కిషన్ ‘సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్’ పాత్రలో కనిపించనున్నాడు.
  • సాంప్రదాయ గ్రామంలో లైంగిక విద్యపై అవగాహన కల్పించే కథాంశం.
  • మల్లిక్ రామ్ దర్శకత్వంలో హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది.
  • మిథిలా పాల్కర్, బ్రహ్మానందం, మురళీశర్మ కీలక పాత్రల్లో నటించారు.

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ సరికొత్త వెబ్ సిరీస్ ‘సూపర్ సుబ్బు’ ట్రైలర్ విడుదలైంది. సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా సందీప్ కిషన్ ఒక సంప్రదాయ గ్రామంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడనేది ఈ సిరీస్ కథాంశం. బోల్డ్ సబ్జెక్ట్‌ను కామెడీతో మిళితం చేసి రూపొందించిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

సందీప్ కిషన్ కొత్త ప్రయోగం: ‘సూపర్ సుబ్బు’

Super Subbu Trailer: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ రూట్ మార్చాడు. కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న ఈ క్రేజీ హీరో, ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై సరికొత్త రచ్చ చేయడానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వెబ్ సిరీస్‌ల హవా నడుస్తోంది. స్టార్ హీరోలు సైతం ఓటీటీ ప్రాజెక్టులపై మక్కువ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే సందీప్ కిషన్ నటించిన సరికొత్త తెలుగు కామెడీ వెబ్ సిరీస్ ‘సూపర్ సుబ్బు’ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలై యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇందులో సందీప్ సరసన బాలీవుడ్ బ్యూటీ మిథిలా పాల్కర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమెకు తెలుగులో ఇది మంచి ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ సిరీస్ లో అసలు కథేంటో ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. ‘ఓ అమాయక యువకుడు.. అత్యంత సంప్రదాయ గ్రామం.. అసాధ్యమైన ఓ ఉద్యోగం’ అంటూ మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. అసలు విషయం ఏంటంటే, ఈ సిరీస్‌లో సందీప్ కిషన్ ‘సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్’ అనే వినూత్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. కనీస అక్షర జ్ఞానం కూడా లేని, సాంప్రదాయాలకు పెద్దపీట వేసే ఒక పల్లెటూరికి వెళ్లి, అక్కడి ప్రజలకు లైంగిక విద్యపై అవగాహన కల్పించే బాధ్యతను మన సుబ్బు తీసుకుంటాడు.

బోల్డ్ సబ్జెక్ట్‌తో కామెడీ పంచ్

అసలే పల్లెటూరు, ఆపై మాట్లాడటానికే సంకోచించే సెక్స్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్. ఇక అక్కడ సుబ్బుకు ఎలాంటి విచిత్రమైన పరిస్థితులు ఎదురయ్యాయి, ఆ ఊరి జనాలు అతడిని ఎలా చూశారు, ఆ అసాధ్యమైన మిషన్‌ను సుబ్బు ఎలా సాధ్యం చేశాడనేది ఫుల్ లెంగ్త్ హిలేరియస్ కామెడీతో మల్లిక్ రామ్ తెరకెక్కించారు.

గతంలో ‘అద్భుతం’, ‘డీజే టిల్లు’ వంటి విభిన్నమైన సినిమాలతో డైరెక్టర్‌గా తన మార్క్ చూపించిన మల్లిక్ రామ్, ఈ సిరీస్‌ను అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా మలిచారు. ట్రైలర్‌లో చూపించిన పంచ్ డైలాగులు, సుబ్బు పడే పాట్లు నవ్వులు పూయిస్తున్నాయి. కేవలం కామెడీ మాత్రమే కాకుండా సొసైటీకి అవసరమైన ఒక మంచి సందేశాన్ని కూడా చాలా సున్నితంగా, వినోదాత్మకంగా చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలోని సీనియర్ నటులు మురళీశర్మ, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఈ సిరీస్‌లో కీలక పాత్రలు పోషించడం మరో విశేషం. ముఖ్యంగా బ్రహ్మానందం మార్క్ కామెడీ, సంపూ కామెడీ టైమింగ్ ఈ సిరీస్‌కు మేజర్ అసెట్ కానున్నాయి.

ట్రైలర్‌లో హైలైట్స్, నటీనటులు

ఇక సందీప్ కిషన్ కెరీర్ విషయానికి వస్తే, ఇటీవల ఆయన ‘కెప్టెన్ మిల్లర్’,ధనుష్‌ దర్శకత్వంలో వచ్చిన రాయన్ లో నటించి మంచి మార్కులే కొట్టేశాడు.అయితే చివరిగా వచ్చిన మజాకా మాత్రం అనుకున్నంతగా మెప్పించలేకపోయింది.అయితే తాజాగా వచ్చిన ఈ ట్రైలర్ మాత్రం ఓటీటీ ఆడియన్స్‌కు ఫుల్ మీల్స్ లాంటి వినోదాన్ని పంచడం ఖాయంగానే కనిపిస్తుంది.ఈ సినిమా గ్లోబల్ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ క్రేజీ వెబ్ సిరీస్ జూలై 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఒకేసారి అందుబాటులోకి తీసుకురానున్నారు.చూడాలి మరి ట్రైలర్ క్రియేట్ చేసిన హైప్‌తో జూలై 2న నెట్‌ఫ్లిక్స్ లో ఎలాంటి రచ్చ చేస్తుందో !

‘సూపర్ సుబ్బు’ వెబ్ సిరీస్ కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా, సమాజానికి అవసరమైన ఒక ముఖ్యమైన సందేశాన్ని కూడా హాస్యభరితంగా అందించనుంది. సందీప్ కిషన్ కెరీర్‌లో ఇది ఒక వినూత్నమైన, విజయవంతమైన ప్రాజెక్ట్‌గా నిలవాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.