|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’: టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్! సంచలనానికి వేళాయే?

Published: 14-03-2026, 8:35 AM
సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్': టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్! సంచలనానికి వేళాయే?
  • సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.
  • మార్చి 16న సాయంత్రం 4:06 గంటలకు టీజర్ విడుదల కానుంది.
  • ఈ చిత్రంలో మమిత బైజు, రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
  • జూలైలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. మార్చి 16న సాయంత్రం 4:06 గంటలకు టీజర్ విడుదల కానుంది. ఈ సినిమా జూలైలో విడుదల కానుంది.

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ విడుదల తేదీ ప్రకటన

Vishwanath And Sons: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya), టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ‘సూర్య46’ చిత్రానికి ఇటీవల ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ (Vishwanath & Sons) అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టైటిల్ అనౌన్స్ అయిన తర్వాత సినిమాపై భారీగా అంచనాలు మొదలయ్యాయి. ఎందుకంటే, టైటిల్ అంత క్లాసీగా ఉంది మరి. అలాగే ఎప్పుడూ లేని విధంగా సూర్య ఒక చిన్నారితో కలిసి కనిపించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు.. సినిమాపై మరింత క్రేజ్‌కు కారణమయ్యాయి. గత కొంతకాలంగా సూర్యకు అందని ద్రాక్షగా మారిన సక్సెస్.. ఈ సినిమాతో రాబోతుందనే ఫీల్‌ని ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ కలగజేశాయి. దీంతో సాధారణంగానే ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు.

సినిమాలో నటీనటులు, ఇతర వివరాలు

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్‌ విడుదలకు సంబంధించిన అప్డేట్ (Vishwanath & Sons Teaser Release Update) ఇది. ఈ మూవీ టీజర్‌ను మార్చి 16వ తేదీ సాయంత్రం 4 గంటల 06 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ప్రధాన పాత్రలు పోషిస్తున్న వారిద్దరూ నడుచుకుంటూ వస్తున్నారు. వారి ఫేస్‌లు మాత్రం ఇందులో రివీల్ చేయలేదు. కేవలం నడిచి వస్తున్నట్లుగా కాళ్లను మాత్రమే చూపించారు. సోమవారం వచ్చే టీజర్‌తో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరుగుతాయిని మేకర్స్ చెబుతున్నారు. భారీ స్థాయి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మమిత బైజు, రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ వంటివారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

జూలైలో ప్రపంచవ్యాప్తంగా విడుదల

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ని శరవేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రాన్ని జూలైలో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనగా.. వాటిని రెట్టింపు చేసేలా టీజర్ ఉంటుందని మేకర్స్ చెబుతుండటంతో.. నిజంగానే ఈ మూవీ టీజర్ కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఎక్కడా రాజీ పడకుండా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూలైలో సినిమా విడుదల కానుండగా, టీజర్ అంచనాలను మరింత పెంచే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.