
📌 Key Points
- హరికృష్ణ సోమిశెట్టి నిర్మాణంలో ‘ది రెడ్ బ్యాగ్’ మూవీ తెరకెక్కుతోంది.
- రవి కుమార్ సీరపు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.
- దినేష్ తేజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
- త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
హరికృష్ణ సోమిశెట్టి నిర్మాణంలో రవి కుమార్ సీరపు దర్శకత్వంలో ‘ది రెడ్ బ్యాగ్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. దినేష్ తేజ్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. త్వరలోనే సినిమా విడుదల కానుంది.
‘ది రెడ్ బ్యాగ్’ మూవీ షూటింగ్ పూర్తి
Red Bag: డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్ చిత్రాల్ని జనాలు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ప్రస్తుతం థియేటర్, ఓటీటీల్లో ఎక్కువగా కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలే విజయాన్ని సాధిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ బ్యాగ్ చుట్టూ తిరిగే కథతో ‘ది రెడ్ బ్యాగ్’ అనే సినిమాని హరికృష్ణ సోమిశెట్టి నిర్మించారు. ఈ మూవీకి రవి కుమార్ సీరపు కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వర్తించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను టీం పూర్తి చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
Read also- Pradeep Ranganathan: పెళ్లి ఎవర్ని చేసుకోవాలో కూడా ఏఐ చెబుతుందేమో -ప్రదీప్!
ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన దినేష్ తేజ్
కబీర్ దుహన్ సింగ్ , ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బదల్, భార్గవి తదితరులు నటించిన ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హీరో దినేష్ తేజ్, రైటర్, డైరెక్టర్ హరి ప్రసాద్ రిలీజ్ చేసి చిత్రయూనిట్‌కు బెస్ట్ విషెస్ అందించారు. ఈ మూవీకి శేఖర్ మోపురి సంగీతమందించగా,విక్రమ్ రాజా రచన సహకారం అందించారు. ప్రియేష్ గురుసామి కెమెరామెన్‌గా, శివ శర్వాని,శశి ఎడిటర్‌గా పని చేశారు.
త్వరలో విడుదల కానున్న ‘ది రెడ్ బ్యాగ్’
Read also- ఎట్టకేలకు బయటకు వచ్చిన ఇరాన్ సుప్రీం మొజ్తబా ఖమేనీ.. నేరుగా వార్ రూమ్‌లోకి ఎంట్రీ, ఏఐ అంటూ..
మొత్తానికి ‘ది రెడ్ బ్యాగ్’ చిత్రం ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.


