|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అల్లు శిరీష్ పెళ్లిపై అరవింద్ సంచలన నిర్ణయం! ప్రేమ వివాహానికి గ్రీన్ సిగ్నల్ వెనుక అసలు కథేంటి?

Published: 07-02-2026, 1:35 AM
అల్లు శిరీష్ పెళ్లిపై అరవింద్ సంచలన నిర్ణయం! ప్రేమ వివాహానికి గ్రీన్ సిగ్నల్ వెనుక అసలు కథేంటి?
  • మార్చి 6న అల్లు శిరీష్, నైనిక రెడ్డి వివాహం జరగనుంది.
  • దుబాయ్‌లో బ్యాచిలర్ పార్టీ చేసుకున్న శిరీష్.
  • ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని శిరీష్‌కు అల్లు అరవింద్ సలహా.
  • నైనిక రెడ్డి బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి.

అల్లు శిరీష్ త్వరలో నైనిక రెడ్డిని వివాహం చేసుకోబోతున్నారు. వీరి వివాహానికి అల్లు అరవింద్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక ఒక ఆసక్తికరమైన కారణం ఉంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అల్లు శిరీష్ పెళ్లి వేడుకలు ప్రారంభం

Allu Sirish: అల్లువారి ఇంట పెళ్లి సందడి మొదలైన విషయం తెలిసిందే. మార్చి 6వ తేదీ అల్లు శిరీష్ (Allu Sirish) తను ప్రేమించిన అమ్మాయి నైనిక రెడ్డితో కలిసి ఏడడుగులు వేయబోతున్నారు. ఇప్పటికే వీరి నిచ్చితార్థం ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 31వ తేదీ ఈ జంట కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. ఇక వీరి వివాహం మరొక నెలలో జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి.. ఇప్పటికే ఈ జంట దుబాయిలో తన సన్నిహితులకు ఘనంగా బ్యాచిలర్ పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఇలా పెళ్లి పనులలో అల్లు శిరీష్ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉండగా అల్లు శిరీష్ పెళ్లికి సంబంధించి ఒక ఓల్డ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇందులో భాగంగా అల్లు శిరీష్ పెళ్లి విషయంలో అల్లు అరవింద్ నిర్ణయం గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న అల్లు శిరీష్ కు ఎదురైంది. ఈ విషయం గురించి అల్లు శిరీష్ మాట్లాడుతూ.. పెళ్లి విషయంలో మా నాన్న నాకు ఒక గొప్ప మాట చెప్పారు. పెళ్లి అనేది ఎప్పుడు కూడా వయసు వచ్చిందని లేకపోతే సమాజం గురించి ఆలోచించి, అదేవిధంగా తల్లిదండ్రులు కావాలన్న ఉద్దేశంతో పెళ్లి చేసుకోకూడదని చెప్పారు.

ప్రేమ వివాహంపై అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్

ఈ అమ్మాయితో నేను నా జీవితం మొత్తం గడపాలని ఉంది. ఈ అమ్మాయి తప్ప నాకేం వద్దని నీ మనసులో ఆలోచన వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవాలి కానీ ఎవరికోసమో పెళ్లి చేసుకుని ఇబ్బందులు పడకూడదు. అలాంటి అమ్మాయి నీకు కనిపించినప్పుడు మాకు చెప్పు ఆ అమ్మాయితోటే నీ పెళ్లి చేస్తాము అంటూ తన తండ్రి అల్లు అరవింద్ చెప్పినట్టు శిరీష్ తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో అల్లు అరవింద్ ఇచ్చిన మాట పైనే నిలబడి శిరీష్ ప్రేమించిన అమ్మాయితోనే తనకు వివాహం జరిపిస్తున్నారంటూ అభిమానులకు కామెంట్ చేస్తున్నారు.

అల్లు శిరీష్ నైనిక ఇద్దరిదీ ప్రేమ వివాహం అనే సంగతి తెలిసిందే. దాదాపు రెండు సంవత్సరాలపాటు ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇక నైనిక రెడ్డి సైతం ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి కాదనే చెప్పాలి నైనిక బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయని తెలుస్తుంది. ఇక ఈమె నితిన్ భార్య శాలినికి మంచి స్నేహితురాలు వీరిద్దరూ కలిసి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి బ్యాచిలర్ పార్టీలో సందడి చేశారు. ఆ సమయంలోనే అల్లు శిరీష్ నైనికకు పరిచయం అయ్యారని అలా వారి పరిచయం ప్రేమగా మారిందని శిరీష్ పలు సందర్భాలలో తన ప్రేమ విషయాన్ని బయటపెట్టారు.

నైనిక రెడ్డి గురించి ఆసక్తికర విషయాలు

అల్లు అరవింద్ తన కొడుకు ప్రేమకు విలువనిచ్చి నైనిక రెడ్డితో వివాహం జరిపించడానికి అంగీకరించడం అభినందనీయం. వారిద్దరూ సంతోషంగా ఉండాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.