
📌 Key Points
- వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో అనిల్ రావిపూడి కొత్త సినిమా. షూటింగ్ ప్రారంభమైంది.
- వెంకటేష్ ఫ్లాష్‌బ్యాక్‌లో యంగ్, స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారని సినీ వర్గాల్లో టాక్.
- కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి.
- నవంబర్‌లోపు సినిమా షూటింగ్ పూర్తి చేయాలని దర్శకుడు అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నారు.
టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా వెంకటేష్ లుక్‌పై ఓ ఆసక్తికరమైన రూమర్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
వెంకీ మామ యంగ్ లుక్ వెనుక రహస్యం!
Venki – AnilRavipudi : టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలలో నటిస్తున్నారు.. ఈ ఏడాది చిరంజీవి నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాను చేశాడు.. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ఇప్పుడు మళ్లీ వెంకటేష్ తో ఈ డైరెక్టర్ మరో సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో షూటింగ్ మొదలైంది. కొబ్బరికాయ కొట్టి రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించారు. ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.. వెంకీ లుక్ గురించి ఓ క్రేజీ రూమర్ వినిపిస్తుంది.. అదేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, యంగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో అనిల్ రావిపూడి ఓ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. ఇటీవల ఏ సినిమాకు పూజా కార్యక్రమాలను పూర్తి చేశారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది.. ఈ క్రమంలో ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. అదేంటంటే ఫ్లాష్ బ్యాక్ లో వెంకటేష్ కాస్త యంగ్ లుక్ లో కనిపించబోతున్నాడని టాక్.. హెయిర్ స్టైల్‌తో పాటు వెంకీ డ్రెసింగ్ స్టైల్ కూడా మారుస్తున్నారట.. మొత్తానికి వెంకీ మామ స్టైలు ఈ సినిమాలో కాస్త యంగ్గా ఉంటుందని తెలుస్తుంది. అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఈయన కనిపించబోతున్నాడని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మల్టీస్టారర్
సినిమాలో కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్
సీనియర్ హీరోయిన్ వెంకటేష్ కుర్రాడిగా ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. అదేవిధంగా కళ్యాణ్ రామ్ మాత్రం వెంకటేష్ కు పూర్తిగా వ్యతిరేకంగా కనిపించబోతున్నాడని సమాచారం.. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ పూర్తి భిన్నంగా ఉంటారని టాక్.. ఈ సినిమాలో కామెడీ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది.. ఈనెల 22 నుంచి షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతుంది.. నవంబర్ లోపు ఈ సినిమా షూట్ పూర్తి చేయాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఇందులో హీరోయిన్లు గా కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సాహు గారపాటి నిర్మాణంలో రానున్న ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.. జనవరి 13న విడుదల అనే టైటిల్ ను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్.. అనిల్ రావీపూడి సినిమాలలో కామెడీ ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. అందులో వెంకటేష్ తో తీస్తున్న సినిమా కాబట్టి కామెడీ పక్కాగా ఉంటుందని తెలుస్తుంది.. మరి ఈ మల్టీస్టారర్ మూవీ ఎలాంటి క్రేజ్ ని తెచ్చుకుంటుందో చూడాలి.. త్వరలోనే ఈ సినిమా గురించి ఒక కీలక అప్డేట్ రానుందని ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం…
వెంకటేష్ యంగ్ లుక్, కళ్యాణ్ రామ్ భిన్నమైన పాత్రతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

