
అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహా పుట్టినరోజు వేడుకలు ఆమ్‌స్టర్ డామ్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి. బన్నీతో కలిసి విదేశీ పర్యటనలో దిగిన బర్త్ డే ఫొటోలను స్నేహా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా, అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Key Points
అల్లు అర్జున్, స్నేహా విదేశీ పర్యటనకు వెళ్లారు.
ఆమ్‌స్టర్ డామ్‌లో స్నేహా పుట్టినరోజు వేడుకలు జరిగాయి.
సెప్టెంబరు 29న స్నేహా తన బర్త్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు.
స్నేహా పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అల్లు అర్జున్‌తో కలిసి ఫారిన్ ట్రిప్
‘పుష్ప 2’ సినిమాతో ఇతర దేశాల్లోనూ క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం దర్శకుడు అట్లీతో ఓ భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నాడు. గత కొన్నాళ్లుగా ముంబైలో షూటింగ్ జరుగుతోంది. అయితే కొన్నిరోజుల క్రితం బ్రేక్ తీసుకున్న బన్నీ.. భార్య స్నేహాతో కలిసి ఫారిన్ ట్రిప్ వేశాడు. అక్కడ స్నేహా పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫొటోల్ని ఇప్పుడు ఈమె తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
సెప్టెంబరు 29న స్నేహా పుట్టినరోజు. ఈ క్రమంలోనే ఈమె తన భర్త అల్లు అర్జున్‌తో కలిసి ఆమ్‌స్టర్ డామ్ దేశానికి వెళ్లిపోయింది. అక్కడే బర్త్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. తాజాగా ఆ దేశంలో తిరుగుతున్న కొన్ని ఫొటోలని స్నేహా పోస్ట్ చేసింది. ఇప్పుడు పుట్టినరోజుని బన్నీ, తాను మాత్రమే సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పి కొన్ని ఫొటోలని షేర్ చేసింది. ఇవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఆమ్‌స్టర్ డామ్‌లో స్నేహా పుట్టినరోజు
వైరల్ అవుతున్న సెలబ్రేషన్స్ ఫొటోలు
అల్లు స్నేహా తన పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఫొటోలను షేర్ చేయడంతో, అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బన్నీ, స్నేహా కలిసి ఆమ్‌స్టర్ డామ్‌లో గడిపిన క్షణాలను ఆస్వాదిస్తూ, వారి బంధంపై ప్రేమను కురిపిస్తున్నారు.


