
📌 Key Points
- అల్లు శిరీష్ పెళ్లిలో స్నేహారెడ్డి ప్రత్యేకంగా డిజైన్ చేయించిన చీర అందరి దృష్టిని ఆకర్షించింది.
- స్నేహారెడ్డి తన 15వ పెళ్లిరోజు సందర్భంగా భర్త, పిల్లల ఫోటోలతో చీరను డిజైన్ చేయించారు.
- దాసరి పార్వతి ఈ చీరను ప్రత్యేకంగా డిజైన్ చేశారు, దీని విలువ దాదాపు 3 లక్షలు.
- కుటుంబంపై ప్రేమను చాటుతూ చీరను డిజైన్ చేయించిన స్నేహారెడ్డిపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి తన భర్త మరియు పిల్లల ఫోటోలతో ప్రత్యేకంగా డిజైన్ చేయించిన చీరతో వార్తల్లో నిలిచారు. అల్లు శిరీష్ పెళ్లి వేడుకలో ఈ చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
అల్లు స్నేహారెడ్డి చీర డిజైన్ వెనుక కథ
Allu Sneha Reddy: అల్లు స్నేహారెడ్డి పరిచయం అవసరం లేని పేరు. ఈమె అల్లు అర్జున్(Allu Arjun) భార్యగా అందరికీ సుపరిచితమే అల్లు స్నేహారెడ్డి ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి కాకపోయినా తనకు హీరోయిన్లను మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్నేహ రెడ్డి ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్ లో అభిమానులను ఆకట్టుకుంటూ తన కుటుంబానికి తన భర్తకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇక ఇటీవల అల్లు శిరీష్ పెళ్లి వేడుకలలో భాగంగా స్నేహ రెడ్డికి సంబంధించిన ఫోటోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.
ఇకపోతే అల్లు శిరీష్ పెళ్లి రోజున అల్లు అర్జున్ స్నేహ రెడ్డి 15వ పెళ్లిరోజు అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈ దంపతులు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి 15 సంవత్సరాలు అయిన నేపథ్యంలో అల్లు అర్జున్ తన భార్యకు ఖరీదైన కారును కూడా కానుకగా అందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇక శిరీష్ పెళ్లి వేడుకలలో భాగంగా స్నేహారెడ్డి కట్టుకున్న చీర అందరి దృష్టిని ఆకర్షించింది ట్రెడిషనల్ లుక్ లో ఈ జంట ఎంతో చూడముచ్చటగా కనిపించారు.
కుటుంబంపై ప్రేమను చాటిన స్నేహారెడ్డి
ఇకపోతే తాజాగా స్నేహ రెడ్డికి కట్టుకున్న చీరకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో భాగంగా ఈమె ఈ చీర పల్లు ప్రత్యేకంగా డిజైన్ చేయించారని తెలుస్తోంది. తమ పెళ్లి జరిగి 15 సంవత్సరాలు కావడంతో తన భర్త పిల్లల పట్ల తనకున్నటువంటి ప్రేమను చాటి చెప్పడం కోసం ఈ చీర కొంగు మీద అల్లు అర్జున్ స్నేహ రెడ్డితో పాటు తన ఇద్దరు పిల్లలు అర్హ అయాన్ ఫోటోలతో డిజైన్ చేయించారు. అంతేకాకుండా ఈ నలుగురి పేర్లను తెలుగులో చీరపై డిజైన్ చేయించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక ఈ చీరను దాసరి పార్వతీ ప్రత్యేకంగా డిజైన్ చేయించారని తెలుస్తోంది. ఇక ఈ చీర ఖరీదు దాదాపు 3 లక్షలకు పైగా విలువ చేస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ చీర ఖరీదు పక్కన పెడితే తన కుటుంబం పై ఉన్న ప్రేమను ఇలా బయట పెట్టడంతో స్నేహ రెడ్డికి తన ఫ్యామిలీ పట్ల ఉన్న ప్రేమను చూసి అభిమానులు కూడా ఎంతో ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. గతంలో పలువురు హీరోయిన్లు కూడా తమ ప్రేమను చీర పై డిజైన్ చేయిస్తూ వ్యక్తపరిచారు. ప్రస్తుతం స్నేహ రెడ్డి కూడా తన భర్త పిల్లల ఫోటోలను చీరపై డిజైన్ చేయించడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇక ఈమె కుటుంబ బాధ్యతలతో పాటు పలు వ్యాపారాలను కూడా నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేకపోయినా స్నేహ రెడ్డి ఒక యాడ్ వీడియోలో నటించి మొదటిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
వైరల్ అవుతున్న చీర ఫోటోలు, వీడియోలు
మొత్తానికి, అల్లు స్నేహారెడ్డి తన కుటుంబం పట్ల ఉన్న ప్రేమను చీర ద్వారా వ్యక్తపరచడం అందరినీ ఆకట్టుకుంది. ఈ ప్రత్యేకమైన డిజైన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


