
📌 Key Points
- హేమంత్ కుమార్ హీరోగా ‘ఆల్ఫా’ మూవీ ఫిబ్రవరి 20న విడుదల!
- ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా దర్శకుడు సముద్ర హాజరు
- హీరోయిన్లుగా అయానా, గోపిక సురేష్; మాస్ యాక్షన్ సీక్వెన్స్ అదుర్స్!
- ‘కేజీయఫ్’, ‘కాంతార’లా ఆదరించాలని సముద్ర ఆకాంక్ష!
హేమంత్ కుమార్ హీరోగా వస్తున్న ‘ఆల్ఫా’ మూవీతో టాలీవుడ్‌లో మరో సంచలనం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 20న విడుదల కాబోతోంది. ట్రైలర్ విడుదల వేడుకలో సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఫిబ్రవరి 20న ‘ఆల్ఫా’ విడుదల!
ఎల్ఎ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హేమంత్ కుమార్(Hemant Kumar), అయానా, గోపీక సురేష్ (Gopika Suresh)ప్రధాన పాత్రల్లో విజయ్ ఎన్ తెరకెక్కించిన చిత్రం ‘ఆల్ఫా’. ఈ సినిమాని హేమంత్ కుమార్, ఆనంద్ కుమార్ (Anand Kumar)నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 20న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మూవీని తెలుగులో రవిశంకర్, మంజునాథ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను నిర్వహించగా.. దర్శకుడు సముద్ర ముఖ్య అతిథిగా విచ్చేశారు. ‘అంతా ఆ దేవుడి అనుగ్రహంతో జరుగుతుంది అంటే.. మరి ఆ రాక్షసులు’ అనే డైలాగ్‌తో ట్రైలర్ స్టార్ట్ కాగా.. ఇక వెంటవెంటనే చూపించిన యాక్షన్ సీక్వెన్స్, రౌడీ గ్యాంగ్, మాఫియా సీన్లు అన్నీ అదిరిపోయాయి. ‘‘నేను బరిలోకి కొత్తగా వచ్చాను.. ఆటకు కాదు’ అనే హీరో డైలాగ్ మాసీగా ఉంది. మధ్యలో హీరో, హీరోయిన్ ట్రాక్.. రొమాంటిక్ సీన్లు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అదుర్స్!
‘నాకు పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అంతా మా నాన్నే’ అనే డైలాగ్‌తో ఇందులో ఫాదర్ సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఎలా ఉండబోతోన్నాయో చెప్పేశారు. ఈ కార్యక్రమంలో.. హీరో హేమంత్ కుమార్ మాట్లాడుతూ .. ‘నాకు తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. తెలుగు సినిమాలు ఎక్కువగా చూడటం వల్లే నాకు అంతో ఇంతో తెలుగు వచ్చింది. మా కోసం వచ్చిన సముద్ర గారికి థాంక్స్. రవిశంకర్ సార్ కన్నడలో మా కంటెంట్ చూసి నచ్చి ఈ చిత్రాన్ని తీసుకున్నారు. సినిమాలోని కంటెంట్ మీదున్న నమ్మకంతోనే ఈ మూవీని తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. నాలాంటి కొత్త వాళ్ల చిత్రాల్ని ఇలా ఎంకరేజ్ చేయడం ఆనందంగా ఉంది. ప్రేక్షకులు పెట్టే డబ్బులకు సరిపోయే ఎంటర్టైన్మెంట్‌ను మేం అందిస్తాం.
సముద్ర ప్రశంసలు.. భారీ అంచనాలు!
మా చిత్రంలోని కంటెంట్ బాగుంటుంది. ఎంతో నిజాయితీగా సినిమాని తీశాం. కన్నడలో మాకు మంచి స్పందన వస్తోంది. ఇక్కడ కూడా మాకు మంచి ఆదరణ దక్కుతుందని భావిస్తున్నాను’ అని చెప్పాడు. ప్రముఖ దర్శకుడు సముద్ర మాట్లాడుతూ .. ‘‘ఆల్ఫా’ ట్రైలర్ అద్భుతంగా ఉంది. హీరో చాలా హ్యాండ్సమ్‌లా ఉన్నారు. కన్నడ నుంచి వస్తున్న హీరోలంతా ఇక్కడ సక్సెస్ కొడుతున్నారు. యశ్, రిషబ్ శెట్టిలా హేమంత్ కూడా పెద్ద విజయాన్ని అందుకోవాలి. హీరో హీరోయిన్లు చక్కగా నటించారు. ‘కేజీయఫ్’, ‘కాంతార’ స్థాయిలో ‘ఆల్ఫా’ని ఆడియెన్స్ ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
హేమంత్ కుమార్ ‘ఆల్ఫా’ మూవీ ఫిబ్రవరి 20న విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


